ఇక గతంలో వీళ్ల కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది అనే బాక్సాఫీస్ మాటలు కాదు కానీ.. టాలీవుడ్లో వచ్చిన బెస్ట్ కమర్షియల్ కల్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం ఈ సినిమాను కమర్షియల్ బ్లాక్ బస్టర్ అని ఒక స్టాంప్ వేయలం. ఎందుకంటే గత పది, పదిహేనేళ్లలో ఈ సినిమా చూపించిన ఎమోషన్, డ్రామా, పీక్స్ పర్ఫార్మెన్సెస్, డీటేయిల్ మేకింగ్ ఏ సినిమాలో కూడా కనిపించలేదంటే అతిశయోక్తి కాదు.

