ప్రభన్యూస్

భూసేకరణ బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు

హామీల అమలుకు అఖిలపక్ష ఐక్యతతో ఉద్యమం

12వ వార్డు కౌన్సిలర్ అమరరాపు ప్రవీణ్

ప్రభ న్యూస్ | హుజూర్‌నగర్ | నవంబర్ 2:

వ్యవసాయ కళాశాల నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హుజూర్‌నగర్ 12వ వార్డు కౌన్సిలర్ అమరరాపు ప్రవీణ్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 1041 సర్వే నంబర్‌కు సంబంధించి భూసేకరణ బాధిత రైతులకు నష్టపరిహారంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.భూసేకరణ, పరిహారం చెల్లింపులపై సమగ్ర విచారణ జరిపి పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని కోరారు. రైతుల సమస్య రాజకీయాలకు అతీతమని, అన్ని పార్టీల నాయకులు విభేదాలను పక్కనపెట్టి అఖిలపక్షంగా రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు సమిష్టి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ శీలం శ్రీను నాగమణి, 7వ వార్డు కౌన్సిలర్ వల్లపు నాగరాజు, 15వ వార్డు కౌన్సిలర్ శ్రీనాథ్ సుజాత, 16వ వార్డు కౌన్సిలర్ చిట్టిపోతుల రమేష్‌తో పాటు భూసేకరణ బాధిత రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 8:49 pm Digital Edition : Prabhanews
<b>భూసేకరణ బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు</b>