ఆ తర్వాత మీ ఎల్పీజీ ఐడీ లేదా కన్స్యూమర్ నంబర్‌ను నమోదు చేయాలి. ఇది మీ పాత గ్యాస్ బిల్లు లేదా సిలిండర్ డెలివరీ స్లిప్పై ఉంటుంది. వివరాలు నమోదు చేసిన తర్వాత “ప్రొసీడ్”పై ట్యాప్ చేస్తే మీ అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. స్క్రీన్‌పై కనిపించే మీ పేరు, అడ్రస్, చివరిసారి సిలిండర్ బుక్ చేసిన తేదీ వంటి వివరాలను చెక్ చేయాలి. ఆ తర్వాత “బుక్ సిలిండర్”పై ట్యాప్ చేస్తే రీఫిల్ ఆర్డర్ పూర్తవుతుంది. ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ అందుబాటులో ఉంటే “ప్రొసీడ్ టు పే”పై ట్యాప్ చేసి మీకు నచ్చిన పేమెంట్ విధానాన్ని ఎంచుకోవచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. బుకింగ్ పూర్తయిన తర్వాత అది కన్ఫర్మ్ అవుతుంది. సిలిండర్ ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియజేస్తూ యూజర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)

