ప్రభన్యూస్

Bigg Boss 10: బిగ్‌బాస్ 10 నుంచి రైతుబిడ్డ ఝాన్సీ ఎలిమినేషన్.. 8 వారాల్లో ఎంత సంపాదించిందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం, ఆసక్తికర పరిణామంతో వార్తల్లో నిలుస్తోంది. హౌస్‌లో జరిగే గొడవలు, కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధాలు, ఎలిమినేషన్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

News18
News18

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం, ఆసక్తికర పరిణామంతో వార్తల్లో నిలుస్తోంది. హౌస్‌లో జరిగే గొడవలు, కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధాలు, ఎలిమినేషన్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో రోహిత్, వర్షిణి, ముకేశ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఇదే ఎపిసోడ్‌లో ఫోక్ సింగర్, రైతుబిడ్డ ఝాన్సీ ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఝాన్సీ ఎలిమినేట్ కావడానికి కారణాలేంటి? బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిది వారాలు ఉన్న ఆమె ఎంత రెమ్యునరేషన్ అందుకుంది? ఇప్పుడు చూద్దాం.

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి..

ఈ సీజన్‌లో అగ్నిపరీక్ష ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్లలో ఫోక్ సింగర్ ఝాన్సీ ఒకరు. తన పాటలు, ఆటతీరుతో జడ్జిలను మెప్పించి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగుపెట్టింది. హౌస్‌లోకి వచ్చిన తొలినాళ్లలో ఆమె ఆటతీరు బాగానే కనిపించింది. మొదటి రెండు వారాల్లో తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. అయితే ఆ తర్వాతి వారాల్లో మాత్రం ఆటలో అదే స్థాయి దూకుడు కొనసాగించలేకపోయింది.

ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే గేమ్ పరంగా కొంత వెనుకబడిపోయింది. టాస్కుల్లోనూ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా గత వారం నుంచి కొనసాగుతున్న అల్టిమేట్ గోట్ టాస్క్‌లో ఝాన్సీ ఆట మరింత బలహీనంగా కనిపించింది. ఈ టాస్క్‌లో ఆమె రెడ్ లెవల్‌లోనే ఉండిపోవడం కూడా ప్రతికూలంగా మారింది. ఇలా గేమ్‌లో వెనుకబడటం, ప్రేక్షకుల నుంచి తగినంత మద్దతు లభించకపోవడం ఆమె ఎలిమినేషన్‌కు కారణాలుగా కనిపిస్తున్నాయి.

సుధీర్‌ను కాపాడి.. తాను ఎలిమినేట్:

ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. లెక్కల ప్రకారం సుధీర్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా, తనకు ఉన్న పవర్‌ను ఉపయోగించి ఝాన్సీ అతడిని సేవ్ చేసింది. అయితే సుధీర్‌ను కాపాడిన ఝాన్సీ మాత్రం తనను తాను ఎలిమినేషన్ నుంచి రక్షించుకోలేకపోయింది. దీంతో చివరకు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.

శనివారం నాటి ఎపిసోడ్‌లో ఝాన్సీ ఎలిమినేషన్ చుట్టూనే ఎక్కువగా ఎమోషనల్ సన్నివేశాలు కనిపించాయి. ఎనిమిది వారాల పాటు హౌస్‌లో కొనసాగిన ఆమె ప్రయాణం ముగియడంతో అభిమానులు కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సుధీర్‌ను కాపాడేందుకు తన పవర్ ఉపయోగించినప్పటికీ, చివరకు తానే బయటకు రావాల్సి రావడం ఈ ఎలిమినేషన్‌లో ఆసక్తికరమైన అంశంగా నిలిచింది.

ఝాన్సీ రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇక బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిది వారాల పాటు కొనసాగిన ఝాన్సీకి పారితోషికం కూడా బాగానే అందినట్లు సమాచారం. ఆమెకు ఒక్కో వారానికి సుమారు రూ.70 వేల నుంచి రూ.75 వేల వరకు రెమ్యునరేషన్ లభించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఎనిమిది వారాలకు కలిపి ఆమెకు దాదాపు రూ.5.60 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పారితోషికం అందినట్లు అంచనా.

అయితే ఇవి అధికారికంగా వెల్లడైన పారితోషిక వివరాలు కావు. మొత్తానికి అగ్నిపరీక్ష ద్వారా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టి ఎనిమిది వారాల పాటు కొనసాగిన ఝాన్సీ ప్రయాణం అనూహ్యంగా ముగిసింది. ఇక ఆమె ఎలిమినేషన్ తర్వాత హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్ల మధ్య గేమ్ ఎలా మారుతుందో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 November 2026, 9:01 pm Digital Edition : Prabhanews
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 నుంచి రైతుబిడ్డ ఝాన్సీ ఎలిమినేషన్.. 8 వారాల్లో ఎంత సంపాదించిందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 01, 2026 8:55 PM ISTబిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం, ఆసక్తికర పరిణామంతో వార్తల్లో నిలుస్తోంది. హౌస్‌లో జరిగే గొడవలు, కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధాలు, ఎలిమినేషన్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. News18బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదం, ఆసక్తికర పరిణామంతో వార్తల్లో నిలుస్తోంది. హౌస్‌లో జరిగే గొడవలు, కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధాలు, ఎలిమినేషన్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో రోహిత్, వర్షిణి, ముకేశ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఇదే ఎపిసోడ్‌లో ఫోక్ సింగర్, రైతుబిడ్డ ఝాన్సీ ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఝాన్సీ ఎలిమినేట్ కావడానికి కారణాలేంటి? బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిది వారాలు ఉన్న ఆమె ఎంత రెమ్యునరేషన్ అందుకుంది? ఇప్పుడు చూద్దాం.అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి..ఈ సీజన్‌లో అగ్నిపరీక్ష ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్లలో ఫోక్ సింగర్ ఝాన్సీ ఒకరు. తన పాటలు, ఆటతీరుతో జడ్జిలను మెప్పించి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లోకి అడుగుపెట్టింది. హౌస్‌లోకి వచ్చిన తొలినాళ్లలో ఆమె ఆటతీరు బాగానే కనిపించింది. మొదటి రెండు వారాల్లో తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. అయితే ఆ తర్వాతి వారాల్లో మాత్రం ఆటలో అదే స్థాయి దూకుడు కొనసాగించలేకపోయింది.ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే గేమ్ పరంగా కొంత వెనుకబడిపోయింది. టాస్కుల్లోనూ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా గత వారం నుంచి కొనసాగుతున్న అల్టిమేట్ గోట్ టాస్క్‌లో ఝాన్సీ ఆట మరింత బలహీనంగా కనిపించింది. ఈ టాస్క్‌లో ఆమె రెడ్ లెవల్‌లోనే ఉండిపోవడం కూడా ప్రతికూలంగా మారింది. ఇలా గేమ్‌లో వెనుకబడటం, ప్రేక్షకుల నుంచి తగినంత మద్దతు లభించకపోవడం ఆమె ఎలిమినేషన్‌కు కారణాలుగా కనిపిస్తున్నాయి.సుధీర్‌ను కాపాడి.. తాను ఎలిమినేట్:ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. లెక్కల ప్రకారం సుధీర్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా, తనకు ఉన్న పవర్‌ను ఉపయోగించి ఝాన్సీ అతడిని సేవ్ చేసింది. అయితే సుధీర్‌ను కాపాడిన ఝాన్సీ మాత్రం తనను తాను ఎలిమినేషన్ నుంచి రక్షించుకోలేకపోయింది. దీంతో చివరకు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.శనివారం నాటి ఎపిసోడ్‌లో ఝాన్సీ ఎలిమినేషన్ చుట్టూనే ఎక్కువగా ఎమోషనల్ సన్నివేశాలు కనిపించాయి. ఎనిమిది వారాల పాటు హౌస్‌లో కొనసాగిన ఆమె ప్రయాణం ముగియడంతో అభిమానులు కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సుధీర్‌ను కాపాడేందుకు తన పవర్ ఉపయోగించినప్పటికీ, చివరకు తానే బయటకు రావాల్సి రావడం ఈ ఎలిమినేషన్‌లో ఆసక్తికరమైన అంశంగా నిలిచింది.ఝాన్సీ రెమ్యునరేషన్ ఎంతంటే?ఇక బిగ్‌బాస్ హౌస్‌లో ఎనిమిది వారాల పాటు కొనసాగిన ఝాన్సీకి పారితోషికం కూడా బాగానే అందినట్లు సమాచారం. ఆమెకు ఒక్కో వారానికి సుమారు రూ.70 వేల నుంచి రూ.75 వేల వరకు రెమ్యునరేషన్ లభించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఎనిమిది వారాలకు కలిపి ఆమెకు దాదాపు రూ.5.60 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పారితోషికం అందినట్లు అంచనా.అయితే ఇవి అధికారికంగా వెల్లడైన పారితోషిక వివరాలు కావు. మొత్తానికి అగ్నిపరీక్ష ద్వారా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టి ఎనిమిది వారాల పాటు కొనసాగిన ఝాన్సీ ప్రయాణం అనూహ్యంగా ముగిసింది. ఇక ఆమె ఎలిమినేషన్ తర్వాత హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్ల మధ్య గేమ్ ఎలా మారుతుందో చూడాలి.మరింత చదవండి

Source link