Mayurbhanj Odisha Flood : భారీ వర్షాలతో వరద ముప్పు..!
ఒడిశాలో భారీ వర్షాలతో నదులు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా మయూర్భంజ్ జిల్లాలో వరద ముప్పు మరింత తీవ్రంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదుల్లో నీటిమట్టం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. Source link
