2026 జూలై-సెప్టెంబర్ మధ్య బంగారం సగటు ధర ఔన్స్‌కు 4,262 డాలర్లుగా ఉంది. అంటే 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,48,891గా నమోదైంది. 2025లో ఇదే సమయంలో ఔన్స్ బంగారం ధర 3,457 డాలర్లు, 10 గ్రాముల ధర రూ.1,02,287గా ఉంది. ఈ ధరల్లో దిగుమతి సుంకం, జీఎస్టీ కలపలేదు. బంగారం నగల కొనుగోళ్లలోనూ తగ్గుదల కనిపించింది. 2025 జూలై-సెప్టెంబర్‌లో 125 టన్నులుగా ఉన్న నగల డిమాండ్, ఈ ఏడాది ఇదే కాలంలో 20 శాతం తగ్గి 99.9 టన్నులకు చేరింది. అయితే నగల కొనుగోళ్ల విలువ మాత్రం 16 శాతం పెరిగి రూ.1,48,700 కోట్లకు చేరుకుంది. భారత్‌లో డబ్ల్యూజీసీ రీజినల్ సీఈఓ సచిన్ జైన్ ఈ పరిస్థితిపై పీటీఐతో మాట్లాడారు. (ప్రతీకాత్మక చిత్రం)

