Last Updated:
బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా ‘ఫన్’ అనే కొత్త సినిమా రూపొందనుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సంతోషి రెడ్డి నిర్మాణంలో హేమంత్ కృష్ణ దర్శకత్వం వహించనున్న హారర్ కామెడీ చిత్రం “ఫన్” నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఈ చిత్రంలో సాహితి, అజయ్ ఘోష్, రవి శివ తేజ, వి.యశోర, సోనియా నాయుడు, జె.డి.వి ప్రసాద్, బేబీ జస్విత, మాస్టర్ హనీష్ ముఖ్య పాత్రలను పోషించానున్నారు.
ఈ సినిమాకి సంగీతం రామ్ గోపాల్ అందించనున్నారు. జి.ఎల్ బాబు కెమెరామెన్‌గా, క్రాంతి (ఆర్.కె.) ఎడిటర్‌గా పని చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్లను అందించేలా మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.
హారర్ సన్నివేశాలకు నేటితరం ఆడియన్స్ కనక్ట్ అయ్యే కామెడీ సన్నివేశాలు జోడించి వినూత్నంగా ఈ సినిమా రూపొందించనున్నారట. కళ్యాణ్ పడాల, సాహితి, అజయ్ ఘోష్, రవి శివ తేజ, వి.యశోర, సోనియా నాయుడు, జె.డి.వి ప్రసాద్, బేబీ జస్విత, మాస్టర్ హనీష్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.

