ప్రభన్యూస్

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఖాకీలు!

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఖాకీలు!

రాష్ట్రాల సరిహద్దులు దాటి నిందితుడి అరెస్ట్‌.. కామారెడ్డి పోలీసుల ప్రతిభకు సలాం!

రూ.25.45 లక్షల ఏటీఎం చోరీ కేసులో కీలక పురోగతి

కామారెడ్డి, అక్టోబర్ 26 (ప్రభ న్యూస్):

అంతర్రాష్ట్ర ఏటీఎం చోరీల కేసును ఛేదించడంలో కామారెడ్డి జిల్లా పోలీసులు కీలక పురోగతి సాధించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజస్థాన్‌లో నిందితుడిని అరెస్ట్‌ చేసి, ఏటీఎం చోరీల ముఠా కార్యకలాపాలపై దృష్టి సారించారు. గాంధారి గ్రామంలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో అక్టోబర్ 10, 11 తేదీల మధ్య జరిగిన చోరీలో రూ.25,45,900 నగదు అపహరణకు గురికావడంతో గాంధారి పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 220/2026 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తూ నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి నుంచి రూ.29,400 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, నల్లరంగు మహీంద్రా స్కార్పియో వాహనం, గ్యాస్ కట్టింగ్ నాజిల్‌, ఆక్సిజన్ సిలిండర్‌కు సంబంధించిన పరికరాలు, రెగ్యులేటర్లు, పైపులు, చెక్ మీటర్లు, సుత్తులు, రాడ్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. అలాగే వివిధ నంబర్ల గల సిమ్ కార్డులు, ఇతర పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

అంతర్రాష్ట్ర స్థాయిలో సాగిన ఈ దర్యాప్తులో నిందితుడిని గుర్తించి అరెస్ట్‌ చేయడంలో పోలీసులు చూపిన చాకచక్యం, సమన్వయం అభినందనీయం. ఈ కేసును ఛేదించడంలో ఎల్లారెడ్డి డీఎస్పీ, సంబంధిత సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేసినట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర వెల్లడించారు. జిల్లాలో ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరిగే చోరీలను అరికట్టేందుకు పోలీసులు నిఘా మరింత పటిష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 October 2026, 11:47 am Digital Edition : Prabhanews
<b><i>అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఖాకీలు</i></b>!