[title బ్రేకింగ్ న్యూస్:: కామారెడ్డి రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి]
బ్రేకింగ్ న్యూస్:: కామారెడ్డి రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి.
ప్రభ న్యూస్ కామారెడ్డి, జూలై 25
కామారెడ్డి రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో గుర్తుతెలియని ఓ పురుషుడు మృతిచెందిన స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న కామారెడ్డి బ్లూకోల్ట్స్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతుడి వివరాలు ఇప్పటివరకు గుర్తించలేకపోయినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికైనా మృతుడి గుర్తింపు లేదా సంబంధిత సమాచారం తెలిసి ఉంటే వెంటనే కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

