ఉద్యోగులు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తున్న వీడియోలను చూస్తే రైళ్ల నిర్వహణ, శిక్షణకు సంబంధించిన దాదాపు అన్ని విషయాలనూ బయటపెడుతున్నట్లు తెలుస్తోంది. యువ అసిస్టెంట్ లోకో పైలట్లు రైళ్లు నడుస్తున్న సమయంలోనే వీడియోలు తీస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. రైలు గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సిగ్నల్ మెయింటెయినర్లు కూడా రీల్స్ చేస్తున్నారు. వాకీటాకీల్లో మాట్లాడటం, రైల్వే ట్రాక్‌లపై నడవడం, లోకోమోటివ్‌ల ముందు నిలబడి ఫోజులివ్వడం, రైలు నడుస్తున్న సమయంలో సిబ్బందికి సూచనలు ఇవ్వడం వంటి దృశ్యాలను వీడియోల్లో చూపిస్తున్నారు. ఇంకొందరైతే లోకోమోటివ్‌లలో ఉండే వివిధ భాగాలు, వాటి పనితీరును కూడా వివరిస్తున్నారు. వాటిలోని వేర్వేరు కీలు, హ్యాండిల్స్, బ్రేకింగ్ సిస్టమ్స్, స్పీడోమీటర్ల గురించి వీడియోలు చేస్తున్నారు. ఇవన్నీ రైల్వే నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

