Last Updated:
ముంబై జుహులో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. అనిల్ పండిట్ అనే వ్యక్తి పేరిట సోషల్ మీడియాలో ఆడియో సందేశం బయటకు వచ్చింది.
ముంబై నగరంలోని జుహు ప్రాంతంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన ఘటనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత తీసుకుంది. ఈ మేరకు గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ పేరుతో ఒక ఆడియో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతోంది. అందులో మాట్లాడిన వ్యక్తి తాను లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడినని, ఈ దాడి తామే చేయించామని ప్రకటించాడు. గతంలోనే తాము గట్టిగా హెచ్చరించినప్పటికీ టైగర్ ష్రాఫ్ మాట వినలేదని అందుకే ఈ చర్యకు పాల్పడ్డామని అందులో పేర్కొన్నాడు. నిందితులను పట్టుకునేందుకు ముంబై పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు వేగవంతం చేశారు. మహారాష్ట్రలో సినీ తారల భద్రత ప్రశ్నార్థకంగా మారడంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ ఆడియో సందేశంలో బాలీవుడ్ నటులకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. సినీ పరిశ్రమలో ఎవరైనా సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేస్తే ప్రాణాలతో వదిలిపెట్టబోమని బెదిరించారు. ఇది తమ మొదటి, చివరి హెచ్చరికగా భావించాలని స్పష్టం చేశారు. తమ అన్న లారెన్స్ బిష్ణోయ్ లేదా బిష్ణోయ్ సమాజానికి సల్మాన్ ఖాన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Tiger Shroff Attacked in Mumbai
3 bikers fire gun shots at Tiger Shroff’s car. Tiger is safe, driver & 1 rickshaw driver is allegedly injured.Harman Sandhu & Anil Pandit claimed responsibility of attack. https://t.co/VHBXpxvXYs
— Maithili (@Kaleshini) October 18, 2026
తాము క్షమించకపోతే సల్మాన్ ఖాన్ ఇంట్లోని వారెవరినీ విడిచిపెట్టబోమని, యావత్ కుటుంబాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భద్రత ఉందని ఎవరూ ధీమాగా ఉండవద్దని, ఆ రక్షణ వలయంలోనూ తమ మనుషులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఈ వైరల్ ఆడియో నిజానిజాలపై విచారణ జరుపుతున్నారు.

