ప్రభన్యూస్

PM Modi: నేలపై ఉన్న జాతీయ జెండాను జేబులో పెట్టుకున్న ప్రధాని మోదీ.. క్వాడ్ సదస్సులో ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్! |


Last Updated:

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన క్వాడ్ దేశాధినేతల ఫోటో సెషన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేలపై ఉన్న భారత జాతీయ జెండా గుర్తును తీసుకుని జేబులో పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.

News18
News18

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా మంగళవారం జరిగిన క్వాడ్ (QUAD) దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని సనాయే తకైచీలతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్రూప్ ఫోటో కోసం వేదికపైకి చేరుకున్నారు. ఈ సమయంలో నాయకులు నిలబడే స్థానాలను సూచించేందుకు నేలపై ఆయా దేశాల జాతీయ జెండాలతో కూడిన చిన్న గుర్తులను (ఫ్లోర్ మార్కర్లను) ఏర్పాటు చేశారు.

తన పాదాల వద్ద ఉన్న త్రివర్ణ పతాక గుర్తును గమనించిన ప్రధాని మోదీ, వెంటనే కిందకు వంగి దానిని తీసుకుని తన జేబులో పెట్టుకున్నారు. జాతీయ జెండాను నేలపై ఉంచలేనని ఆయన అనగా, పక్కనే ఉన్న ట్రంప్ “దానిని భద్రపరచండి (సేవ్ ఇట్)” అని బదులిచ్చారు.

2023 బ్రిక్స్ సదస్సులోనూ ఇదే తరహా ఘటన

మిగిలిన దేశాధినేతలు తమ స్థానాలలోనే నిలబడగా, ప్రధాని మోదీ మాత్రమే జాతీయ జెండా పట్ల గౌరవంతో దానిని పైకి తీయడం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. గతంలో 2023లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులోనూ వేదికపై ఉన్న భారత జెండా మార్కర్‌ను మోదీ ఇలాగే తీసుకుని జేబులో పెట్టుకున్నారు.

విపక్షాల విమర్శలు.. మహువా మొయిత్రా ట్వీట్

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష నేతలు విమర్శలకు దిగారు. అంతర్జాతీయ వేదికపై నేలపై ఉన్న ఫ్లోర్ మార్కర్‌ను తీసి జేబులో పెట్టుకోవడం ద్వారా ప్రధాని మోదీ దేశాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ‘ఎక్స్’ వేదికగా ఎద్దేవా చేశారు. మరోవైపు జాతీయ జెండా గౌరవాన్ని కాపాడేందుకే ప్రధాని అలా చేశారని బీజేపీ శ్రేణులు సమర్థిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 9:00 pm Digital Edition : Prabhanews
PM Modi: నేలపై ఉన్న జాతీయ జెండాను జేబులో పెట్టుకున్న ప్రధాని మోదీ.. క్వాడ్ సదస్సులో ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్! |

Last Updated:Nov 17, 2026 8:52 PM ISTఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన క్వాడ్ దేశాధినేతల ఫోటో సెషన్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేలపై ఉన్న భారత జాతీయ జెండా గుర్తును తీసుకుని జేబులో పెట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.News18ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా మంగళవారం జరిగిన క్వాడ్ (QUAD) దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని సనాయే తకైచీలతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గ్రూప్ ఫోటో కోసం వేదికపైకి చేరుకున్నారు. ఈ సమయంలో నాయకులు నిలబడే స్థానాలను సూచించేందుకు నేలపై ఆయా దేశాల జాతీయ జెండాలతో కూడిన చిన్న గుర్తులను (ఫ్లోర్ మార్కర్లను) ఏర్పాటు చేశారు.తన పాదాల వద్ద ఉన్న త్రివర్ణ పతాక గుర్తును గమనించిన ప్రధాని మోదీ, వెంటనే కిందకు వంగి దానిని తీసుకుని తన జేబులో పెట్టుకున్నారు. జాతీయ జెండాను నేలపై ఉంచలేనని ఆయన అనగా, పక్కనే ఉన్న ట్రంప్ "దానిని భద్రపరచండి (సేవ్ ఇట్)" అని బదులిచ్చారు.
VIDEO | Philippines: PM Narendra Modi picks up a piece of paper from the floor while standing together with Quad leaders in Manila.
(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) https://t.co/W02MUE2w5q— Press Trust of India (@PTI_News) November 17, 20262023 బ్రిక్స్ సదస్సులోనూ ఇదే తరహా ఘటనమిగిలిన దేశాధినేతలు తమ స్థానాలలోనే నిలబడగా, ప్రధాని మోదీ మాత్రమే జాతీయ జెండా పట్ల గౌరవంతో దానిని పైకి తీయడం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. గతంలో 2023లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులోనూ వేదికపై ఉన్న భారత జెండా మార్కర్‌ను మోదీ ఇలాగే తీసుకుని జేబులో పెట్టుకున్నారు.
How can anyone, I mean anyone, embarrass India more on a global stage than PM Modi who literally picked up a floor marker & pocketed it. …. Unf….believable! https://t.co/sdzVipslzy
— Mahua Moitra (@MahuaMoitra) November 17, 2026విపక్షాల విమర్శలు.. మహువా మొయిత్రా ట్వీట్ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష నేతలు విమర్శలకు దిగారు. అంతర్జాతీయ వేదికపై నేలపై ఉన్న ఫ్లోర్ మార్కర్‌ను తీసి జేబులో పెట్టుకోవడం ద్వారా ప్రధాని మోదీ దేశాన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా 'ఎక్స్' వేదికగా ఎద్దేవా చేశారు. మరోవైపు జాతీయ జెండా గౌరవాన్ని కాపాడేందుకే ప్రధాని అలా చేశారని బీజేపీ శ్రేణులు సమర్థిస్తున్నాయి.మరింత చదవండి

Source link