ప్రభన్యూస్

Winter Skin Care Tips: చలికాలంలో చర్మం పొడిబారుతోందా?.. ఈ 5 స్కిన్ కేర్ తప్పులు అస్సలు చేయకండి! | లైఫ్ స్టైల్


Last Updated:

చేతులు, కాళ్లు, పెదవులపై కూడా పొడిబారడం కనిపిస్తుంది. కొందరిలో చర్మం సాగినట్లు అనిపించడం, పగుళ్లు ఏర్పడటం కూడా జరుగుతుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని ప్రత్యేకంగా సంరక్షించుకోవాలి. కొన్ని చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

News18
News18

దీపావళి పండుగ సమయం నుంచి చలికాలం మొదలవుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గడం, గాలిలో తేమ శాతం పడిపోవడం వల్ల చర్మంపై ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో చాలామందికి చర్మం పొడిబారడం, గరుకుగా మారడం, దురద, మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖంతో పాటు చేతులు, కాళ్లు, పెదవులపై కూడా పొడిబారడం కనిపిస్తుంది. కొందరిలో చర్మం సాగినట్లు అనిపించడం, పగుళ్లు ఏర్పడటం కూడా జరుగుతుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని ప్రత్యేకంగా సంరక్షించుకోవాలి. కొన్ని చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

చలికాలంలో చాలామంది చేసే మొదటి తప్పు సన్‌స్క్రీన్ ఉపయోగించకపోవడం. ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ సూర్యుడి నుంచి వచ్చే UV కిరణాలు చర్మంపై ప్రభావం చూపుతాయి. అందుకే బయటకు వెళ్లేటప్పుడు కనీసం SPF 30 ఉన్న బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ ఉపయోగించడం మంచిది. ముఖంతో పాటు మెడ, చేతులకు కూడా రాయాలి. ఎక్కువసేపు బయట ఉంటే ప్రతి రెండు గంటలకు ఒకసారి మళ్లీ అప్లై చేయాలి.

రెండో తప్పు మాయిశ్చరైజర్ ఉపయోగించకపోవడం. చలిగాలుల వల్ల చర్మంలోని సహజ తేమ తగ్గుతుంది. అందువల్ల స్నానం చేసిన వెంటనే చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాయాలి. పొడి చర్మం ఉన్నవారు క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్లను ఎంచుకోవచ్చు. మొటిమలు వచ్చే చర్మం ఉన్నవారు ఆయిల్ ఫ్రీ, నాన్ కామెడోజెనిక్ ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది.

మూడో తప్పు తగినంత నీరు తాగకపోవడం. చలికాలంలో దాహం తక్కువగా అనిపించినా శరీరానికి నీరు అవసరమే. రోజంతా తగినంత నీరు తాగడంతో పాటు సూప్‌లు, నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవచ్చు. అయితే నీరు తాగడం ఒక్కటే చర్మం పొడిబారకుండా చేయదు. బయట నుంచి మాయిశ్చరైజర్ ఉపయోగించడం కూడా అవసరం.

నాలుగో తప్పు చర్మానికి సరిపోని ఉత్పత్తులను ఉపయోగించడం. ఇతరులకు సరిపోయిన క్రీమ్ లేదా ఫేస్ వాష్ మన చర్మానికి కూడా సరిపోతుందని భావించకూడదు. కొత్త ఉత్పత్తులను ఉపయోగించే ముందు చిన్న భాగంలో పరీక్షించడం మంచిది. మంట, దురద, ఎర్రదనం వస్తే వాడటం ఆపాలి.

ఐదో తప్పు రాత్రిపూట మేకప్ తొలగించకుండా నిద్రపోవడం. ఇలా చేయడం వల్ల చర్మంపై మేకప్, దుమ్ము, చెమట పేరుకుపోవచ్చు. పడుకునే ముందు మేకప్‌ను పూర్తిగా తొలగించి, మృదువైన క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అవసరమైతే డబుల్ క్లెన్సింగ్ పద్ధతిని పాటించవచ్చు. అలాగే చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం, చర్మాన్ని గట్టిగా రుద్దడం కూడా తగ్గించాలి. చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటే లేదా తగ్గకపోతే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 November 2026, 5:03 pm Digital Edition : Prabhanews
Winter Skin Care Tips: చలికాలంలో చర్మం పొడిబారుతోందా?.. ఈ 5 స్కిన్ కేర్ తప్పులు అస్సలు చేయకండి! | లైఫ్ స్టైల్

Last Updated:Nov 13, 2026 5:00 PM ISTచేతులు, కాళ్లు, పెదవులపై కూడా పొడిబారడం కనిపిస్తుంది. కొందరిలో చర్మం సాగినట్లు అనిపించడం, పగుళ్లు ఏర్పడటం కూడా జరుగుతుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని ప్రత్యేకంగా సంరక్షించుకోవాలి. కొన్ని చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.News18దీపావళి పండుగ సమయం నుంచి చలికాలం మొదలవుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గడం, గాలిలో తేమ శాతం పడిపోవడం వల్ల చర్మంపై ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో చాలామందికి చర్మం పొడిబారడం, గరుకుగా మారడం, దురద, మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖంతో పాటు చేతులు, కాళ్లు, పెదవులపై కూడా పొడిబారడం కనిపిస్తుంది. కొందరిలో చర్మం సాగినట్లు అనిపించడం, పగుళ్లు ఏర్పడటం కూడా జరుగుతుంది. అందుకే చలికాలంలో చర్మాన్ని ప్రత్యేకంగా సంరక్షించుకోవాలి. కొన్ని చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.చలికాలంలో చాలామంది చేసే మొదటి తప్పు సన్‌స్క్రీన్ ఉపయోగించకపోవడం. ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ సూర్యుడి నుంచి వచ్చే UV కిరణాలు చర్మంపై ప్రభావం చూపుతాయి. అందుకే బయటకు వెళ్లేటప్పుడు కనీసం SPF 30 ఉన్న బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ ఉపయోగించడం మంచిది. ముఖంతో పాటు మెడ, చేతులకు కూడా రాయాలి. ఎక్కువసేపు బయట ఉంటే ప్రతి రెండు గంటలకు ఒకసారి మళ్లీ అప్లై చేయాలి.రెండో తప్పు మాయిశ్చరైజర్ ఉపయోగించకపోవడం. చలిగాలుల వల్ల చర్మంలోని సహజ తేమ తగ్గుతుంది. అందువల్ల స్నానం చేసిన వెంటనే చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాయాలి. పొడి చర్మం ఉన్నవారు క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్లను ఎంచుకోవచ్చు. మొటిమలు వచ్చే చర్మం ఉన్నవారు ఆయిల్ ఫ్రీ, నాన్ కామెడోజెనిక్ ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది.మూడో తప్పు తగినంత నీరు తాగకపోవడం. చలికాలంలో దాహం తక్కువగా అనిపించినా శరీరానికి నీరు అవసరమే. రోజంతా తగినంత నీరు తాగడంతో పాటు సూప్‌లు, నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవచ్చు. అయితే నీరు తాగడం ఒక్కటే చర్మం పొడిబారకుండా చేయదు. బయట నుంచి మాయిశ్చరైజర్ ఉపయోగించడం కూడా అవసరం.నాలుగో తప్పు చర్మానికి సరిపోని ఉత్పత్తులను ఉపయోగించడం. ఇతరులకు సరిపోయిన క్రీమ్ లేదా ఫేస్ వాష్ మన చర్మానికి కూడా సరిపోతుందని భావించకూడదు. కొత్త ఉత్పత్తులను ఉపయోగించే ముందు చిన్న భాగంలో పరీక్షించడం మంచిది. మంట, దురద, ఎర్రదనం వస్తే వాడటం ఆపాలి.ఐదో తప్పు రాత్రిపూట మేకప్ తొలగించకుండా నిద్రపోవడం. ఇలా చేయడం వల్ల చర్మంపై మేకప్, దుమ్ము, చెమట పేరుకుపోవచ్చు. పడుకునే ముందు మేకప్‌ను పూర్తిగా తొలగించి, మృదువైన క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అవసరమైతే డబుల్ క్లెన్సింగ్ పద్ధతిని పాటించవచ్చు. అలాగే చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం, చర్మాన్ని గట్టిగా రుద్దడం కూడా తగ్గించాలి. చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటే లేదా తగ్గకపోతే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.మరింత చదవండి

Source link