ప్రభన్యూస్

Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు


‘మురసు’ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వర్షాల తీవ్రత కారణంగా నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. కాకినాడ వీధులు జలమయం కాగా, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా చిరుజల్లులు పడుతున్నాయి.

2.మురసు తుఫాను పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

‘మురసు’ తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతి నుంచి అధికారులతో మాట్లాడి తుపాను సన్నద్ధతపై ఆయన సమీక్షించారు. వర్షాల వల్ల ప్రాజెక్టులకు నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ వర్షాలను నీటి వనరుల పెంపునకు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని చెరువులు, రిజర్వాయర్లను సమర్థ నీటి నిర్వహణతో నింపాలని సీఎం ఆదేశించారు.

3.నకిలీ ఓట్లు తొలగించాలా.. వద్దా?

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దించేందుకు బీజేపీ శ్రేణులు సంకల్పం తీసుకోవాలని కేంద్ర మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ ‘మహా పాదయాత్ర’ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి, అరాచకత్వాన్ని అంతం చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ చేపడుతున్న ‘ఓటు బచావో ర్యాలీ’ చొరబాటుదారులను కాపాడేందుకేనని విమర్శించారు. దొంగ ఓట్లను, నకిలీ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటే రేవంత్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయ్యారని అమిత్‌ షా ప్రశ్నించారు.

4.మోదీ సర్కారును దెబ్బతీసే కుట్ర..

కాంగ్రెస్‌ పార్టీ విదేశీ శక్తుల నిధులతో మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ ‘మహా పాదయాత్ర’ సభలో ఆయన మాట్లాడారు. అరాచక శక్తుల కుట్రలను బయటపెట్టేందుకు దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కరీంనగర్‌లో జరిగే ర్యాలీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్ హాజరవుతారని తెలిపారు. అమిత్ షా పాదయాత్ర కోసం నలుగురు ఎంపీలు జనసమీకరణ చేస్తున్నారని బండి సంజయ్‌ వివరించారు.

5.బాధితురాలి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం..

రాప్తాడు ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను ఆయన పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీసి, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభించడమే ఈ అరాచకానికి కారణమని ఆయన మండిపడ్డారు. బాధితురాలి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం అందించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.

6.కాంగ్రెస్ చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం

కాంగ్రెస్ చేసిన పాపం తెలంగాణకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువేనని ఆయన అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి సభలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నీళ్లు తీసుకురావడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకున్నారని, రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పలేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రజలకు భరోసా కల్పిస్తే, రేవంత్ రెడ్డి భయపెడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు.

7.రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె అంజలి రెడ్డి వివాహ రిసెప్షన్‌కు హాజరుకావాలని కోరుతూ ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. డిసెంబర్ 5న అంజిలి రెడ్డి, రఘు రామ్ రెడ్డిల వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆమె ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు.

8.ఢిల్లీలో గ్రీన్‌ క్రాకర్స్‌కు ‘సుప్రీం’ అనుమతి

దీపావళి సందర్భంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. నవంబర్ 7, 8 తేదీల్లో నిర్ణీత వేళల్లో మాత్రమే బాణసంచా కాల్చాలని ధర్మాసనం ఆదేశించింది. ఆసుపత్రులు, సైలెన్స్ జోన్లకు 300 మీటర్ల పరిధిలో టపాసులు కాల్చడంపై నిషేధం విధించింది. CSIR-NEERI ఆమోదించిన గ్రీన్‌ క్రాకర్లకు మాత్రమే అనుమతి ఉందని, బేరియం కలిగిన బాణసంచాను నిషేధించామని స్పష్టం చేసింది. నవంబర్ 9 నుంచి దిల్లీ-ఎన్‌సీఆర్ వ్యాప్తంగా టపాసులపై పూర్తి నిషేధం తిరిగి అమలులోకి వస్తుందని కోర్టు పేర్కొంది.

9.మెగా ఇంట్లో మోగనున్న పెళ్లి భాజాలు..

మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 5న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన నిశ్చితార్థ వేడుక చాలా సింపుల్‌గా జరగనుందని తెలుస్తోంది. డిసెంబర్ 10న హైదరాబాద్ వేదికగా వీరి వివాహం వైభవంగా జరగనుందని టాక్ నడుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

10.మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే..

మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే తాను వీటో అధికారాన్ని ఉపయోగిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వారు ప్రవేశపెట్టే బిల్లులను తిరస్కరించి వారి అధికారాలను నియంత్రిస్తానని స్పష్టం చేశారు. తన పాలనలో అమెరికా అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. సర్వేలు రిపబ్లికన్ల ఆదరణను సరిగ్గా చూపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. నిబంధనల వల్ల వీలుకాకపోవచ్చు కానీ, అవకాశం ఉంటే మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 9:36 pm Digital Edition : Prabhanews
Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

‘మురసు’ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వర్షాల తీవ్రత కారణంగా నెల్లూరు జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. కాకినాడ వీధులు జలమయం కాగా, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా చిరుజల్లులు పడుతున్నాయి.2.మురసు తుఫాను పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..‘మురసు’ తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతి నుంచి అధికారులతో మాట్లాడి తుపాను సన్నద్ధతపై ఆయన సమీక్షించారు. వర్షాల వల్ల ప్రాజెక్టులకు నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ వర్షాలను నీటి వనరుల పెంపునకు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని చెరువులు, రిజర్వాయర్లను సమర్థ నీటి నిర్వహణతో నింపాలని సీఎం ఆదేశించారు.3.నకిలీ ఓట్లు తొలగించాలా.. వద్దా?తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దించేందుకు బీజేపీ శ్రేణులు సంకల్పం తీసుకోవాలని కేంద్ర మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ ‘మహా పాదయాత్ర’ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి, అరాచకత్వాన్ని అంతం చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ చేపడుతున్న ‘ఓటు బచావో ర్యాలీ’ చొరబాటుదారులను కాపాడేందుకేనని విమర్శించారు. దొంగ ఓట్లను, నకిలీ ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటే రేవంత్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయ్యారని అమిత్‌ షా ప్రశ్నించారు.4.మోదీ సర్కారును దెబ్బతీసే కుట్ర..కాంగ్రెస్‌ పార్టీ విదేశీ శక్తుల నిధులతో మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు.హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ ‘మహా పాదయాత్ర’ సభలో ఆయన మాట్లాడారు. అరాచక శక్తుల కుట్రలను బయటపెట్టేందుకు దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కరీంనగర్‌లో జరిగే ర్యాలీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్ హాజరవుతారని తెలిపారు. అమిత్ షా పాదయాత్ర కోసం నలుగురు ఎంపీలు జనసమీకరణ చేస్తున్నారని బండి సంజయ్‌ వివరించారు.5.బాధితురాలి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం..రాప్తాడు ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను ఆయన పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీసి, తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభించడమే ఈ అరాచకానికి కారణమని ఆయన మండిపడ్డారు. బాధితురాలి కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం అందించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.6.కాంగ్రెస్ చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపంకాంగ్రెస్ చేసిన పాపం తెలంగాణకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువేనని ఆయన అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి సభలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నీళ్లు తీసుకురావడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకున్నారని, రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పలేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రజలకు భరోసా కల్పిస్తే, రేవంత్ రెడ్డి భయపెడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు.7.రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమార్తె అంజలి రెడ్డి వివాహ రిసెప్షన్‌కు హాజరుకావాలని కోరుతూ ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. డిసెంబర్ 5న అంజిలి రెడ్డి, రఘు రామ్ రెడ్డిల వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆమె ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు.8.ఢిల్లీలో గ్రీన్‌ క్రాకర్స్‌కు ‘సుప్రీం’ అనుమతిదీపావళి సందర్భంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. నవంబర్ 7, 8 తేదీల్లో నిర్ణీత వేళల్లో మాత్రమే బాణసంచా కాల్చాలని ధర్మాసనం ఆదేశించింది. ఆసుపత్రులు, సైలెన్స్ జోన్లకు 300 మీటర్ల పరిధిలో టపాసులు కాల్చడంపై నిషేధం విధించింది. CSIR-NEERI ఆమోదించిన గ్రీన్‌ క్రాకర్లకు మాత్రమే అనుమతి ఉందని, బేరియం కలిగిన బాణసంచాను నిషేధించామని స్పష్టం చేసింది. నవంబర్ 9 నుంచి దిల్లీ-ఎన్‌సీఆర్ వ్యాప్తంగా టపాసులపై పూర్తి నిషేధం తిరిగి అమలులోకి వస్తుందని కోర్టు పేర్కొంది.9.మెగా ఇంట్లో మోగనున్న పెళ్లి భాజాలు..మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 5న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన నిశ్చితార్థ వేడుక చాలా సింపుల్‌గా జరగనుందని తెలుస్తోంది. డిసెంబర్ 10న హైదరాబాద్ వేదికగా వీరి వివాహం వైభవంగా జరగనుందని టాక్ నడుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.10.మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే.. మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే తాను వీటో అధికారాన్ని ఉపయోగిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వారు ప్రవేశపెట్టే బిల్లులను తిరస్కరించి వారి అధికారాలను నియంత్రిస్తానని స్పష్టం చేశారు. తన పాలనలో అమెరికా అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. సర్వేలు రిపబ్లికన్ల ఆదరణను సరిగ్గా చూపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. నిబంధనల వల్ల వీలుకాకపోవచ్చు కానీ, అవకాశం ఉంటే మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ తెలిపారు.

Source link