ప్రభన్యూస్

తొర్రూరు కోడకండ్ల వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి రూ.3.35 కోట్ల నిధులు

పాలకుర్తి నియోజకవర్గ రైతులకు మరో శుభవార్త.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కృషితో

ప్రభ న్యూస్ తోర్రురు ఆగస్టు 3 ::

పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలోని రైతులకు ఆధునిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ మంత్రి, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులను పలు మార్లు కలిసి, మార్కెట్ యార్డుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులు మంజూరు చేయాలని గట్టిగా విజ్ఞప్తి చేయడంతో పాటు నిధుల కోసం నిరంతరం కృషి చేశారు.ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పట్టుదల, ప్రత్యేక చొరవ ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కోడకండ్ల మరియు తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీల అభివృద్ధి పనులకు మొత్తం రూ.3.35 కోట్ల పరిపాలనా అనుమతిని మంజూరు చేసింది.ఇందులో కోడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి రూ.2.43 కోట్లు మంజూరవగా, మార్కెట్ యార్డులో భారీ కవర్డ్ షెడ్ నిర్మాణం, టాయిలెట్ బ్లాక్ నిర్మాణం, ఆర్.ఓ. ప్లాంట్‌తో కూడిన గది నిర్మాణం, దేవరుప్పుల సబ్ మార్కెట్ యార్డులో నాబార్డ్ గోదాం చుట్టూ పాక్షిక ప్రహరీ గోడ నిర్మాణం వంటి కీలక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.అలాగే తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి రూ.92 లక్షలు మంజూరై, మార్కెట్ యార్డు ప్రధాన ద్వారం నుంచి గోదాం వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావడంలో మరింత సౌకర్యం కలగనుంది.ఈ నిధుల మంజూరుతో పాలకుర్తి నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్లు మరింత ఆధునికంగా రూపుదిద్దుకోనున్నాయని, రైతులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా కోడకండ్ల, తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు, రైతులు, హమాలీలు, వ్యాపారులు మరియు ప్రజాప్రతినిధులు పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ & మార్కెటింగ్ శాఖ మంత్రి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 August 2026, 8:31 am Digital Edition : Prabhanews
<b> తొర్రూరు కోడకండ్ల వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి రూ.3.35 కోట్ల నిధులు