ప్రభన్యూస్

Amla Pickle: ఉసిరికాయ పచ్చడి ఇలా చేశారంటే.. వేడి వేడి అన్నంలో కలుపుకుని లొట్టలేసుకుంటూ తింటారు! | లైఫ్ స్టైల్


Last Updated:

తెలుగు రాష్ట్రాల్లో ఉసిరికాయతో చేసే పచ్చడికి ప్రత్యేకమైన రుచే ఉంటుంది. కాస్త పుల్లగా, కారంగా, మసాలా దినుసుల సువాసనతో ఉండే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా సాధారణ పప్పు, కూర ఉన్నా ఈ పచ్చడి భోజనానికి మంచి రుచిని అందిస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.

News18
News18

ఉసిరికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అందుకే చాలామంది ఉసిరికాయలను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. కొందరు వీటితో మురబ్బా, ఊరగాయ తయారు చేసుకుంటే.. మరికొందరు నేరుగా తింటారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉసిరికాయతో చేసే పచ్చడికి ప్రత్యేకమైన రుచే ఉంటుంది. కాస్త పుల్లగా, కారంగా, మసాలా దినుసుల సువాసనతో ఉండే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా సాధారణ పప్పు, కూర ఉన్నా ఈ పచ్చడి భోజనానికి మంచి రుచిని అందిస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు: ఈ పచ్చడి తయారీకి అర కిలో ఉసిరికాయలు, అర కప్పు నువ్వుల నూనె, వేయించడానికి మరో రెండు పెద్ద స్పూన్ల నువ్వుల నూనె, రెండు పెద్ద స్పూన్ల ఆవాలు, ఒక పెద్ద స్పూన్ మెంతులు, పావు కప్పు కారం, మూడు నుంచి నాలుగు పెద్ద స్పూన్ల ఉప్పు, అర చిన్న స్పూన్ పసుపు అవసరం. అదనంగా తాలింపు కోసం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ తీసుకోవాలి. పచ్చడికి మరింత పులుపు కావాలనుకునేవారు రెండు నిమ్మకాయల రసం కూడా ఉపయోగించవచ్చు.

తయారీ విధానం: ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, వాటిపై నీటి తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడిలో తేమ తగ్గుతుంది. ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టి రెండు పెద్ద స్పూన్ల నువ్వుల నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఉసిరికాయలను వేసి మీడియం మంటపై 8 నుంచి 10 నిమిషాల పాటు వేయించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉసిరికాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పచ్చడిలో మసాలాలు ప్రతి ముక్కకు బాగా పడతాయి.

ఇప్పుడు మరో పొడి కడాయిలో ఒక పెద్ద స్పూన్ ఆవాలు, ఒక పెద్ద స్పూన్ మెంతులు వేసి తక్కువ మంటపై వేయించాలి. మంచి సువాసన వచ్చి రంగు కొద్దిగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో కారం, ఉప్పు, పసుపు, ఆవాలు-మెంతుల పొడి వేసి బాగా కలపాలి. ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న ఉసిరికాయ ముక్కలను వేసి మసాలా మొత్తం పట్టేలా కలపాలి.

తర్వాత కడాయిలో మిగిలిన నువ్వుల నూనెను వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత ఉసిరికాయ మిశ్రమంలో కలపాలి. ఇష్టమైతే ఈ సమయంలో నిమ్మరసం కూడా జోడించుకోవచ్చు. చివరగా పచ్చడిని శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న గాజు సీసాలోకి తీసుకోవాలి. మసాలాల రుచి ఉసిరికాయ ముక్కలకు బాగా పట్టాలంటే రెండు రోజుల తర్వాత తినడం మంచిది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలిపి తింటే అద్భుతమైన రుచి ఉంటుంది.

చిన్న చిట్కా: పచ్చడిని తీసుకునేటప్పుడు ఎప్పుడూ శుభ్రమైన, పొడి చెంచానే ఉపయోగించాలి. తేమ చేరకుండా చూసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ చేయాలనుకుంటే పచ్చడిలో తేమ, వాసన లేదా బూజు వంటి మార్పులు కనిపిస్తున్నాయేమో గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 3:32 pm Digital Edition : Prabhanews
Amla Pickle: ఉసిరికాయ పచ్చడి ఇలా చేశారంటే.. వేడి వేడి అన్నంలో కలుపుకుని లొట్టలేసుకుంటూ తింటారు! | లైఫ్ స్టైల్

Last Updated:Nov 07, 2026 3:22 PM ISTతెలుగు రాష్ట్రాల్లో ఉసిరికాయతో చేసే పచ్చడికి ప్రత్యేకమైన రుచే ఉంటుంది. కాస్త పుల్లగా, కారంగా, మసాలా దినుసుల సువాసనతో ఉండే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా సాధారణ పప్పు, కూర ఉన్నా ఈ పచ్చడి భోజనానికి మంచి రుచిని అందిస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.News18ఉసిరికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అందుకే చాలామంది ఉసిరికాయలను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. కొందరు వీటితో మురబ్బా, ఊరగాయ తయారు చేసుకుంటే.. మరికొందరు నేరుగా తింటారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉసిరికాయతో చేసే పచ్చడికి ప్రత్యేకమైన రుచే ఉంటుంది. కాస్త పుల్లగా, కారంగా, మసాలా దినుసుల సువాసనతో ఉండే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా సాధారణ పప్పు, కూర ఉన్నా ఈ పచ్చడి భోజనానికి మంచి రుచిని అందిస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.కావాల్సిన పదార్థాలు: ఈ పచ్చడి తయారీకి అర కిలో ఉసిరికాయలు, అర కప్పు నువ్వుల నూనె, వేయించడానికి మరో రెండు పెద్ద స్పూన్ల నువ్వుల నూనె, రెండు పెద్ద స్పూన్ల ఆవాలు, ఒక పెద్ద స్పూన్ మెంతులు, పావు కప్పు కారం, మూడు నుంచి నాలుగు పెద్ద స్పూన్ల ఉప్పు, అర చిన్న స్పూన్ పసుపు అవసరం. అదనంగా తాలింపు కోసం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ తీసుకోవాలి. పచ్చడికి మరింత పులుపు కావాలనుకునేవారు రెండు నిమ్మకాయల రసం కూడా ఉపయోగించవచ్చు.తయారీ విధానం: ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, వాటిపై నీటి తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడిలో తేమ తగ్గుతుంది. ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టి రెండు పెద్ద స్పూన్ల నువ్వుల నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఉసిరికాయలను వేసి మీడియం మంటపై 8 నుంచి 10 నిమిషాల పాటు వేయించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉసిరికాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పచ్చడిలో మసాలాలు ప్రతి ముక్కకు బాగా పడతాయి.ఇప్పుడు మరో పొడి కడాయిలో ఒక పెద్ద స్పూన్ ఆవాలు, ఒక పెద్ద స్పూన్ మెంతులు వేసి తక్కువ మంటపై వేయించాలి. మంచి సువాసన వచ్చి రంగు కొద్దిగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో కారం, ఉప్పు, పసుపు, ఆవాలు-మెంతుల పొడి వేసి బాగా కలపాలి. ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న ఉసిరికాయ ముక్కలను వేసి మసాలా మొత్తం పట్టేలా కలపాలి.తర్వాత కడాయిలో మిగిలిన నువ్వుల నూనెను వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత ఉసిరికాయ మిశ్రమంలో కలపాలి. ఇష్టమైతే ఈ సమయంలో నిమ్మరసం కూడా జోడించుకోవచ్చు. చివరగా పచ్చడిని శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న గాజు సీసాలోకి తీసుకోవాలి. మసాలాల రుచి ఉసిరికాయ ముక్కలకు బాగా పట్టాలంటే రెండు రోజుల తర్వాత తినడం మంచిది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలిపి తింటే అద్భుతమైన రుచి ఉంటుంది.చిన్న చిట్కా: పచ్చడిని తీసుకునేటప్పుడు ఎప్పుడూ శుభ్రమైన, పొడి చెంచానే ఉపయోగించాలి. తేమ చేరకుండా చూసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ చేయాలనుకుంటే పచ్చడిలో తేమ, వాసన లేదా బూజు వంటి మార్పులు కనిపిస్తున్నాయేమో గమనించాలి.మరింత చదవండి

Source link