Last Updated:
8th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం కీలక దశకు చేరుకుంది. కమిషన్ ఏర్పాటై ఏడాది పూర్తవడంతో, సిఫార్సుల నివేదిక సమర్పించడానికి మరో ఆరు నెలల సమయం మాత్రమే మిగిలింది. దీంతో కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండొచ్చు? ప్రస్తుతం రూ.18,000గా ఉన్న కనీస బేసిక్ పే ఎంతకు పెరగవచ్చు? డీఏ, అలవెన్సులు, పెన్షన్లలో ఎలాంటి మార్పులు రావచ్చు? అనే అంశాలపై ఉద్యోగుల్లో ఆసక్తి పెరుగుతోంది. అయితే, కొత్త జీతాలపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు.
