ప్రభన్యూస్

Donga Na Koduku Movie: డిజాస్టర్ టాక్‌తో రికార్డు కలెక్షన్లు… ‘దొంగ నా కొడుకు’ సినిమాకు ఫస్ట్ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

నిన్న రిలీజైన దొంగ నా కొడుకు సినిమాకు యునానిమస్‌గా డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమా మొత్తంలో కొన్ని సీన్లు తప్పితే.. మిగితా మొత్తం స్క్రాప్ అంటూ తిప్పికొట్టారు. నిజానికి రిలీజ్‌కు ముందు నుంచి కూడా ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు.

News18
News18

నిన్న రిలీజైన దొంగ నా కొడుకు సినిమాకు యునానిమస్‌గా డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమా మొత్తంలో కొన్ని సీన్లు తప్పితే.. మిగితా మొత్తం స్క్రాప్ అంటూ తిప్పికొట్టారు. నిజానికి రిలీజ్‌కు ముందు నుంచి కూడా ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. దానికి తోడు టైటిల్ కూడా క్లాస్ ఆడియెన్స్‌కు పెద్దగా నచ్చలేదు. టైటిల్ ఇలా ఉంటే.. సినిమా ఇంకా ఎలా ఉంటుందో అని చాలా మంది ఆగిపోయారు. అయితే.. ఫస్ట్ సినిమా లిటిల్ హార్ట్స్ తెచ్చిపెట్టిన క్రేజ్‌తో మౌళి ఈ సినిమాకు మంచి ఓపెనింగ్సే సాధించాడు.

ప్రీమియర్ షోలు, ఫస్ట్ రోజు కలెక్షన్లు కలిపి ‘దొంగ నా కొడుకు’ ప్రపంచవ్యాప్తంగా రూ.4.15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. తొలి రోజే ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం విశేషంగా మారింది. మౌళికు ఉన్న క్రేజ్‌కు సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి.

ఇక ఈ సినిమా వసూళ్లలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. మౌళి ఫస్ట్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’ మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే ఇప్పుడు ‘దొంగ నా కొడుకు’ ఆ సినిమా తొలి రోజు ఓపెనింగ్స్‌ను కూడా బ్రేక్ చేసింది. దీంతో మౌళి కెరీర్‌లో మరో మంచి ఓపెనింగ్‌గా ఈ సినిమా నిలిచింది. గత సినిమాతో వచ్చిన గుర్తింపును ఈ యువ హీరో తన కొత్త సినిమాకు ఉపయోగించుకోగలిగాడని చెప్పవచ్చు.

మరోవైపు నవంబర్ 13న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. వీకెండ్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వీకెండ్ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో చిత్రబృందం ఆశలు పెట్టుకుంది. తొలి రోజు వచ్చిన వసూళ్లను వీకెండ్‌లో మరింత పెంచుకోవడమే ఇప్పుడు ఈ సినిమా ముందున్న లక్ష్యం.

సాధారణంగా చిన్న సినిమాలకు మొదటి రోజు వచ్చిన టాక్, ప్రేక్షకుల స్పందన వీకెండ్ వసూళ్లపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో ‘దొంగ నా కొడుకు’కు లభిస్తున్న ఆదరణ ఎంతవరకు కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. తొలి రోజు కలెక్షన్లతోనే ‘లిటిల్ హార్ట్స్’ ఓపెనింగ్స్‌ను దాటేసిన మౌళి.. వీకెండ్ ముగిసే సమయానికి ఎలాంటి వసూళ్లు సాధిస్తాడో చూడాలి. ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం రాబోయే రోజుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 November 2026, 11:11 pm Digital Edition : Prabhanews
Donga Na Koduku Movie: డిజాస్టర్ టాక్‌తో రికార్డు కలెక్షన్లు… ‘దొంగ నా కొడుకు’ సినిమాకు ఫస్ట్ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 14, 2026 11:00 PM ISTనిన్న రిలీజైన దొంగ నా కొడుకు సినిమాకు యునానిమస్‌గా డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమా మొత్తంలో కొన్ని సీన్లు తప్పితే.. మిగితా మొత్తం స్క్రాప్ అంటూ తిప్పికొట్టారు. నిజానికి రిలీజ్‌కు ముందు నుంచి కూడా ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు.News18నిన్న రిలీజైన దొంగ నా కొడుకు సినిమాకు యునానిమస్‌గా డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమా మొత్తంలో కొన్ని సీన్లు తప్పితే.. మిగితా మొత్తం స్క్రాప్ అంటూ తిప్పికొట్టారు. నిజానికి రిలీజ్‌కు ముందు నుంచి కూడా ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. దానికి తోడు టైటిల్ కూడా క్లాస్ ఆడియెన్స్‌కు పెద్దగా నచ్చలేదు. టైటిల్ ఇలా ఉంటే.. సినిమా ఇంకా ఎలా ఉంటుందో అని చాలా మంది ఆగిపోయారు. అయితే.. ఫస్ట్ సినిమా లిటిల్ హార్ట్స్ తెచ్చిపెట్టిన క్రేజ్‌తో మౌళి ఈ సినిమాకు మంచి ఓపెనింగ్సే సాధించాడు.ప్రీమియర్ షోలు, ఫస్ట్ రోజు కలెక్షన్లు కలిపి ‘దొంగ నా కొడుకు’ ప్రపంచవ్యాప్తంగా రూ.4.15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. తొలి రోజే ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం విశేషంగా మారింది. మౌళికు ఉన్న క్రేజ్‌కు సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి.ఇక ఈ సినిమా వసూళ్లలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. మౌళి ఫస్ట్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’ మంచి సక్సెస్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే ఇప్పుడు ‘దొంగ నా కొడుకు’ ఆ సినిమా తొలి రోజు ఓపెనింగ్స్‌ను కూడా బ్రేక్ చేసింది. దీంతో మౌళి కెరీర్‌లో మరో మంచి ఓపెనింగ్‌గా ఈ సినిమా నిలిచింది. గత సినిమాతో వచ్చిన గుర్తింపును ఈ యువ హీరో తన కొత్త సినిమాకు ఉపయోగించుకోగలిగాడని చెప్పవచ్చు.మరోవైపు నవంబర్ 13న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. వీకెండ్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వీకెండ్ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో చిత్రబృందం ఆశలు పెట్టుకుంది. తొలి రోజు వచ్చిన వసూళ్లను వీకెండ్‌లో మరింత పెంచుకోవడమే ఇప్పుడు ఈ సినిమా ముందున్న లక్ష్యం.సాధారణంగా చిన్న సినిమాలకు మొదటి రోజు వచ్చిన టాక్, ప్రేక్షకుల స్పందన వీకెండ్ వసూళ్లపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో ‘దొంగ నా కొడుకు’కు లభిస్తున్న ఆదరణ ఎంతవరకు కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. తొలి రోజు కలెక్షన్లతోనే ‘లిటిల్ హార్ట్స్’ ఓపెనింగ్స్‌ను దాటేసిన మౌళి.. వీకెండ్ ముగిసే సమయానికి ఎలాంటి వసూళ్లు సాధిస్తాడో చూడాలి. ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం రాబోయే రోజుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.మరింత చదవండి

Source link