ప్రభన్యూస్

రైతులకు పండగలాంటి వార్త… 25 శాతం తక్కువ ధరకే మహీంద్రా హార్వెస్టర్! | Mahindra Introduces Compact Harvest Yuva Harvester for Small and Medium Farmers | బిజినెస్


కొన్ని భారీ సెల్ఫ్-ప్రొపెల్డ్ హార్వెస్టర్ల ధరతో పోలిస్తే 25 శాతం తక్కువకే (రూ. 7 లక్షల వరకు) ఇది లభిస్తుంది. తద్వారా ఇది చిన్న, మధ్య తరహా రైతులు, గ్రామీణ రెంటల్ ఎంట్రప్రెన్యూర్లకు ధరపరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. చిన్న కమతాలకు చౌకైన యాంత్రిక హార్వెస్టింగ్ సొల్యూషన్స్‌ని సరికొత్త మహీంద్రా హార్వెస్ట్ యువ అందిస్తుంది. అలాగే కోత పనులను వేగవంతం చేయడం ద్వారా మాన్యువల్ హార్వెస్టింగ్‌తో పోలిస్తే ఉత్పాదకతను మరింతగా పెంచగలదు. మహీంద్రా హార్వెస్ట్ యువతో చిన్న, మధ్య తరహా కమతాలను కూడా సమర్ధవంతంగా హార్వెస్ట్ చేయొచ్చు. రైతులు సకాలంలో హార్వెస్టింగ్‌ను పూర్తి చేసేందుకు, వాతావరణ సంబంధ నష్టాలను తగ్గించుకునేందుకు, తమ ఆదాయ అవకాశాలను పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: Curd Maker: రెస్టారెంట్ స్టైల్‌లో గడ్డ పెరుగు, యోగర్ట్… మీ కిచెన్‌లో ఇది ఉంటే చాలు… జస్ట్ రూ.439 మాత్రమే!

“చిన్న, మధ్య తరహా రైతుల విశిష్ట అవసరాలను తీర్చే విధంగా మహీంద్రా హార్వెస్ట్ యువ తీర్చిదిద్దబడింది. పొందికైనదిగా, రహదారిపై సౌకర్యవంతంగా రవాణా చేసే విధంగా, పనులు చేసుకునేందుకు సులభతరంగా ఉండేలా, సమర్ధవంతంగా హార్వెస్టింగ్ పనులను చక్కబెట్టేలా తీర్చిదిద్దబడిన మా కొత్త హార్వెస్టరు, పెద్ద యంత్రాలు చేరుకోలేని సంక్లిష్టమైన ప్రాంతాల్లో కూడా రైతులకు మెకనైజ్డ్ హార్వెస్టింగ్‌ను అందుబాటులోకి తెస్తుంది. అఫోర్డబిలిటీ, ఉత్పాదకత, విశ్వసనీయత కలబోతగా ఉంటూ హార్వెస్ట్ యువ అనేది నిర్వహణ సామర్థ్యాలను, సాగు లాభదాయకతను మెరుగుపర్చే సాధనంగా రైతులు, గ్రామీణ ఎంట్రప్రెన్యూర్లకు ఉపయోగపడుతుంది” అని రవీంద్ర శహాణె (వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ – ఫార్మ్ మెషినరీ, ఫార్మ్ ఎక్విప్‌మెంట్ బిజినెస్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్) తెలిపారు.

Mahindra Harvest Yuva, Mahindra new harvester, affordable harvester for small farmers, Mahindra harvester price in India, multi crop harvesting machine, mini harvester for small farms, రైతులకు మహీంద్రా గుడ్ న్యూస్, వ్యవసాయ యంత్రాల తాజా సమాచారం, తక్కువ ధరలో వ్యవసాయ పరికరాలు, చిన్న రైతులకు ఉపయోగపడే యంత్రాలు, పంట కోతకు కొత్త టెక్నాలజీ, రైతులకు వ్యవసాయ పరికరాల సబ్సిడీ

ఆపరేటరును దృష్టిలో ఉంచుకుని పనులను సులభతరంగా నిర్వహించుకునేలా తీర్చిదిద్దిన కొత్త మహీంద్రా హార్వెస్ట్ యువలో పలు ఫీచర్లు ఉన్నాయి. స్టేషన్ ఎత్తు తక్కువగా ఉండటం, కో-డ్రైవర్ సీటుతో విశాలమైన ప్లాట్‌ఫాం, పనులను సులభతరంగా చేసేందుకు సెల్ఫ్-క్లీనింగ్ రేడియేటర్ ఉన్నాయి. ఇంజిన్‌ని వెనుకవైపున అమల్చడం వల్ల సుదీర్ఘ సమయం పాటు పని చేసేటప్పుడు ఇంజిన్ వేడి నుంచి ఆపరేటరుకు ఉపశమనం లభిస్తుంది. ఆర్‌టీవో ఆమోదించిన 9.3, 10.9 అడుగుల వెడల్పు గల కట్టర్ బార్, క్లోజ్డ్ అన్‌లోడింగ్ ట్యూబ్‌, 8 అడుగుల ట్రాక్ విడ్త్‌లాంటి అంశాల ఊతంతో గ్రామాల్లోని చిన్న రోడ్లు, మలుపుల్లో కూడా మహీంద్రా హార్వెస్ట్ యువ సులువుగా వెళ్లగలదు. 4 వీల్ డ్రైవ్ ఫీచరు వల్ల తడిగా ఉండే వరి, సోయా పంట నేలల్లో కూడా మెరుగైన ట్రాక్షన్‌తో పనులు చేసేందుకు వీలవుతుంది.

ఇది కూడా చదవండి: Gratuity Rules: 5 ఏళ్లు ఉద్యోగం చేస్తే మీ చేతికి ఎంత డబ్బు వస్తుందో తెలుసా? ఈ లెక్కతో ఈజీగా తెలుసుకోండి

కట్టర్ బార్ పొందికైనదిగా ఉండటం వల్ల ఒక పొలం నుంచి మరో పొలంలోకి వెళ్లేటప్పుడు, చిన్న కమతాల్లోకి వెళ్లేటప్పుడు లేదా రహదారిపైనా లేదా పొలాల గుండా వెళ్లేటప్పుడు కట్టర్ బార్‌ని మాటిమాటికి తీసి, తిరిగి తగించాల్సిన సమస్య ఉండదు. ముందువైపున కట్టర్ బార్ స్పష్టంగా కనిపించడం వల్ల పంటను సమర్ధవంతంగా కోసేందుకు, పంట నష్టాన్ని తగ్గించేందుకు సహాయకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎగుడుదిగుడుగా ఉండే పొలాల్లో ఈ ఫీచరు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

హైడ్రాలిక్ రీల్ అడ్జస్టర్లు, ప్రోంగ్ కట్టర్లు వివిధ ఎత్తులు, సాంద్రత ఉండే పంటలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు వీలుగా ఉంటాయి. హార్వెస్టరులో విశిష్టమైన ఫీడర్ రివర్సర్ ఫీచరు ఉంది. పేరుకుపోయిన మెటీరియల్‌ను ఆపరేటర్ స్టేషన్ నుంచే ఒక్క లీవర్‌ను ఉపయోగించడం ద్వారా తొలగించేందుకు వీలవుతుంది. ఇన్‌లైన్ ఫ్రంట్, రియర్ వీల్ కాన్ఫిగరేషన్‌తో కూడుకున్న తేలికపాటి, చెయిన్ ఆధారిత వ్యవస్థ అనేది నేల గట్టిపడటాన్ని తగ్గిస్తుంది. పని వేగాన్ని, కోత సామర్థ్యాన్ని పెంచి, పంట నష్టాన్ని తగ్గిస్తుంది. తద్వారా మార్కెట్ డెలివరీ కోసం అత్యత నాణ్యమైన ఉత్పత్తిని సాధించేందుకు తోడ్పడుతుంది.

విశ్వసనీయమైన మహీంద్రా ఇంజిన్ టెక్నాలజీ దన్నుతో నమ్మకంగా, సుదీర్ఘ సమయం పాటు పని చేసేలా మహీంద్రా హార్వెస్ట్ యువ తీర్చిదిద్దబడింది. సర్వీసింగ్ సరళతరంగా ఉండటం వల్ల డౌన్‌టైమ్ తగ్గుతుంది. ఈ హార్వెస్టరుకు మహీంద్రా 1 ఏడాది వారంటీ అందిస్తోంది. సరికొత్త మహీంద్రా హార్వెస్ట్ యువ ప్రస్తుతం మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కీలక మార్కెట్లలో అమ్మకాలకు అందుబాటులో ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 November 2026, 3:38 pm Digital Edition : Prabhanews
రైతులకు పండగలాంటి వార్త… 25 శాతం తక్కువ ధరకే మహీంద్రా హార్వెస్టర్! | Mahindra Introduces Compact Harvest Yuva Harvester for Small and Medium Farmers | బిజినెస్

కొన్ని భారీ సెల్ఫ్-ప్రొపెల్డ్ హార్వెస్టర్ల ధరతో పోలిస్తే 25 శాతం తక్కువకే (రూ. 7 లక్షల వరకు) ఇది లభిస్తుంది. తద్వారా ఇది చిన్న, మధ్య తరహా రైతులు, గ్రామీణ రెంటల్ ఎంట్రప్రెన్యూర్లకు ధరపరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. చిన్న కమతాలకు చౌకైన యాంత్రిక హార్వెస్టింగ్ సొల్యూషన్స్‌ని సరికొత్త మహీంద్రా హార్వెస్ట్ యువ అందిస్తుంది. అలాగే కోత పనులను వేగవంతం చేయడం ద్వారా మాన్యువల్ హార్వెస్టింగ్‌తో పోలిస్తే ఉత్పాదకతను మరింతగా పెంచగలదు. మహీంద్రా హార్వెస్ట్ యువతో చిన్న, మధ్య తరహా కమతాలను కూడా సమర్ధవంతంగా హార్వెస్ట్ చేయొచ్చు. రైతులు సకాలంలో హార్వెస్టింగ్‌ను పూర్తి చేసేందుకు, వాతావరణ సంబంధ నష్టాలను తగ్గించుకునేందుకు, తమ ఆదాయ అవకాశాలను పెంచుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.ఇది కూడా చదవండి: Curd Maker: రెస్టారెంట్ స్టైల్‌లో గడ్డ పెరుగు, యోగర్ట్... మీ కిచెన్‌లో ఇది ఉంటే చాలు... జస్ట్ రూ.439 మాత్రమే!"చిన్న, మధ్య తరహా రైతుల విశిష్ట అవసరాలను తీర్చే విధంగా మహీంద్రా హార్వెస్ట్ యువ తీర్చిదిద్దబడింది. పొందికైనదిగా, రహదారిపై సౌకర్యవంతంగా రవాణా చేసే విధంగా, పనులు చేసుకునేందుకు సులభతరంగా ఉండేలా, సమర్ధవంతంగా హార్వెస్టింగ్ పనులను చక్కబెట్టేలా తీర్చిదిద్దబడిన మా కొత్త హార్వెస్టరు, పెద్ద యంత్రాలు చేరుకోలేని సంక్లిష్టమైన ప్రాంతాల్లో కూడా రైతులకు మెకనైజ్డ్ హార్వెస్టింగ్‌ను అందుబాటులోకి తెస్తుంది. అఫోర్డబిలిటీ, ఉత్పాదకత, విశ్వసనీయత కలబోతగా ఉంటూ హార్వెస్ట్ యువ అనేది నిర్వహణ సామర్థ్యాలను, సాగు లాభదాయకతను మెరుగుపర్చే సాధనంగా రైతులు, గ్రామీణ ఎంట్రప్రెన్యూర్లకు ఉపయోగపడుతుంది" అని రవీంద్ర శహాణె (వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ - ఫార్మ్ మెషినరీ, ఫార్మ్ ఎక్విప్‌మెంట్ బిజినెస్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్) తెలిపారు.ఆపరేటరును దృష్టిలో ఉంచుకుని పనులను సులభతరంగా నిర్వహించుకునేలా తీర్చిదిద్దిన కొత్త మహీంద్రా హార్వెస్ట్ యువలో పలు ఫీచర్లు ఉన్నాయి. స్టేషన్ ఎత్తు తక్కువగా ఉండటం, కో-డ్రైవర్ సీటుతో విశాలమైన ప్లాట్‌ఫాం, పనులను సులభతరంగా చేసేందుకు సెల్ఫ్-క్లీనింగ్ రేడియేటర్ ఉన్నాయి. ఇంజిన్‌ని వెనుకవైపున అమల్చడం వల్ల సుదీర్ఘ సమయం పాటు పని చేసేటప్పుడు ఇంజిన్ వేడి నుంచి ఆపరేటరుకు ఉపశమనం లభిస్తుంది. ఆర్‌టీవో ఆమోదించిన 9.3, 10.9 అడుగుల వెడల్పు గల కట్టర్ బార్, క్లోజ్డ్ అన్‌లోడింగ్ ట్యూబ్‌, 8 అడుగుల ట్రాక్ విడ్త్‌లాంటి అంశాల ఊతంతో గ్రామాల్లోని చిన్న రోడ్లు, మలుపుల్లో కూడా మహీంద్రా హార్వెస్ట్ యువ సులువుగా వెళ్లగలదు. 4 వీల్ డ్రైవ్ ఫీచరు వల్ల తడిగా ఉండే వరి, సోయా పంట నేలల్లో కూడా మెరుగైన ట్రాక్షన్‌తో పనులు చేసేందుకు వీలవుతుంది.ఇది కూడా చదవండి: Gratuity Rules: 5 ఏళ్లు ఉద్యోగం చేస్తే మీ చేతికి ఎంత డబ్బు వస్తుందో తెలుసా? ఈ లెక్కతో ఈజీగా తెలుసుకోండికట్టర్ బార్ పొందికైనదిగా ఉండటం వల్ల ఒక పొలం నుంచి మరో పొలంలోకి వెళ్లేటప్పుడు, చిన్న కమతాల్లోకి వెళ్లేటప్పుడు లేదా రహదారిపైనా లేదా పొలాల గుండా వెళ్లేటప్పుడు కట్టర్ బార్‌ని మాటిమాటికి తీసి, తిరిగి తగించాల్సిన సమస్య ఉండదు. ముందువైపున కట్టర్ బార్ స్పష్టంగా కనిపించడం వల్ల పంటను సమర్ధవంతంగా కోసేందుకు, పంట నష్టాన్ని తగ్గించేందుకు సహాయకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఎగుడుదిగుడుగా ఉండే పొలాల్లో ఈ ఫీచరు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.హైడ్రాలిక్ రీల్ అడ్జస్టర్లు, ప్రోంగ్ కట్టర్లు వివిధ ఎత్తులు, సాంద్రత ఉండే పంటలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు వీలుగా ఉంటాయి. హార్వెస్టరులో విశిష్టమైన ఫీడర్ రివర్సర్ ఫీచరు ఉంది. పేరుకుపోయిన మెటీరియల్‌ను ఆపరేటర్ స్టేషన్ నుంచే ఒక్క లీవర్‌ను ఉపయోగించడం ద్వారా తొలగించేందుకు వీలవుతుంది. ఇన్‌లైన్ ఫ్రంట్, రియర్ వీల్ కాన్ఫిగరేషన్‌తో కూడుకున్న తేలికపాటి, చెయిన్ ఆధారిత వ్యవస్థ అనేది నేల గట్టిపడటాన్ని తగ్గిస్తుంది. పని వేగాన్ని, కోత సామర్థ్యాన్ని పెంచి, పంట నష్టాన్ని తగ్గిస్తుంది. తద్వారా మార్కెట్ డెలివరీ కోసం అత్యత నాణ్యమైన ఉత్పత్తిని సాధించేందుకు తోడ్పడుతుంది.విశ్వసనీయమైన మహీంద్రా ఇంజిన్ టెక్నాలజీ దన్నుతో నమ్మకంగా, సుదీర్ఘ సమయం పాటు పని చేసేలా మహీంద్రా హార్వెస్ట్ యువ తీర్చిదిద్దబడింది. సర్వీసింగ్ సరళతరంగా ఉండటం వల్ల డౌన్‌టైమ్ తగ్గుతుంది. ఈ హార్వెస్టరుకు మహీంద్రా 1 ఏడాది వారంటీ అందిస్తోంది. సరికొత్త మహీంద్రా హార్వెస్ట్ యువ ప్రస్తుతం మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కీలక మార్కెట్లలో అమ్మకాలకు అందుబాటులో ఉంది.

Source link