Last Updated:
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు కారు ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాకా సినిమాలోని ఓ పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి వెళ్తుండగా పండ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ.. ఆయన కారును వెనుక నుంచి ఢీ కొట్టిందని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు కారు ప్రమాదం జరిగినట్లు సమాచారం. హైదరాబాద్ శంషాబాద్ పరిసరాల్లో ఈ ఘటన జరిగింది. కాకా సినిమాలోని ఓ పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి వెళ్తుండగా పండ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ.. ఆయన కారును వెనుక నుంచి ఢీ కొట్టిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్ కారు దెబ్బతినగా, ఆయనకు గాయాలైనట్లు తెలిసింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆయన కటుంబ సభ్యులు, సినీ పరిశ్రమ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకరు శేఖర్ మాస్టర్. దాదాపు తెలుగులో స్టార్ హీరోలందరికీ ప్రత్యేకమైన డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసిన అనుభవం ఆయనకు ఉంది. హీరో బాడీ లాంగ్వేజ్‌కు తగిన డాన్స్ స్టెప్స్ చేపిస్తూ.. మాస్ అండ్ ట్రెండీ స్టెప్పులతో అక్కట్టుకుంటూ ఉంటారు శేఖర్ మాస్టర్.
శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేసిన పాటల్లో.. అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలోని ‘టాప్ లేచిపోద్ది’, చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’లో ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’, జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’లో ‘పక్కా లోకల్’, వరుణ్ తేజ్ ‘ఫిదా’లో ‘వచ్చిండే’, రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ‘దిమాక్ ఖరాబ్’ మంచు తునకలు.

