ప్రభన్యూస్

Chapri Movie Teaser: ‘ఛప్రి’ టీజర్ రిలీజ్.. 700 రోజులు కష్టపడి రాసిన కథ..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి సినిమాలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సరోజ్ కుమార్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త మూవీ ‘ఛప్రి’.

News18
News18

‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి సినిమాలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సరోజ్ కుమార్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త మూవీ ‘ఛప్రి’. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటల రచన, ఎడిటింగ్, సంగీతం, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను సరోజ్ కుమారే నిర్వర్తించడం విశేషం. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్‌పై సరోజ్ కుమార్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో సరోజ్ కుమార్ సరసన ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా నటిస్తున్నారు. వీరితో పాటు ప్రవీణ్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్ర టీజర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమా విశేషాలను పంచుకుంది.

ఈ కార్యక్రమంలో దర్శకుడు, హీరో సరోజ్ కుమార్ మాట్లాడుతూ టీజర్‌ను అనుకున్న సమయం కంటే ముందుగానే విడుదల చేయడానికి గల కారణాన్ని వెల్లడించారు. ‘‘ఛప్రి’ సినిమాను వచ్చే సమ్మర్‌లో విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేశాం. ఫిబ్రవరిలో టీజర్‌ను రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ సినిమాలోని ఓ కీలకమైన సన్నివేశాన్ని జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేశారు. ముఖ్యంగా మగాడు సీన్ బయటకు రావడంతో నేను ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యాను. అందుకే అనుకున్న సమయం కంటే ముందుగానే టీజర్‌ను విడుదల చేయాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో, సినిమా సెట్స్‌లో మాకు సరైన భద్రత లేదనిపిస్తుంది. మీడియా లేకపోతే నేను లేను. నా ప్రయాణంలో నాకు అండగా నిలిచిన జర్నలిస్టులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

ఈ సినిమా కథను రాయడానికి దాదాపు 700 రోజులు కష్టపడ్డాను. రివ్యూయర్లను కూడా దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన స్క్రీన్‌ప్లే సిద్ధం చేసుకున్నాను. కథకు తగ్గట్టుగా మంచి నటీనటులు దొరికారు. ఆర్ట్ డైరెక్టర్ నాని ఎంతో సహకరించారు. నిర్మాత ప్రమోద్ అన్న నాకు అండగా నిలబడ్డారు. వచ్చే సమ్మర్‌లో థియేటర్లలో కలుద్దాం. ఈ సినిమాతో మా సత్తా ఏంటో అందరికీ తెలుస్తుంది’’ అని సరోజ్ కుమార్ తెలిపారు.

నటుడు ప్రవీణ్ మాట్లాడుతూ.. ‘మోగ్లీ’ సినిమాలో సరోజ్ గారిని చూసి ఆయన నంబర్ తెలుసుకుని ఫోన్ చేశానని, ఆయనతో కలిసి పనిచేయడం మంచి కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. ‘ఛప్రి’ టీజర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని, వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమా విడుదల కానుందని తెలిపారు. హీరోగా సరోజ్‌కు మంచి థియేట్రికల్ విజయం దక్కాలని ఆకాంక్షించారు.

అజయ్ సాయి మాట్లాడుతూ తనను నమ్మి సినిమాలో అవకాశం ఇచ్చిన సరోజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తామని చెప్పారు. దివ్య జ్యోతి తనకు మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా ప్రయాణంలో చిత్రబృందం ఎంతో సహకరించిందని పేర్కొన్నారు. రమేష్ మాట్లాడుతూ సరోజ్‌తో కలిసి తాను మూడోసారి నటిస్తున్నానని, ప్రతిసారీ ఆయన తనకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 November 2026, 7:58 pm Digital Edition : Prabhanews
Chapri Movie Teaser: ‘ఛప్రి’ టీజర్ రిలీజ్.. 700 రోజులు కష్టపడి రాసిన కథ..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 14, 2026 7:24 PM IST‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి సినిమాలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సరోజ్ కుమార్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త మూవీ ‘ఛప్రి’.News18‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి సినిమాలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సరోజ్ కుమార్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త మూవీ ‘ఛప్రి’. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటల రచన, ఎడిటింగ్, సంగీతం, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను సరోజ్ కుమారే నిర్వర్తించడం విశేషం. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్‌పై సరోజ్ కుమార్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సరోజ్ కుమార్ సరసన ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా నటిస్తున్నారు. వీరితో పాటు ప్రవీణ్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్ర టీజర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమా విశేషాలను పంచుకుంది.ఈ కార్యక్రమంలో దర్శకుడు, హీరో సరోజ్ కుమార్ మాట్లాడుతూ టీజర్‌ను అనుకున్న సమయం కంటే ముందుగానే విడుదల చేయడానికి గల కారణాన్ని వెల్లడించారు. ‘‘ఛప్రి’ సినిమాను వచ్చే సమ్మర్‌లో విడుదల చేయాలని ముందుగా ప్లాన్ చేశాం. ఫిబ్రవరిలో టీజర్‌ను రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ సినిమాలోని ఓ కీలకమైన సన్నివేశాన్ని జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేశారు. ముఖ్యంగా మగాడు సీన్ బయటకు రావడంతో నేను ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యాను. అందుకే అనుకున్న సమయం కంటే ముందుగానే టీజర్‌ను విడుదల చేయాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో, సినిమా సెట్స్‌లో మాకు సరైన భద్రత లేదనిపిస్తుంది. మీడియా లేకపోతే నేను లేను. నా ప్రయాణంలో నాకు అండగా నిలిచిన జర్నలిస్టులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.ఈ సినిమా కథను రాయడానికి దాదాపు 700 రోజులు కష్టపడ్డాను. రివ్యూయర్లను కూడా దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన స్క్రీన్‌ప్లే సిద్ధం చేసుకున్నాను. కథకు తగ్గట్టుగా మంచి నటీనటులు దొరికారు. ఆర్ట్ డైరెక్టర్ నాని ఎంతో సహకరించారు. నిర్మాత ప్రమోద్ అన్న నాకు అండగా నిలబడ్డారు. వచ్చే సమ్మర్‌లో థియేటర్లలో కలుద్దాం. ఈ సినిమాతో మా సత్తా ఏంటో అందరికీ తెలుస్తుంది’’ అని సరోజ్ కుమార్ తెలిపారు.నటుడు ప్రవీణ్ మాట్లాడుతూ.. ‘మోగ్లీ’ సినిమాలో సరోజ్ గారిని చూసి ఆయన నంబర్ తెలుసుకుని ఫోన్ చేశానని, ఆయనతో కలిసి పనిచేయడం మంచి కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. ‘ఛప్రి’ టీజర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని, వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమా విడుదల కానుందని తెలిపారు. హీరోగా సరోజ్‌కు మంచి థియేట్రికల్ విజయం దక్కాలని ఆకాంక్షించారు.అజయ్ సాయి మాట్లాడుతూ తనను నమ్మి సినిమాలో అవకాశం ఇచ్చిన సరోజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తామని చెప్పారు. దివ్య జ్యోతి తనకు మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా ప్రయాణంలో చిత్రబృందం ఎంతో సహకరించిందని పేర్కొన్నారు. రమేష్ మాట్లాడుతూ సరోజ్‌తో కలిసి తాను మూడోసారి నటిస్తున్నానని, ప్రతిసారీ ఆయన తనకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పారు.మరింత చదవండి

Source link