Last Updated:
Indian Railways: విద్యుత్ ఓవర్హెడ్ లైన్లపై ఆధారపడకుండా హైడ్రోజన్, ఆక్సిజన్ రసాయన చర్య ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటూ పరుగులు తీసే రైలు భారత్లో త్వరలో అందుబాటులోకి రానుంది. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ఇప్పటికే గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది.
భారతీయ రైల్వే రంగం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో విప్లవాత్మక మార్పుల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా హైడ్రోజన్ ఇంధన ఆధారంగా నడిచే రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ హైడ్రోజన్ రైలును గంటకు 110 కిలోమీటర్ల వాణిజ్య వేగంతో పరుగెత్తించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి గంటకు ఏకంగా 120 కిలోమీటర్ల వేగంతో అత్యంత విజయవంతంగా ట్రయల్ రన్స్ (పరీక్షలు) పూర్తయినట్లు రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓ సతీష్ కుమార్ ఆదివారం వెల్లడించారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ (PTI) ఈ వివరాలను ప్రత్యేకంగా నివేదించింది.

