Last Updated:
Gold Price Today: బంగారం, వెండి కొనాలనుకునే వారికి మంగళవారం ఉదయమే షాక్ తగిలింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై ఎంత పెరిగిందో తెలుసా?
బంగారం, వెండి కొనాలని భావిస్తున్న వారికి మంగళవారం ఉదయం మార్కెట్ ఊహించని షాక్ ఇచ్చింది. మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ రెండు విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే బంగారం, వెండి రేట్లు భారీగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు తాజా ధరలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునే వారికి ఇది షాక్ అనుకోవాలి.
మంగళవారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం.. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు భారీగా పెరిగాయి. డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,35,129 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.590 పెరిగింది. అంటే మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగారం ధరలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్స్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,69,524 వద్ద కొనసాగుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపుతో పోలిస్తే కిలో వెండిపై రూ.1,661 పెరుగుదల నమోదైంది. దీంతో ఫ్యూచర్స్ మార్కెట్‌లో రెండు లోహాల ధరలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఫ్యూచర్స్ మార్కెట్‌లోనే కాకుండా హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఉదయం 9:07 గంటలకు bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.590 పెరిగి రూ.1,35,600కు చేరింది. అంటే గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే కొనుగోలుదారులు 10 గ్రాముల బంగారం కోసం అదనంగా రూ.590 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,24,380 వద్ద కొనసాగుతోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తమ బడ్జెట్‌ను మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది.
ఇక వెండి విషయానికి వస్తే హైదరాబాద్‌లో కిలో ధర గత మార్కెట్ ముగింపు రేటుతో పోలిస్తే రూ.1,400 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,70,090 వద్ద కొనసాగుతోంది. వెండి కొనాలనుకునే వారికి కూడా ఈ పెరుగుదల ప్రభావం కనిపించనుంది. అయితే బంగారం, వెండి ధరలు రోజంతా ఒకేలా ఉండవు. అంతర్జాతీయ మార్కెట్‌లో మార్పులు, డాలర్ విలువ, పెట్టుబడిదారుల కొనుగోళ్లు, అమ్మకాలు వంటి అంశాల ఆధారంగా ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. అలాగే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు స్థానిక దుకాణాల ధరలు, తరుగు, తయారీ ఛార్జీలు, జీఎస్టీ అదనంగా వర్తించవచ్చు. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను నగల దుకాణంలో మరోసారి తెలుసుకోవడం మంచిది.

