ప్రభన్యూస్

Rahul Gandhi: ఖాళీ కుర్చీలతో రాహుల్ గాంధీ ప్రసంగం.. ఇండియా కూటమి రాంలీలా సభ ‘సూపర్ ఫ్లాప్’ అంటూ బీజేపీ ఎద్దేవా! |


Last Updated:

ఢిల్లీ రాంలీలా మైదానంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్వహించిన నిరసన ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సభలో జనం లేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

News18
News18

ఢిల్లీలోని రాంలీలా మైదానం వేదికగా ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్వహించిన భారీ నిరసన సభపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను రద్దు చేయాలని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే 50 వేల మంది సామర్థ్యం ఉన్న మైదానాన్ని కూడా కాంగ్రెస్ నింపలేకపోయిందని బీజేపీ అధికారికంగా ఎక్స్‌లో విమర్శించింది. రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో జనం లేక కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయని బీజేపీ నేతలు తీవ్రంగా ఎద్దేవా చేశారు.

జనం మధ్యలోనే మైదానం నుంచి వెళ్లిపోతున్న వీడియోలను బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఈ సభను ఒక ‘సూపర్ ఫ్లాప్ షో’గా అభివర్ణించారు.

రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

బీజేపీ విమర్శలను తిప్పికొడుతూ తాము దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ పోరాటం చేస్తున్నామని రాహుల్ గాంధీ సభలో స్పష్టం చేశారు. ఎంతటి బలవంతులైనా రాజ్యాంగం కంటే ఎవరూ గొప్పవారు కాదని, దాన్ని నాశనం చేసే కుట్రలను సహించేది లేదని తేల్చిచెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవి నుంచి తప్పుకునే వరకు ఇండియా కూటమి పోరాటం ఆగదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.

ఈ సభలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు శనివారం ఇండియా కూటమి నేతలు ఎన్నికల కమిషనర్‌పై లాంఛనప్రాయంగా ‘ప్రజా అభిశంసన’ ప్రక్రియను చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ నిరసనలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ పండుగల సమయంలో ప్రతిపక్షాలు దేశంలో అరాచకం సృష్టించేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. 1984 నాటి సిక్కుల మారణకాండ జరిగిన రోజునే కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీని నిర్వహించడం సిగ్గుచేటని బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని, ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 November 2026, 7:20 pm Digital Edition : Prabhanews
Rahul Gandhi: ఖాళీ కుర్చీలతో రాహుల్ గాంధీ ప్రసంగం.. ఇండియా కూటమి రాంలీలా సభ ‘సూపర్ ఫ్లాప్’ అంటూ బీజేపీ ఎద్దేవా! |

Last Updated:Nov 01, 2026 7:15 PM ISTఢిల్లీ రాంలీలా మైదానంలో ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్వహించిన నిరసన ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సభలో జనం లేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చిన దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.News18ఢిల్లీలోని రాంలీలా మైదానం వేదికగా ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్వహించిన భారీ నిరసన సభపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను రద్దు చేయాలని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే 50 వేల మంది సామర్థ్యం ఉన్న మైదానాన్ని కూడా కాంగ్రెస్ నింపలేకపోయిందని బీజేపీ అధికారికంగా ఎక్స్‌లో విమర్శించింది. రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో జనం లేక కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయని బీజేపీ నేతలు తీవ్రంగా ఎద్దేవా చేశారు.జనం మధ్యలోనే మైదానం నుంచి వెళ్లిపోతున్న వీడియోలను బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఈ సభను ఒక ‘సూపర్ ఫ్లాప్ షో’గా అభివర్ణించారు.రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీబీజేపీ విమర్శలను తిప్పికొడుతూ తాము దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకే ఈ పోరాటం చేస్తున్నామని రాహుల్ గాంధీ సభలో స్పష్టం చేశారు. ఎంతటి బలవంతులైనా రాజ్యాంగం కంటే ఎవరూ గొప్పవారు కాదని, దాన్ని నాశనం చేసే కుట్రలను సహించేది లేదని తేల్చిచెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవి నుంచి తప్పుకునే వరకు ఇండియా కూటమి పోరాటం ఆగదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.
Rahul Gandhi is speaking and empty chairs.
Congress couldn't even fill full Ramlila Maidan of capacity 50,000.Super Flop rally. https://t.co/hzIRHyRYk9— BJP (@BJP4India) November 1, 2026ఈ సభలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు శనివారం ఇండియా కూటమి నేతలు ఎన్నికల కమిషనర్‌పై లాంఛనప్రాయంగా 'ప్రజా అభిశంసన' ప్రక్రియను చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.
Rahul Gandhi speaking and People leaving from Ramleela Ground!
Flop show! https://t.co/iXcqb0MFHt— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) November 1, 2026ఈ నిరసనలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ పండుగల సమయంలో ప్రతిపక్షాలు దేశంలో అరాచకం సృష్టించేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. 1984 నాటి సిక్కుల మారణకాండ జరిగిన రోజునే కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీని నిర్వహించడం సిగ్గుచేటని బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని, ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది.మరింత చదవండి

Source link