ప్రభన్యూస్

హుజూర్‌నగర్‌లో ఆక్రమణలపై పోలీసుల కొరడా.. ‘ఆపరేషన్ రోప్’తో రహదారులకు విముక్తి!

ప్రభ న్యూస్, హుజూర్‌నగర్, నవంబర్ 2:

హుజూర్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యల నివారణ, పాదచారుల భద్రతే లక్ష్యంగా పోలీసులు ‘ఆపరేషన్ రోప్’ కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం పట్టణంలోని ప్రధాన రహదారిపై ప్రత్యేక చర్యలు చేపట్టిన పోలీసులు రహదారులను ఆక్రమించిన ప్రాంతాలను గుర్తించి ఆక్రమణలను తొలగించారు. ఎస్సైలు చలికంటి నరేష్, హనుమాన్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై ఆక్రమణల కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు పాదచారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రహదారులపై వ్యాపార సామగ్రి, ఇతర వస్తువులు ఉంచడం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రహదారులను ఆక్రమణల నుంచి విముక్తం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.

ఆక్రమణల తొలగింపుతో వాహనాల రాకపోకలు సజావుగా సాగడంతో పాటు పాదచారులు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుంటుందని పోలీసులు పేర్కొన్నారు. పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చేపట్టిన ఈ కార్యక్రమానికి వ్యాపారులు, ప్రజలు సహకరించాలని ఎస్సైలు చలికంటి నరేష్, హనుమాన్ నాయక్ కోరారు. రహదారులను ఆక్రమించకుండా, వాహనాల రాకపోకలకు ఆటంకాలు కలిగించకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 9:19 pm Digital Edition : Prabhanews
<b>హుజూర్‌నగర్‌లో ఆక్రమణలపై పోలీసుల కొరడా.. ‘ఆపరేషన్ రోప్’తో రహదారులకు విముక్తి!</b>