ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన కారు ప్రమాదంపై స్పందిస్తూ తాను సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఘటనలో కారు వెనుక భాగం దెబ్బతిన్నప్పటికీ, కారులో ఉన్న తమకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.
Source link
