ఈ రోజుల్లో చాలామందిని జుట్టు రాలడం, పొడిబారడం, చిన్న వయసులోనే తెల్లబడటం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. వీటిని తగ్గించుకోవడానికి ఖరీదైన షాంపూలు, నూనెలు, హెయిర్ ట్రీట్మెంట్ల కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారు. అయితే ఇంట్లోనే లభించే కొన్ని సహజ పదార్థాలతో జుట్టు సంరక్షణకు ఉపయోగపడే మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చని దాదీ మోనా చావ్లా సూచిస్తున్నారు. ఉసిరి, మెంతులు, నల్లజీలకర్ర, కరివేపాకు, టీ పొడి వంటి పదార్థాలతో ఈ మిశ్రమాన్ని తయారు చేయవచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

