ప్రభన్యూస్

మహా దారుణం.. ఆన్‌లైన్ గేమ్ కోసం కత్తులతో పొడుచుకున్నారు! |


Last Updated:

మీ పిల్లలు ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నారా? ఈ ఘోరం గురించి తెలిస్తే వెంటనే ఫోన్ లాక్కుంటారు!

News18
News18

ఆన్‌లైన్ గేమ్స్ మోజు ప్రాణాల మీదకు తెస్తోంది. సరదా కోసం ఆడే ఆటలు చివరకు పచ్చని ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాపులర్ మొబైల్ గేమ్ ‘ఫ్రీ ఫైర్’ ఆడుతూ చెలరేగిన చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి ఏకంగా ఇద్దరు మైనర్ల దారుణ హత్యకు దారితీసింది. క్షణికావేశంలో జరిగిన ఈ జంట హత్యలతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నెత్తురోడుతున్న ఆ యువకుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సూరత్‌లో అజ్మల్, ఫైజాన్ అనే ఇద్దరు మైనర్లు ఈ ఘటనలో దారుణ హత్యకు గురయ్యారు. ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్న సమయంలో యువకుల మధ్య చిన్నపాటి వాదన మొదలైంది. ఆ తర్వాత అది కాస్తా తీవ్ర స్థాయికి చేరుకుని పెద్ద ఘర్షణకు దారితీసింది. అజ్మల్, ఫైజాన్‌లపై అత్యంత కిరాతకంగా కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఊహించని పరిణామంతో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు కుర్రాళ్లు ప్రాణాలు వదిలారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు కూడా మైనర్లేనని స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే హంతకుల వయసు, గుర్తింపుపై పోలీసుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక నిర్ధారణ రాలేదు.

ఇది కూడా చదవండి: Rice Prices: రేట్లు ఫిక్స్.. సామాన్యులకు పండగే.. బియ్యం వ్యాపారులకు ప్రభుత్వం బిగ్ షాక్, రూ.1 ఎక్కువకు అమ్మినా ఫసక్కే!

హత్యకు గురైన ఇద్దరు కుర్రాళ్లపై దాడి చేసింది ఎంతమంది, అసలు ఈ కిరాతకానికి దారితీసిన కచ్చితమైన కారణాలు ఏమిటన్నది పోలీసుల పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే వెలుగులోకి రానుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం ఫ్రీ ఫైర్ గేమ్ వల్లే ఈ ఘోరం జరిగిందని అంతా భావిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఈ కేసులో ప్రాథమికంగా ఆన్‌లైన్ గేమ్ కోణాన్ని కొట్టిపారేయడం గమనార్హం. దర్యాప్తు సంస్థలు వేరే కోణంలో కూడా లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: AP Weather Alert: బిగ్ అలెర్ట్.. తుపాను తీరం దాటేసింది.. కానీ వాతావరణ శాఖ సీరియస్ వార్నింగ్!

మృతుడు అజ్మల్ సోదరి ఫహిమా ఈ ఘటనపై గుండెలు పిండేసే నిజాలు బయటపెట్టింది. రాత్రి సమయంలో తన సోదరుడు అజ్మల్, అతని స్నేహితుడు ఫైజాన్ కలిసి ఉన్నారని ఆమె తెలిపింది. అదే సమయంలో వారికి తెలిసిన ఓ వ్యక్తి అక్కడికి వచ్చి వారిని బయటకు పిలిచాడు. ఆ వ్యక్తికి గతంలోనే కొంతమంది ఇతర యువకులతో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడే క్రమంలో గొడవలు జరిగాయి. ఆ పాత గొడవను సామరస్యంగా పరిష్కరించే ఉద్దేశంతో అజ్మల్, ఫైజాన్ మధ్యవర్తిత్వం వహించేందుకు వెళ్లారు. కానీ ఆ రాజీ ప్రయత్నమే వారి పాలిట శాపంగా మారి ప్రాణాలను బలిగొంది.

గొడవను సద్దుమణిగేలా చేద్దామని వెళ్లిన వారిపై ప్రత్యర్థులు ఏమాత్రం కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. హౌసింగ్ సొసైటీ బయట కాపుకాసిన ఆ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అజ్మల్, ఫైజాన్‌లపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దుండగులు వారిద్దరిపై పలుమార్లు కత్తులతో పొడిచి కిరాతకంగా హతమార్చారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెత్తుటి మడుగులో ప్రాణాలు వదిలిన ఆ ఇద్దరు యువకుల కుటుంబాల్లో ఇప్పుడు తీవ్ర విషాదం అలముకుంది. ఈ జంట హత్యల ఘటన తర్వాత ఆ ప్రాంతం అంతా తీవ్ర భయాందోళనలతో వణికిపోతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 November 2026, 12:41 pm Digital Edition : Prabhanews
మహా దారుణం.. ఆన్‌లైన్ గేమ్ కోసం కత్తులతో పొడుచుకున్నారు! |

Last Updated:Nov 03, 2026 12:37 PM ISTమీ పిల్లలు ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్నారా? ఈ ఘోరం గురించి తెలిస్తే వెంటనే ఫోన్ లాక్కుంటారు!News18ఆన్‌లైన్ గేమ్స్ మోజు ప్రాణాల మీదకు తెస్తోంది. సరదా కోసం ఆడే ఆటలు చివరకు పచ్చని ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాపులర్ మొబైల్ గేమ్ 'ఫ్రీ ఫైర్' ఆడుతూ చెలరేగిన చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి ఏకంగా ఇద్దరు మైనర్ల దారుణ హత్యకు దారితీసింది. క్షణికావేశంలో జరిగిన ఈ జంట హత్యలతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నెత్తురోడుతున్న ఆ యువకుల మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.సూరత్‌లో అజ్మల్, ఫైజాన్ అనే ఇద్దరు మైనర్లు ఈ ఘటనలో దారుణ హత్యకు గురయ్యారు. ఆన్‌లైన్ గేమ్ ఆడుతున్న సమయంలో యువకుల మధ్య చిన్నపాటి వాదన మొదలైంది. ఆ తర్వాత అది కాస్తా తీవ్ర స్థాయికి చేరుకుని పెద్ద ఘర్షణకు దారితీసింది. అజ్మల్, ఫైజాన్‌లపై అత్యంత కిరాతకంగా కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఊహించని పరిణామంతో తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు కుర్రాళ్లు ప్రాణాలు వదిలారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు కూడా మైనర్లేనని స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే హంతకుల వయసు, గుర్తింపుపై పోలీసుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక నిర్ధారణ రాలేదు.ఇది కూడా చదవండి: Rice Prices: రేట్లు ఫిక్స్.. సామాన్యులకు పండగే.. బియ్యం వ్యాపారులకు ప్రభుత్వం బిగ్ షాక్, రూ.1 ఎక్కువకు అమ్మినా ఫసక్కే!హత్యకు గురైన ఇద్దరు కుర్రాళ్లపై దాడి చేసింది ఎంతమంది, అసలు ఈ కిరాతకానికి దారితీసిన కచ్చితమైన కారణాలు ఏమిటన్నది పోలీసుల పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే వెలుగులోకి రానుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం ఫ్రీ ఫైర్ గేమ్ వల్లే ఈ ఘోరం జరిగిందని అంతా భావిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఈ కేసులో ప్రాథమికంగా ఆన్‌లైన్ గేమ్ కోణాన్ని కొట్టిపారేయడం గమనార్హం. దర్యాప్తు సంస్థలు వేరే కోణంలో కూడా లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: AP Weather Alert: బిగ్ అలెర్ట్.. తుపాను తీరం దాటేసింది.. కానీ వాతావరణ శాఖ సీరియస్ వార్నింగ్!మృతుడు అజ్మల్ సోదరి ఫహిమా ఈ ఘటనపై గుండెలు పిండేసే నిజాలు బయటపెట్టింది. రాత్రి సమయంలో తన సోదరుడు అజ్మల్, అతని స్నేహితుడు ఫైజాన్ కలిసి ఉన్నారని ఆమె తెలిపింది. అదే సమయంలో వారికి తెలిసిన ఓ వ్యక్తి అక్కడికి వచ్చి వారిని బయటకు పిలిచాడు. ఆ వ్యక్తికి గతంలోనే కొంతమంది ఇతర యువకులతో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడే క్రమంలో గొడవలు జరిగాయి. ఆ పాత గొడవను సామరస్యంగా పరిష్కరించే ఉద్దేశంతో అజ్మల్, ఫైజాన్ మధ్యవర్తిత్వం వహించేందుకు వెళ్లారు. కానీ ఆ రాజీ ప్రయత్నమే వారి పాలిట శాపంగా మారి ప్రాణాలను బలిగొంది.గొడవను సద్దుమణిగేలా చేద్దామని వెళ్లిన వారిపై ప్రత్యర్థులు ఏమాత్రం కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. హౌసింగ్ సొసైటీ బయట కాపుకాసిన ఆ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అజ్మల్, ఫైజాన్‌లపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దుండగులు వారిద్దరిపై పలుమార్లు కత్తులతో పొడిచి కిరాతకంగా హతమార్చారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెత్తుటి మడుగులో ప్రాణాలు వదిలిన ఆ ఇద్దరు యువకుల కుటుంబాల్లో ఇప్పుడు తీవ్ర విషాదం అలముకుంది. ఈ జంట హత్యల ఘటన తర్వాత ఆ ప్రాంతం అంతా తీవ్ర భయాందోళనలతో వణికిపోతోంది.మరింత చదవండి

Source link