ప్రభన్యూస్

Karnataka: మద్యం మత్తు.. నిత్యం నరకం.. చెరువులో తేలిన 6 శవాలు! |


Last Updated:

Karnataka: నిత్యం గృహహింస, భార్యాభర్తల మధ్య చెలరేగిన మనస్పర్థలు ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే తన ఐదుగురు పేగుబంధాలను వెంటబెట్టుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఎదిగివస్తున్న పిల్లల భవిష్యత్తు కోసం కలలు కనాల్సిన సంసారంలో కుటుంబ కలహాలు శాపంగా మారి ఆరుగురి ప్రాణాలను బలిగొన్నాయి. విజయపుర పరిధిలో నివసిస్తున్న మల్లికార్జున భీమరాయ జాలగేరి, శోభ దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో దివ్య (16), సుభద్ర (14), తిప్పురాయ గణేశ్ (10), శానిజి (7), వికాస్ (5) ఉన్నారు. మల్లికార్జున వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, కుటుంబంలో తరచూ కలహాలు చెలరేగుతుండేవి. శ్రావణ సోమవారం సందర్భంగా ఇంట్లో నిర్వహించాల్సిన పూజా కార్యక్రమాల విషయంలో ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. మరోవైపు, మల్లికార్జున నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య శోభపై శారీరక దాడికి పాల్పడేవాడని, ఆ వేధింపులు తాళలేకనే ఆమె తీవ్ర మనోవేదనకు గురైందని శోభ తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 August 2026, 7:10 am Digital Edition : Prabhanews
Karnataka: మద్యం మత్తు.. నిత్యం నరకం.. చెరువులో తేలిన 6 శవాలు! |

Last Updated:Aug 27, 2026 7:03 AM ISTKarnataka: నిత్యం గృహహింస, భార్యాభర్తల మధ్య చెలరేగిన మనస్పర్థలు ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే తన ఐదుగురు పేగుబంధాలను వెంటబెట్టుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.ప్రతీకాత్మక చిత్రంఎదిగివస్తున్న పిల్లల భవిష్యత్తు కోసం కలలు కనాల్సిన సంసారంలో కుటుంబ కలహాలు శాపంగా మారి ఆరుగురి ప్రాణాలను బలిగొన్నాయి. విజయపుర పరిధిలో నివసిస్తున్న మల్లికార్జున భీమరాయ జాలగేరి, శోభ దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో దివ్య (16), సుభద్ర (14), తిప్పురాయ గణేశ్ (10), శానిజి (7), వికాస్ (5) ఉన్నారు. మల్లికార్జున వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, కుటుంబంలో తరచూ కలహాలు చెలరేగుతుండేవి. శ్రావణ సోమవారం సందర్భంగా ఇంట్లో నిర్వహించాల్సిన పూజా కార్యక్రమాల విషయంలో ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. మరోవైపు, మల్లికార్జున నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య శోభపై శారీరక దాడికి పాల్పడేవాడని, ఆ వేధింపులు తాళలేకనే ఆమె తీవ్ర మనోవేదనకు గురైందని శోభ తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.మరింత చదవండి

Source link