ప్రభన్యూస్

యాపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. iPhone Air 2లో డ్యూయల్ కెమెరాలు.. | బిజినెస్


Last Updated:

యాపిల్ కొత్త ఐఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యంగా iPhone Air 2లో రెండు 48MP కెమెరాలు వచ్చే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

(Representative image)
(Representative image)

యాపిల్ నుంచి రాబోయే ఐఫోన్‌లలో కెమెరాల విషయంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సాధారణ ఐఫోన్ 18, ఐఫోన్ ఎయిర్ 2 మోడళ్లలో కొత్త కెమెరా అమరికను తీసుకురావచ్చని తాజా లీకులు సూచిస్తున్నాయి. ఈ రెండు ఫోన్ల డమ్మీ యూనిట్లకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఒక ఫోన్ వెనుక కెమెరాల అమరికలో మార్పులు కనిపించగా, మరో ఫోన్ డిజైన్ మాత్రం ప్రస్తుత మోడల్‌కు దగ్గరగా ఉంది. ఈ ఫోన్లను 2027 వసంతకాలంలో ప్రత్యేకంగా విడుదల చేయాలని యాపిల్ భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే కంపెనీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

ఐఫోన్ ఎయిర్ 2లో రెండు కెమెరాలు?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్ ఎయిర్‌లో వెనుకవైపు ఒకే కెమెరా ఉంది. అయితే దాని తర్వాతి మోడల్ ఎయిర్ 2లో రెండు కెమెరాలు ఉండవచ్చని లీకైన డమ్మీ యూనిట్ వెల్లడిస్తోంది. లూసీ రాయ్ అనే వినియోగదారు ఎక్స్‌లో పంచుకున్న వీడియోలో ఈ ఫోన్ మెటల్ నమూనా కనిపించింది. వెనుకవైపు రెండు కెమెరాలతో పాటు మైక్రోఫోన్, ఎల్‌ఈడీ ఫ్లాష్ కోసం మరో రెండు రంధ్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. కెమెరా విభాగం కూడా ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తోంది. మిగతా భాగాల్లో మాత్రం పెద్ద మార్పులేమీ కనిపించడం లేదు. సన్నని ఆకృతి, బటన్లు, పోర్టులు, ముందు భాగంలోని ఫేస్ ఐడీ అమరిక దాదాపు పాత మోడల్‌లాగే ఉన్నాయి. ఈ మార్పు నిజమైతే ప్రధాన కెమెరాతో పాటు అల్ట్రా వైడ్ కెమెరా కూడా అందుబాటులోకి రావచ్చు.

ఐఫోన్ 18లో ప్రో తరహా డిజైన్ ఉండదా?

వీడియోలో కనిపించిన మరో డమ్మీ యూనిట్ ఐఫోన్ 18దిగా చెబుతున్నారు. దీని పరిమాణం ఎయిర్ 2కు దగ్గరగా ఉన్నప్పటికీ వెనుక కెమెరాల అమరిక ఐఫోన్ 17 తరహాలో కనిపిస్తోంది. యాపిల్ ప్రో మోడళ్లలో ఉండే పెద్ద కెమెరా ప్లాట్‌ఫామ్‌ను ఇందులో ఇవ్వకపోవచ్చని అంచనా. ఇది గతంలో వచ్చిన కొన్ని లీకులకు భిన్నంగా ఉంది.

అంచనా ఫీచర్లు, ధరలు

టిప్‌స్టర్ సంజు చౌదరి ప్రకారం.. ఐఫోన్ ఎయిర్ 2లో 6.55 అంగుళాల ప్రోమోషన్ డిస్‌ప్లే, యాంటీ రిఫ్లెక్టివ్ పూత, ఏ20 ప్రో చిప్‌సెట్, సీ2 మోడెమ్, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండవచ్చు. వెనుక 48 ఎంపీ ప్రధాన, 48 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాలు రావచ్చని సమాచారం. దీని ధర 1,099 డాలర్లు (సుమారు రూ.1,03,000)గా అంచనా.

ఐఫోన్ 18లో 6.3 అంగుళాల ప్రోమోషన్ డిస్‌ప్లే, యాంటీ రిఫ్లెక్టివ్ పూత, 48 ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండవచ్చని తెలుస్తోంది. ఏ20 చిప్‌సెట్, సీ2 మోడెమ్, 4,430 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 40 వాట్ల వైర్డ్ ఛార్జింగ్, మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాలు ఉండవచ్చని అంచనా. ధర 999 డాలర్లు (సుమారు రూ.93,000)గా చెబుతున్నారు.

గమనిక: ఈ వివరాలన్నీ లీకుల ఆధారంగా వచ్చినవే. డిజైన్, ఫీచర్లు, ధరలు, విడుదల తేదీని యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. తుది ఉత్పత్తుల్లో మార్పులు ఉండవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 November 2026, 6:57 pm Digital Edition : Prabhanews
యాపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. iPhone Air 2లో డ్యూయల్ కెమెరాలు.. | బిజినెస్

Last Updated:Nov 10, 2026 6:41 PM ISTయాపిల్ కొత్త ఐఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యంగా iPhone Air 2లో రెండు 48MP కెమెరాలు వచ్చే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
(Representative image)యాపిల్ నుంచి రాబోయే ఐఫోన్‌లలో కెమెరాల విషయంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సాధారణ ఐఫోన్ 18, ఐఫోన్ ఎయిర్ 2 మోడళ్లలో కొత్త కెమెరా అమరికను తీసుకురావచ్చని తాజా లీకులు సూచిస్తున్నాయి. ఈ రెండు ఫోన్ల డమ్మీ యూనిట్లకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఒక ఫోన్ వెనుక కెమెరాల అమరికలో మార్పులు కనిపించగా, మరో ఫోన్ డిజైన్ మాత్రం ప్రస్తుత మోడల్‌కు దగ్గరగా ఉంది. ఈ ఫోన్లను 2027 వసంతకాలంలో ప్రత్యేకంగా విడుదల చేయాలని యాపిల్ భావిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే కంపెనీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.ఐఫోన్ ఎయిర్ 2లో రెండు కెమెరాలు?ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్ ఎయిర్‌లో వెనుకవైపు ఒకే కెమెరా ఉంది. అయితే దాని తర్వాతి మోడల్ ఎయిర్ 2లో రెండు కెమెరాలు ఉండవచ్చని లీకైన డమ్మీ యూనిట్ వెల్లడిస్తోంది. లూసీ రాయ్ అనే వినియోగదారు ఎక్స్‌లో పంచుకున్న వీడియోలో ఈ ఫోన్ మెటల్ నమూనా కనిపించింది. వెనుకవైపు రెండు కెమెరాలతో పాటు మైక్రోఫోన్, ఎల్‌ఈడీ ఫ్లాష్ కోసం మరో రెండు రంధ్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. కెమెరా విభాగం కూడా ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తోంది. మిగతా భాగాల్లో మాత్రం పెద్ద మార్పులేమీ కనిపించడం లేదు. సన్నని ఆకృతి, బటన్లు, పోర్టులు, ముందు భాగంలోని ఫేస్ ఐడీ అమరిక దాదాపు పాత మోడల్‌లాగే ఉన్నాయి. ఈ మార్పు నిజమైతే ప్రధాన కెమెరాతో పాటు అల్ట్రా వైడ్ కెమెరా కూడా అందుబాటులోకి రావచ్చు.ఐఫోన్ 18లో ప్రో తరహా డిజైన్ ఉండదా?వీడియోలో కనిపించిన మరో డమ్మీ యూనిట్ ఐఫోన్ 18దిగా చెబుతున్నారు. దీని పరిమాణం ఎయిర్ 2కు దగ్గరగా ఉన్నప్పటికీ వెనుక కెమెరాల అమరిక ఐఫోన్ 17 తరహాలో కనిపిస్తోంది. యాపిల్ ప్రో మోడళ్లలో ఉండే పెద్ద కెమెరా ప్లాట్‌ఫామ్‌ను ఇందులో ఇవ్వకపోవచ్చని అంచనా. ఇది గతంలో వచ్చిన కొన్ని లీకులకు భిన్నంగా ఉంది.అంచనా ఫీచర్లు, ధరలుటిప్‌స్టర్ సంజు చౌదరి ప్రకారం.. ఐఫోన్ ఎయిర్ 2లో 6.55 అంగుళాల ప్రోమోషన్ డిస్‌ప్లే, యాంటీ రిఫ్లెక్టివ్ పూత, ఏ20 ప్రో చిప్‌సెట్, సీ2 మోడెమ్, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండవచ్చు. వెనుక 48 ఎంపీ ప్రధాన, 48 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాలు రావచ్చని సమాచారం. దీని ధర 1,099 డాలర్లు (సుమారు రూ.1,03,000)గా అంచనా.ఐఫోన్ 18లో 6.3 అంగుళాల ప్రోమోషన్ డిస్‌ప్లే, యాంటీ రిఫ్లెక్టివ్ పూత, 48 ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండవచ్చని తెలుస్తోంది. ఏ20 చిప్‌సెట్, సీ2 మోడెమ్, 4,430 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 40 వాట్ల వైర్డ్ ఛార్జింగ్, మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాలు ఉండవచ్చని అంచనా. ధర 999 డాలర్లు (సుమారు రూ.93,000)గా చెబుతున్నారు.గమనిక: ఈ వివరాలన్నీ లీకుల ఆధారంగా వచ్చినవే. డిజైన్, ఫీచర్లు, ధరలు, విడుదల తేదీని యాపిల్ అధికారికంగా ప్రకటించలేదు. తుది ఉత్పత్తుల్లో మార్పులు ఉండవచ్చు.మరింత చదవండి

Source link