ప్రభన్యూస్

Ramayana: ప్రశంసలన్నీ వాళ్ళకే.. శూర్పణఖ పాత్రపై రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ పోస్ట్ | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ దాడి చేస్తున్న సినిమా రామాయణ. అయితే ఈ సినిమాలో శూర్పణఖ పాత్ర పోషించిన రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

News18
News18

బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ ‘రామాయణ’ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ బడ్జెట్, అత్యాధునిక వీఎఫ్ఎక్స్‌తో (VFX) రూపొందిన ఈ ఇతిహాస చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సాధారణంగా గ్లామరస్ పాత్రల్లో మెరిసే రకుల్, ఈ పౌరాణిక నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో విభిన్నమైన నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం.

ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ‘రామాయణ’ సినిమా షూటింగ్ అనుభవాలను, శూర్పణఖ పాత్ర కోసం పడిన కష్టాన్ని అభిమానులతో పంచుకున్నారు. “శూర్పణఖ పాత్రను పోషించడం నా సినీ జీవితంలోనే ఒక ప్రత్యేకమైన, మర్చిపోలేని ప్రయాణం. మన అద్భుతమైన భారతీయ సంస్కృతిలో భాగమైన రామాయణాన్ని ఇంత భారీ స్థాయిలో, విజువల్ ట్రీట్‌గా వెండితెరపై ఆవిష్కరించడం, అందులో నేను భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని రకుల్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇంతటి గొప్ప ఇతిహాసాన్ని తెరపైకి తీసుకొచ్చిన నిర్మాత నమిత్ మల్హోత్రా (ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్), దర్శకుడు నితేష్ తివారీకి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం నుంచి ప్రపంచ స్థాయికి ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించాలన్న వారి తపన తనకెంతో స్ఫూర్తినిచ్చిందన్నారు.

అయితే, ఈ పోస్టులో రకుల్ వెల్లడించిన మరో ఆసక్తికరమైన విషయం నెట్టింట వైరల్‌గా మారింది. సినిమాలో శూర్పణఖగా తన మేకోవర్ కోసం పడిన శ్రమను ఆమె కొనియాడారు. “శూర్పణఖ పాత్ర కోసం నా లుక్‌ను సిద్ధం చేయడానికి మేకప్, హెయిర్, కాస్ట్యూమ్స్ బృందాలు ప్రతిరోజూ ఏకంగా నాలుగు గంటల పాటు కష్టపడేవారు. ఇప్పుడు నా లుక్‌కు వస్తున్న ప్రశంసలన్నీ ఆ టీమ్‌కే దక్కుతాయి” అని ఆమె స్పష్టం చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రకుల్ తో పాటు సన్నీ డియోల్ (హనుమంతుడు), లారా దత్తా, అరుణ్ గోవిల్ తదితర హేమాహేమీలు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 November 2026, 3:37 pm Digital Edition : Prabhanews
Ramayana: ప్రశంసలన్నీ వాళ్ళకే.. శూర్పణఖ పాత్రపై రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ పోస్ట్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 07, 2026 3:30 PM ISTభారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ దాడి చేస్తున్న సినిమా రామాయణ. అయితే ఈ సినిమాలో శూర్పణఖ పాత్ర పోషించిన రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా ఓ పోస్ట్ పెడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. News18బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ 'రామాయణ' నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ బడ్జెట్, అత్యాధునిక వీఎఫ్ఎక్స్‌తో (VFX) రూపొందిన ఈ ఇతిహాస చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సాధారణంగా గ్లామరస్ పాత్రల్లో మెరిసే రకుల్, ఈ పౌరాణిక నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో విభిన్నమైన నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం.ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా 'రామాయణ' సినిమా షూటింగ్ అనుభవాలను, శూర్పణఖ పాత్ర కోసం పడిన కష్టాన్ని అభిమానులతో పంచుకున్నారు. "శూర్పణఖ పాత్రను పోషించడం నా సినీ జీవితంలోనే ఒక ప్రత్యేకమైన, మర్చిపోలేని ప్రయాణం. మన అద్భుతమైన భారతీయ సంస్కృతిలో భాగమైన రామాయణాన్ని ఇంత భారీ స్థాయిలో, విజువల్ ట్రీట్‌గా వెండితెరపై ఆవిష్కరించడం, అందులో నేను భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని రకుల్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇంతటి గొప్ప ఇతిహాసాన్ని తెరపైకి తీసుకొచ్చిన నిర్మాత నమిత్ మల్హోత్రా (ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్), దర్శకుడు నితేష్ తివారీకి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం నుంచి ప్రపంచ స్థాయికి ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించాలన్న వారి తపన తనకెంతో స్ఫూర్తినిచ్చిందన్నారు.అయితే, ఈ పోస్టులో రకుల్ వెల్లడించిన మరో ఆసక్తికరమైన విషయం నెట్టింట వైరల్‌గా మారింది. సినిమాలో శూర్పణఖగా తన మేకోవర్ కోసం పడిన శ్రమను ఆమె కొనియాడారు. "శూర్పణఖ పాత్ర కోసం నా లుక్‌ను సిద్ధం చేయడానికి మేకప్, హెయిర్, కాస్ట్యూమ్స్ బృందాలు ప్రతిరోజూ ఏకంగా నాలుగు గంటల పాటు కష్టపడేవారు. ఇప్పుడు నా లుక్‌కు వస్తున్న ప్రశంసలన్నీ ఆ టీమ్‌కే దక్కుతాయి" అని ఆమె స్పష్టం చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రకుల్ తో పాటు సన్నీ డియోల్ (హనుమంతుడు), లారా దత్తా, అరుణ్ గోవిల్ తదితర హేమాహేమీలు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.మరింత చదవండి

Source link