Last Updated:
Boarding Pass: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పనిచేస్తున్న విభాగం, దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఈ నూతన మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని విమానాశ్రయ ఆపరేటర్లు, సీఐఎస్ఎఫ్ (CISF), ఇతర పౌర విమానయాన సంస్థలకు ఇప్పటికే అంతర్గత సర్క్యులర్ ద్వారా ఆదేశాలు జారీ చేసింది.
భారతదేశంలోని విమానాశ్రయాల గుండా ప్రయాణించే విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను అందించింది. ఎయిర్‌పోర్టుల్లో తనిఖీల ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్’ (BOI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1, 2026 నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల దగ్గర తమ బోర్డింగ్ పాస్‌లపై స్టాంపింగ్ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్త నిబంధన అమలుతో ప్రయాణికులు ఇకపై భౌతిక (ఫిజికల్) బోర్డింగ్ పాస్‌లను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దీని స్థానంలో స్మార్ట్‌ఫోన్‌లలోని ఈ-బోర్డింగ్ పాస్‌లను ఇమ్మిగ్రేషన్ అధికారులకు చూపిస్తే సరిపోతుంది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పనిచేస్తున్న ఈ విభాగం, దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఈ నూతన మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని విమానాశ్రయ ఆపరేటర్లు, సీఐఎస్ఎఫ్ (CISF), ఇతర పౌర విమానయాన సంస్థలకు ఇప్పటికే అంతర్గత సర్క్యులర్ ద్వారా ఆదేశాలు జారీ చేసింది.

