ప్రభన్యూస్

Tanishq Robbery: షట్టర్ పగలగొట్టి.. గోడకు కన్నం వేసి రూ.50 కోట్ల నగలు దోచేశారు! |


Last Updated:

దీపావళి అమ్మకాల కోసం భారీగా నగలను సిద్ధం చేసిన తనిష్క్ షోరూమ్‌నే దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. తమిళనాడులోని మదురైలో కొత్తగా ప్రారంభమైన ఈ నగల దుకాణంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది.

News18
News18

నగల దుకాణాలు, వాణిజ్య సంస్థలను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా మదురైలోని ప్రముఖ తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో భారీ చోరీ జరగడం కలకలం రేపింది. దాదాపు రూ.50 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను దుండగులు అపహరించినట్లు సమాచారం. షోరూమ్‌ షట్టర్‌ తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. గోడకు సైతం కన్నం వేసి నగలను ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్‌ సంస్థకు తమిళనాడులోని మదురైలో ఇది కొత్త బ్రాంచ్‌. ఇటీవలే ప్రారంభమైన ఈ షోరూమ్‌లో ఇంత భారీ దోపిడీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీపావళి అమ్మకాలను దృష్టిలో పెట్టుకుని దుకాణంలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని గమనించిన దొంగలు ముందుగానే పథకం వేసుకుని చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

సుమారు 16 కిలోల నగలు అపహరణ

షోరూమ్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. దాదాపు 16 కిలోల బంగారంతో పాటు వజ్రాభరణాలు కూడా చోరీకి గురయ్యాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.50 కోట్లుగా అంచనా వేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో దుండగులు షోరూమ్‌లోకి చొరబడి ఈ దోపిడీకి పాల్పడినట్లు సమాచారం. షట్టర్‌ను బద్దలుకొట్టడంతో పాటు వెనుక వైపు నుంచి కూడా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆనవాళ్లు కనిపించాయి.

ఉదయం షోరూమ్‌కు వచ్చేసరికి..

11వ తేదీ ఉదయం షోరూమ్‌కు తిరిగి వచ్చిన నిర్వాహకులకు అక్కడి పరిస్థితి చూసి అనుమానం కలిగింది. వెనుక వైపు తలుపులు ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా భారీగా నగలు కనిపించకుండా పోయినట్లు తెలుసుకున్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కొత్త బ్రాంచ్‌లోనే భారీ దోపిడీ

ఈ షోరూమ్‌ను సుమారు 10 నుంచి 15 రోజుల క్రితమే ప్రారంభించినట్లు సమాచారం. స్టోర్ నిర్మాణ పనులు దాదాపు 70 శాతం పూర్తయిన దశలోనే ప్రారంభించినట్లు కూడా కథనాలు వెల్లడించాయి. ప్రారంభమైన కొద్ది రోజులకే ఇంత పెద్ద మొత్తంలో నగలు దోచుకెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. దొంగలు ఎంతమంది వచ్చారు? ముందుగా రెక్కీ నిర్వహించారా? చోరీ చేసిన నగలను ఎక్కడికి తరలించారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. తమిళనాడులో నగల దుకాణాలే లక్ష్యంగా జరుగుతున్న వరుస దొంగతనాల నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 3:59 pm Digital Edition : Prabhanews
Tanishq Robbery: షట్టర్ పగలగొట్టి.. గోడకు కన్నం వేసి రూ.50 కోట్ల నగలు దోచేశారు! |

Last Updated:Nov 12, 2026 3:52 PM ISTదీపావళి అమ్మకాల కోసం భారీగా నగలను సిద్ధం చేసిన తనిష్క్ షోరూమ్‌నే దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. తమిళనాడులోని మదురైలో కొత్తగా ప్రారంభమైన ఈ నగల దుకాణంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది.
News18నగల దుకాణాలు, వాణిజ్య సంస్థలను లక్ష్యంగా చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా మదురైలోని ప్రముఖ తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లో భారీ చోరీ జరగడం కలకలం రేపింది. దాదాపు రూ.50 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను దుండగులు అపహరించినట్లు సమాచారం. షోరూమ్‌ షట్టర్‌ తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. గోడకు సైతం కన్నం వేసి నగలను ఎత్తుకెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు.టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్‌ సంస్థకు తమిళనాడులోని మదురైలో ఇది కొత్త బ్రాంచ్‌. ఇటీవలే ప్రారంభమైన ఈ షోరూమ్‌లో ఇంత భారీ దోపిడీ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీపావళి అమ్మకాలను దృష్టిలో పెట్టుకుని దుకాణంలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని గమనించిన దొంగలు ముందుగానే పథకం వేసుకుని చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.సుమారు 16 కిలోల నగలు అపహరణషోరూమ్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. దాదాపు 16 కిలోల బంగారంతో పాటు వజ్రాభరణాలు కూడా చోరీకి గురయ్యాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.50 కోట్లుగా అంచనా వేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో దుండగులు షోరూమ్‌లోకి చొరబడి ఈ దోపిడీకి పాల్పడినట్లు సమాచారం. షట్టర్‌ను బద్దలుకొట్టడంతో పాటు వెనుక వైపు నుంచి కూడా లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఆనవాళ్లు కనిపించాయి.ఉదయం షోరూమ్‌కు వచ్చేసరికి..11వ తేదీ ఉదయం షోరూమ్‌కు తిరిగి వచ్చిన నిర్వాహకులకు అక్కడి పరిస్థితి చూసి అనుమానం కలిగింది. వెనుక వైపు తలుపులు ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా భారీగా నగలు కనిపించకుండా పోయినట్లు తెలుసుకున్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.కొత్త బ్రాంచ్‌లోనే భారీ దోపిడీఈ షోరూమ్‌ను సుమారు 10 నుంచి 15 రోజుల క్రితమే ప్రారంభించినట్లు సమాచారం. స్టోర్ నిర్మాణ పనులు దాదాపు 70 శాతం పూర్తయిన దశలోనే ప్రారంభించినట్లు కూడా కథనాలు వెల్లడించాయి. ప్రారంభమైన కొద్ది రోజులకే ఇంత పెద్ద మొత్తంలో నగలు దోచుకెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. దొంగలు ఎంతమంది వచ్చారు? ముందుగా రెక్కీ నిర్వహించారా? చోరీ చేసిన నగలను ఎక్కడికి తరలించారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. తమిళనాడులో నగల దుకాణాలే లక్ష్యంగా జరుగుతున్న వరుస దొంగతనాల నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.మరింత చదవండి

Source link