ప్రస్తుతం గ్రామీణ స్థాయిలో జరిగే VGPP ప్రణాళికల్లోనే ఈ కొత్త మార్పులను విలీనం చేయడం ద్వారా VB-G RAM G, JJM 2.0 మరియు SBM (G) 2.0 నిధులు సమిష్టిగా గ్రామీణ నీటి భద్రత, భూగర్భ జలాల పునరుజ్జీవనం, వాతావరణ స్థితిస్థాపకత, ప్రజల జీవనోపాధిని పెంపొందిస్తాయని అధికారులు తెలిపార. ఈ భారీ లక్ష్య సాధనకు గ్రామీణాభివృద్ధి, తాగునీరు-పారిశుధ్యం, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ శాఖాపరమైన సమిష్టి కృషి వల్ల తాగునీటి ఎద్దడి తొలగిపోవడమే కాకుండా గ్రామీణుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అందుకోసం జూన్ 18న జారీ చేసిన సలహాపత్రం ప్రకారం తీవ్ర నీటి కొరత ఉన్న బ్లాకుల్లో కనీసం 65%, పాక్షికంగా క్లిష్టమైన ప్రాంతాల్లో 40%, సురక్షిత ప్రాంతాల్లో కనీసం 30% VB-G RAM G నిధులను నీటి సంరక్షణ పనులకే వెచ్చించాలి. ఢిల్లీ, చండీగఢ్ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
