ప్రభన్యూస్

Amit Shah: ‘1984 ఊచకోతను దేశం మరవలేదు’.. రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్రస్థాయి విమర్శలు! |


Last Updated:

రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ నడుపుతున్న ప్రేమ దుకాణం నుంచి ప్రజలకు విద్వేషం మాత్రమే అందుతోందని తీవ్ర విమర్శలు గుప్పించారు.

News18
News18

ఢిల్లీలోని రాంలీలా మైదానం వేదికగా ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్వహించిన భారీ నిరసన ర్యాలీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఈ సభను ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రచార నినాదమైన ‘మొహబ్బత్ కీ దుకాన్’ (ప్రేమ దుకాణం)పై అమిత్ షా సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ నడుపుతున్న ఆ దుకాణం నుంచి ప్రజలకు కేవలం విద్వేషం మాత్రమే లభిస్తుందని ఎద్దేవా చేశారు.

గతంలో కాంగ్రెస్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

1984 సిక్కుల ఊచకోతను దేశం ఎప్పటికీ మరవదు: అమిత్ షా

ఈ సందర్భంగా 1984 నాటి సిక్కుల వ్యతిరేక అల్లర్లను అమిత్ షా ప్రస్తావించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత దేశంలో వేలాది మంది అమాయక సిక్కులను దారుణంగా ఊచకోత కోశారని ఆరోపించారు. ఆ దారుణానికి బాధ్యులైన వారిపై కాంగ్రెస్ పార్టీ ఏనాడూ చర్యలు తీసుకోలేదని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మూతపడిన పాత కేసులన్నింటినీ తిరిగి తెరిచి విచారణ వేగవంతం చేశామని చెప్పారు. అల్లర్లలో నష్టపోయిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామని గుర్తుచేశారు. ఈ కేసుల్లో ప్రధాన సూత్రధారులైన కాంగ్రెస్ కీలక నేతలను జైలు ఊచలు లెక్కించేలా చేశామని స్పష్టం చేశారు.

ఒక రాజకీయ పార్టీ స్వయంగా ప్రజలను రెచ్చగొట్టి చేయించిన అలాంటి భయానక అల్లర్లను దేశం గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితులు రానివ్వబోమని తేల్చిచెప్పారు. 1984 నాటి నెత్తుటి మారణకాండను యావత్ భారతదేశంతో పాటు పంజాబ్ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని అమిత్ షా పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 01 November 2026, 3:50 pm Digital Edition : Prabhanews
Amit Shah: ‘1984 ఊచకోతను దేశం మరవలేదు’.. రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్రస్థాయి విమర్శలు! |

Last Updated:Nov 01, 2026 3:38 PM ISTరాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ నడుపుతున్న ప్రేమ దుకాణం నుంచి ప్రజలకు విద్వేషం మాత్రమే అందుతోందని తీవ్ర విమర్శలు గుప్పించారు.News18ఢిల్లీలోని రాంలీలా మైదానం వేదికగా ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్వహించిన భారీ నిరసన ర్యాలీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఈ సభను ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రచార నినాదమైన ‘మొహబ్బత్ కీ దుకాన్’ (ప్రేమ దుకాణం)పై అమిత్ షా సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ నడుపుతున్న ఆ దుకాణం నుంచి ప్రజలకు కేవలం విద్వేషం మాత్రమే లభిస్తుందని ఎద్దేవా చేశారు.గతంలో కాంగ్రెస్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.1984 సిక్కుల ఊచకోతను దేశం ఎప్పటికీ మరవదు: అమిత్ షాఈ సందర్భంగా 1984 నాటి సిక్కుల వ్యతిరేక అల్లర్లను అమిత్ షా ప్రస్తావించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత దేశంలో వేలాది మంది అమాయక సిక్కులను దారుణంగా ఊచకోత కోశారని ఆరోపించారు. ఆ దారుణానికి బాధ్యులైన వారిపై కాంగ్రెస్ పార్టీ ఏనాడూ చర్యలు తీసుకోలేదని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మూతపడిన పాత కేసులన్నింటినీ తిరిగి తెరిచి విచారణ వేగవంతం చేశామని చెప్పారు. అల్లర్లలో నష్టపోయిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామని గుర్తుచేశారు. ఈ కేసుల్లో ప్రధాన సూత్రధారులైన కాంగ్రెస్ కీలక నేతలను జైలు ఊచలు లెక్కించేలా చేశామని స్పష్టం చేశారు.ఒక రాజకీయ పార్టీ స్వయంగా ప్రజలను రెచ్చగొట్టి చేయించిన అలాంటి భయానక అల్లర్లను దేశం గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితులు రానివ్వబోమని తేల్చిచెప్పారు. 1984 నాటి నెత్తుటి మారణకాండను యావత్ భారతదేశంతో పాటు పంజాబ్ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని అమిత్ షా పేర్కొన్నారు.మరింత చదవండి

Source link