ప్రభన్యూస్

9వ తరగతిలో మంచి మార్కులు… కొడుకుకు రూ.2.30 కోట్ల బీఎండబ్ల్యూ కార్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి | Businessman Gifts 15-Year-Old Son a Rs 2.30 Crore BMW | బిజినెస్


Last Updated:

పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే సాధారణంగా చిన్న చిన్న బహుమతులు ఇస్తుంటారు. కానీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ తండ్రి మాత్రం తన కొడుకు ఆనందం కోసం ఏకంగా రూ.2.30 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు.

9వ తరగతిలో మంచి మార్కులు... కొడుకుకు రూ.2.30 కోట్ల బీఎండబ్ల్యూ కార్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (image: Instagram / talha__0555)
9వ తరగతిలో మంచి మార్కులు… కొడుకుకు రూ.2.30 కోట్ల బీఎండబ్ల్యూ కార్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (image: Instagram / talha__0555)

పరీక్షల్లో మంచి మార్కులు వస్తే పిల్లలకు సాధారణంగా సైకిల్, స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర చిన్న బహుమతులు ఇస్తుంటారు. కానీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త మాత్రం తన కొడుకు 9వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడని ఏకంగా రూ.2.30 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ ఖరీదైన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిందని మనీకంట్రోల్ కథనం వివరించింది. ఆ కథనం ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా బర్ధమాన్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి అతడి తండ్రి ఇచ్చిన బహుమతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 9వ తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించినందుకు 15 ఏళ్ల కొడుకుకు సుమారు రూ.2.30 కోట్ల విలువైన లగ్జరీ బీఎండబ్ల్యూ ఎం4 కాంపిటీషన్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ వింతైన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చదువులో మంచి ప్రతిభ చూపినందుకు ఇంత ఖరీదైన బహుమతి ఇవ్వడం కొందరికి చాలా గొప్ప విషయంగా అనిపిస్తోంది. మరికొందరు మాత్రం టీనేజ్ వయసులో ఉన్న అబ్బాయికి ఇంత ఖరీదైన కారు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆ విద్యార్థి పేరు మహమ్మద్ తల్హా. అతడికి 15 ఏళ్లు. పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా బర్ధమాన్ జిల్లా గాల్సి ప్రాంతంలో ఉన్న పరాజ్ గ్రామంలో నివసిస్తున్నాడు. అక్కడి ఓ స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. తల్హా తండ్రి షంసుద్దీన్ మిడ్యా వ్యాపారవేత్త. కొడుకు హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంతో అతడి కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాడు. తల్హాకు బీఎండబ్ల్యూ ఎం4 కాంపిటీషన్ కారు అంటే చాలా ఇష్టం. చాలాకాలంగా ఆ కారు కావాలని కోరుకుంటున్నాడు. దీంతో తండ్రి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ కోరికను నెరవేర్చాడు. మీడియా కథనాల ప్రకారం.. ఈ కారును కొనుగోలు చేసేందుకు షంసుద్దీన్ ముంబైకి వెళ్లాడు. అక్కడ కారు కొనుగోలు చేసిన తర్వాత ప్రత్యేక కంటైనర్‌లో తమ సొంత ఊరికి తరలించాడు.

ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వస్తున్నాయి. సాధారణంగా స్కూల్ పరీక్షల్లో మంచి మార్కులు వస్తే చిన్న చిన్న బహుమతులు ఇస్తుంటారు. కానీ ఏకంగా కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కారు ఇవ్వడం చర్చకు దారితీసింది. కొంతమంది తండ్రి తన కొడుకుపై చూపించిన ప్రేమకు ఇది నిదర్శనమని అంటున్నారు. మరికొందరు మాత్రం మైనర్ అయిన విద్యార్థికి ఇంత ఖరీదైన కారు బహుమతిగా ఇవ్వడం ఎంతవరకు సరైనదని ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కరెంట్ బిల్లుల టెన్షన్ అక్కర్లేదు… సోలార్‌తో నెలకు రూ.3,500 వరకు ఆదా… రూ.78,000 సబ్సిడీ కూడా

అయితే ప్రస్తుతం తల్హా ఈ బీఎండబ్ల్యూ కారును తానే నడపడం కంటే ప్రయాణికుడిగా ఆస్వాదించే అవకాశం ఉంది. ఎందుకంటే అతడికి ఇంకా 15 ఏళ్లే. ఏదేమైనా, 9వ తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో వచ్చిన మంచి మార్కులు అతడికి జీవితాంతం గుర్తుండిపోయే ఖరీదైన బహుమతిని తెచ్చిపెట్టాయి. తన సొంత గ్రామానికే పరిమితమైన ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 November 2026, 5:41 pm Digital Edition : Prabhanews
9వ తరగతిలో మంచి మార్కులు… కొడుకుకు రూ.2.30 కోట్ల బీఎండబ్ల్యూ కార్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి | Businessman Gifts 15-Year-Old Son a Rs 2.30 Crore BMW | బిజినెస్

Last Updated:Nov 10, 2026 5:17 PM ISTపరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తే సాధారణంగా చిన్న చిన్న బహుమతులు ఇస్తుంటారు. కానీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ తండ్రి మాత్రం తన కొడుకు ఆనందం కోసం ఏకంగా రూ.2.30 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు.9వ తరగతిలో మంచి మార్కులు... కొడుకుకు రూ.2.30 కోట్ల బీఎండబ్ల్యూ కార్ గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (image: Instagram / talha__0555)పరీక్షల్లో మంచి మార్కులు వస్తే పిల్లలకు సాధారణంగా సైకిల్, స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర చిన్న బహుమతులు ఇస్తుంటారు. కానీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త మాత్రం తన కొడుకు 9వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడని ఏకంగా రూ.2.30 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ ఖరీదైన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిందని మనీకంట్రోల్ కథనం వివరించింది. ఆ కథనం ప్రకారం పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా బర్ధమాన్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి అతడి తండ్రి ఇచ్చిన బహుమతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 9వ తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించినందుకు 15 ఏళ్ల కొడుకుకు సుమారు రూ.2.30 కోట్ల విలువైన లగ్జరీ బీఎండబ్ల్యూ ఎం4 కాంపిటీషన్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ వింతైన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చదువులో మంచి ప్రతిభ చూపినందుకు ఇంత ఖరీదైన బహుమతి ఇవ్వడం కొందరికి చాలా గొప్ప విషయంగా అనిపిస్తోంది. మరికొందరు మాత్రం టీనేజ్ వయసులో ఉన్న అబ్బాయికి ఇంత ఖరీదైన కారు ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఆ విద్యార్థి పేరు మహమ్మద్ తల్హా. అతడికి 15 ఏళ్లు. పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా బర్ధమాన్ జిల్లా గాల్సి ప్రాంతంలో ఉన్న పరాజ్ గ్రామంలో నివసిస్తున్నాడు. అక్కడి ఓ స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. తల్హా తండ్రి షంసుద్దీన్ మిడ్యా వ్యాపారవేత్త. కొడుకు హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంతో అతడి కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాడు. తల్హాకు బీఎండబ్ల్యూ ఎం4 కాంపిటీషన్ కారు అంటే చాలా ఇష్టం. చాలాకాలంగా ఆ కారు కావాలని కోరుకుంటున్నాడు. దీంతో తండ్రి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ కోరికను నెరవేర్చాడు. మీడియా కథనాల ప్రకారం.. ఈ కారును కొనుగోలు చేసేందుకు షంసుద్దీన్ ముంబైకి వెళ్లాడు. అక్కడ కారు కొనుగోలు చేసిన తర్వాత ప్రత్యేక కంటైనర్‌లో తమ సొంత ఊరికి తరలించాడు.ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వస్తున్నాయి. సాధారణంగా స్కూల్ పరీక్షల్లో మంచి మార్కులు వస్తే చిన్న చిన్న బహుమతులు ఇస్తుంటారు. కానీ ఏకంగా కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కారు ఇవ్వడం చర్చకు దారితీసింది. కొంతమంది తండ్రి తన కొడుకుపై చూపించిన ప్రేమకు ఇది నిదర్శనమని అంటున్నారు. మరికొందరు మాత్రం మైనర్ అయిన విద్యార్థికి ఇంత ఖరీదైన కారు బహుమతిగా ఇవ్వడం ఎంతవరకు సరైనదని ప్రశ్నిస్తున్నారు.ఇది కూడా చదవండి: కరెంట్ బిల్లుల టెన్షన్ అక్కర్లేదు... సోలార్‌తో నెలకు రూ.3,500 వరకు ఆదా... రూ.78,000 సబ్సిడీ కూడాఅయితే ప్రస్తుతం తల్హా ఈ బీఎండబ్ల్యూ కారును తానే నడపడం కంటే ప్రయాణికుడిగా ఆస్వాదించే అవకాశం ఉంది. ఎందుకంటే అతడికి ఇంకా 15 ఏళ్లే. ఏదేమైనా, 9వ తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో వచ్చిన మంచి మార్కులు అతడికి జీవితాంతం గుర్తుండిపోయే ఖరీదైన బహుమతిని తెచ్చిపెట్టాయి. తన సొంత గ్రామానికే పరిమితమైన ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.మరింత చదవండి

Source link