ప్రభన్యూస్

Anuj Thakur: 33 ఏళ్లకే విషాదాంతం.. నిద్రలోనే కన్నుమూసిన నటుడు! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బుల్లితెరపై ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించిన యువ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూశారు. హిందీ టెలివిజన్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 33 ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచారు.

News18
News18

బుల్లితెరపై ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించిన యువ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూశారు. హిందీ టెలివిజన్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 33 ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 27న ఈ విషాద ఘటన చోటుచేసుకోగా, ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో హిందీ టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

అనుజ్ ఠాకూర్ మరణవార్తను ఆయన స్నేహితుడు, కాస్టింగ్ డైరెక్టర్, సహనటుడు రూపేష్ సోనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 30న అనుజ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అనుజ్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమే కాదని, సొంత తమ్ముడిలాంటి వాడని పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి ఎన్నో ప్రాజెక్టులు చేయాలని అనుకున్నామని, కానీ ఇంత చిన్న వయసులోనే అతడు దూరమవడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అనుజ్ మరణానికి సంబంధించిన వివరాలు కూడా అందరినీ కలచివేస్తున్నాయి. రూపేష్ సోనార్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. అనుజ్ ప్రతిరోజూ ఉదయం 4:30 గంటలకే నిద్రలేచేవాడు. జిమ్, జాగింగ్ చేస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడు. అయితే ఘటన జరిగిన రోజు అలారం మోగుతున్నా అనుజ్ నిద్రలేవలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆయన తల్లి గదిలోకి వెళ్లి చూడగా, అప్పటికే అనుజ్ ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిద్రలో ఫిట్స్ రావడంతోనే అనుజ్ మరణించినట్లు రూపేష్ వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వైద్య వివరాలు అధికారికంగా వెల్లడించలేదు.

ఇక అనుజ్ ఠాకూర్ నటనా ప్రయాణం విషయానికి వస్తే.. 2007-08లో డిస్నీ ఛానెల్‌లో ప్రసారమైన ‘ధూమ్ మచావో ధూమ్’ సీరియల్‌తో ఆయన నటుడిగా అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘బంధన్ సాత్ జన్మో కా’, ‘బీంద్ బనూంగా ఘోడి చఢూంగా’, ‘మహిసాగర్’ వంటి పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. ముఖ్యంగా ‘బీంద్ బనూంగా ఘోడి చఢూంగా’లో జై పొద్దార్ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

ఇటీవలే రూపేష్ సోనార్‌ను కలిసిన అనుజ్.. మళ్లీ నటనలో బిజీ కావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే ఆయన మరణవార్త రావడం స్నేహితులను, అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఎంతో ఉత్సాహంగా జీవితాన్ని కొనసాగిస్తున్న యువ నటుడు ఇలా అకాల మరణం చెందడం బుల్లితెర పరిశ్రమకు తీరని లోటుగా మిగిలిపోయింది. అనుజ్ ఠాకూర్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 11:05 pm Digital Edition : Prabhanews
Anuj Thakur: 33 ఏళ్లకే విషాదాంతం.. నిద్రలోనే కన్నుమూసిన నటుడు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 02, 2026 11:04 PM ISTబుల్లితెరపై ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించిన యువ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూశారు. హిందీ టెలివిజన్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 33 ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచారు. News18బుల్లితెరపై ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించిన యువ నటుడు అనుజ్ ఠాకూర్ కన్నుమూశారు. హిందీ టెలివిజన్ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 33 ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 27న ఈ విషాద ఘటన చోటుచేసుకోగా, ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో హిందీ టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.అనుజ్ ఠాకూర్ మరణవార్తను ఆయన స్నేహితుడు, కాస్టింగ్ డైరెక్టర్, సహనటుడు రూపేష్ సోనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 30న అనుజ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అనుజ్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమే కాదని, సొంత తమ్ముడిలాంటి వాడని పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి ఎన్నో ప్రాజెక్టులు చేయాలని అనుకున్నామని, కానీ ఇంత చిన్న వయసులోనే అతడు దూరమవడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.అనుజ్ మరణానికి సంబంధించిన వివరాలు కూడా అందరినీ కలచివేస్తున్నాయి. రూపేష్ సోనార్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. అనుజ్ ప్రతిరోజూ ఉదయం 4:30 గంటలకే నిద్రలేచేవాడు. జిమ్, జాగింగ్ చేస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడు. అయితే ఘటన జరిగిన రోజు అలారం మోగుతున్నా అనుజ్ నిద్రలేవలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆయన తల్లి గదిలోకి వెళ్లి చూడగా, అప్పటికే అనుజ్ ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిద్రలో ఫిట్స్ రావడంతోనే అనుజ్ మరణించినట్లు రూపేష్ వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వైద్య వివరాలు అధికారికంగా వెల్లడించలేదు.ఇక అనుజ్ ఠాకూర్ నటనా ప్రయాణం విషయానికి వస్తే.. 2007-08లో డిస్నీ ఛానెల్‌లో ప్రసారమైన ‘ధూమ్ మచావో ధూమ్’ సీరియల్‌తో ఆయన నటుడిగా అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘బంధన్ సాత్ జన్మో కా’, ‘బీంద్ బనూంగా ఘోడి చఢూంగా’, ‘మహిసాగర్’ వంటి పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. ముఖ్యంగా ‘బీంద్ బనూంగా ఘోడి చఢూంగా’లో జై పొద్దార్ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.ఇటీవలే రూపేష్ సోనార్‌ను కలిసిన అనుజ్.. మళ్లీ నటనలో బిజీ కావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే ఆయన మరణవార్త రావడం స్నేహితులను, అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఎంతో ఉత్సాహంగా జీవితాన్ని కొనసాగిస్తున్న యువ నటుడు ఇలా అకాల మరణం చెందడం బుల్లితెర పరిశ్రమకు తీరని లోటుగా మిగిలిపోయింది. అనుజ్ ఠాకూర్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.మరింత చదవండి

Source link