ప్రభన్యూస్

Idupu Kayitham: ఏడవొద్దు శ్రీలత.. మేకప్‌ పోతోంది, ముక్కు కారుతోంది.. ఇడుపు కాయితం టీజర్ చూశారా ఎలా ఉందో! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ప్రియదర్శి- నాగదుర్గ కాంబోలో వస్తున్న లేటెస్ట్ సినిమా ఇడుపు కాయితం. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా, ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.

News18
News18

కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి ‘బలగం’, ‘సేవ్ ద టైగర్స్’ వంటి ప్రాజెక్టులతో సక్సెస్ అందుకొని.. హీరోగా దూసుకుపోతున్న క్రేజీ హీరో ప్రియదర్శి (Priyadarshi Pulikonda) మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham). నూతన నటి నాగదుర్గ (Naga Durga) ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా నటిస్తుండగా.. వంశీరెడ్డి దొండపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌కు చెందిన ‘సుకుమార్ రైటింగ్స్’, బన్నీ వాస్‌కు చెందిన ‘బన్నీ వాస్ వర్క్స్’ లాంటి రెండు అగ్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వాయిస్‌తో ఈ టీజర్ ఆసక్తికరంగా మొదలవుతుంది. “రామాయణం ఎక్కడ ఆగిపోతుంది అనుకుంటామో.. సరిగ్గా అక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది” అంటూ చాగంటి చెప్పే డైలాగ్‌తో భార్యాభర్తల బంధంలోని లోతును, కథలోని క్యూరియాసిటీని దర్శకుడు ఎస్టాబ్లిష్ చేశాడు. ఎంతో అన్యోన్యంగా, అందంగా సాగిపోతున్న ఒక జంట పెళ్లి బంధం.. ఏ పరిస్థితుల్లో ‘ఇడుపు కాయితం’ (విడాకులు) దాకా వెళ్ళింది? ఆ తర్వాత వారి జీవితాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఏంటి? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.

టీజర్‌లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే డైలాగులు చాలా సహజంగా, నవ్వులు పూయించేలా ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్‌లో “ఏడవొద్దు శ్రీలత.. మేకప్‌ పోతోంది. ముక్కు కారుతోంది” అని ప్రియదర్శి అనగా.. దానికి “ముక్కొస్తే లవ్‌ చేయవా?” అంటూ నాగదుర్గ ఎంతో అమాయకంగా, గోముగా అడిగే సంభాషణలు యూత్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. సహజత్వానికి పెద్దపీట వేస్తూ, తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌ను పర్ఫెక్ట్‌గా క్యారీ చేసింది. విలేజ్ డ్రామాలకు ప్రాణం పోసే సురేష్ బొబ్బిలి సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది. కామెడీ, ఎమోషన్, మంచి మ్యూజిక్ కలగలిపిన ఈ ‘ఇడుపు కాయితం’ ఈ ఏడాది చివర్లో, డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 3:57 pm Digital Edition : Prabhanews
Idupu Kayitham: ఏడవొద్దు శ్రీలత.. మేకప్‌ పోతోంది, ముక్కు కారుతోంది.. ఇడుపు కాయితం టీజర్ చూశారా ఎలా ఉందో! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Nov 12, 2026 3:34 PM ISTప్రియదర్శి- నాగదుర్గ కాంబోలో వస్తున్న లేటెస్ట్ సినిమా ఇడుపు కాయితం. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా, ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. News18కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి 'బలగం', 'సేవ్ ద టైగర్స్' వంటి ప్రాజెక్టులతో సక్సెస్ అందుకొని.. హీరోగా దూసుకుపోతున్న క్రేజీ హీరో ప్రియదర్శి (Priyadarshi Pulikonda) మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఇడుపు కాయితం' (Idupu Kayitham). నూతన నటి నాగదుర్గ (Naga Durga) ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా నటిస్తుండగా.. వంశీరెడ్డి దొండపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌కు చెందిన 'సుకుమార్ రైటింగ్స్', బన్నీ వాస్‌కు చెందిన 'బన్నీ వాస్ వర్క్స్' లాంటి రెండు అగ్ర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు వాయిస్‌తో ఈ టీజర్ ఆసక్తికరంగా మొదలవుతుంది. "రామాయణం ఎక్కడ ఆగిపోతుంది అనుకుంటామో.. సరిగ్గా అక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది" అంటూ చాగంటి చెప్పే డైలాగ్‌తో భార్యాభర్తల బంధంలోని లోతును, కథలోని క్యూరియాసిటీని దర్శకుడు ఎస్టాబ్లిష్ చేశాడు. ఎంతో అన్యోన్యంగా, అందంగా సాగిపోతున్న ఒక జంట పెళ్లి బంధం.. ఏ పరిస్థితుల్లో 'ఇడుపు కాయితం' (విడాకులు) దాకా వెళ్ళింది? ఆ తర్వాత వారి జీవితాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఏంటి? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.టీజర్‌లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే డైలాగులు చాలా సహజంగా, నవ్వులు పూయించేలా ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్‌లో "ఏడవొద్దు శ్రీలత.. మేకప్‌ పోతోంది. ముక్కు కారుతోంది" అని ప్రియదర్శి అనగా.. దానికి "ముక్కొస్తే లవ్‌ చేయవా?" అంటూ నాగదుర్గ ఎంతో అమాయకంగా, గోముగా అడిగే సంభాషణలు యూత్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. సహజత్వానికి పెద్దపీట వేస్తూ, తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌ను పర్ఫెక్ట్‌గా క్యారీ చేసింది. విలేజ్ డ్రామాలకు ప్రాణం పోసే సురేష్ బొబ్బిలి సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది. కామెడీ, ఎమోషన్, మంచి మ్యూజిక్ కలగలిపిన ఈ 'ఇడుపు కాయితం' ఈ ఏడాది చివర్లో, డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.మరింత చదవండి

Source link