ఉదాహరణకు, ఒక వ్యక్తి రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. ఇంకా 15 ఏళ్ల కాలపరిమితి మిగిలి ఉంది. ప్రస్తుతం ఆ లోన్‌పై వడ్డీ రేటు 9.5 శాతంగా ఉంది. ఈ లోన్‌కు నెలవారీ ఈఎంఐ సుమారు రూ.52,211 అవుతుంది. ఇప్పుడు అదే లోన్‌ను 8.5 శాతం వడ్డీ రేటుతో, మిగిలిన 15 ఏళ్ల కాలపరిమితికే మార్చుకుంటే ఈఎంఐ సుమారు రూ.49,237కి తగ్గుతుంది. దీంతో మొత్తం వడ్డీ చెల్లింపుల్లో దాదాపు రూ.5.35 లక్షలు ఆదా అవుతాయి. ఒకవేళ వడ్డీ రేటు 7.5 శాతానికి తగ్గితే ఈఎంఐ సుమారు రూ.46,351 అవుతుంది. అప్పుడు వడ్డీ రూపంలో ఆదా అయ్యే మొత్తం దాదాపు రూ.10.55 లక్షలకు చేరుతుంది. అయితే, చిన్న మొత్తంలో తీసుకున్న లోన్‌కు, తక్కువ కాలపరిమితి మిగిలి ఉన్నప్పుడు వడ్డీ రేటు తగ్గినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

