ప్రభన్యూస్

Belonging: ఇందిరా గాంధీకి నీలం సంజీవరెడ్డి బద్ధ శత్రువు.. సోనియా బుక్‌లో బిగ్ సీక్రెట్స్! |


Last Updated:

Belonging: భారత రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన మలుపులు, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎదుర్కొన్న అంతర్గత, బహిర్గత రాజకీయ పోరాటాలపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.

Sonia Gandhi   (File pic/PTI)
Sonia Gandhi (File pic/PTI)

మంగళవారం విడుదలైన తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకంలో ఆమె నాటి రాజకీయ పరిణామాలను, ముఖ్యంగా మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, జయప్రకాశ్ నారాయణ్ (JP), అలాగే 1999 నాటి బళ్లారి ఎన్నికల విశేషాలను వివరంగా ప్రస్తావించారు.

ఇందిర వర్సెస్ సిండికేట్ – 1969 రాష్ట్రపతి ఎన్నికల పోరు

మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, ఇందిరా గాంధీకి బద్ధ శత్రువని సోనియా గాంధీ తన పుస్తకంలో స్పష్టం చేశారు. 1967 సాధారణ ఎన్నికల్లో గెలిచి రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలోని ‘సిండికేట్’ నేతలు (కామరాజ్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి, ఎస్‌కే పాటిల్, అతుల్య ఘోష్) ఇందిరపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆమె వివరించారు. వారి ఒత్తిడి కారణంగానే ఇందిరా గాంధీ అయిష్టంగానే మొరార్జీ దేశాయ్‌ని ఆర్థిక మంత్రిగా నియమించి, ఉప ప్రధానిగా ప్రకటించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

అనంతరం 1969లో జాకీర్ హుస్సేన్ మరణానంతరం జరిగిన రాష్ట్రపతి ఎన్నికలు ఈ విభేదాలను పతాక స్థాయికి చేర్చాయి. బెంగళూరు ఏఐసీసీ సమావేశంలో ఇందిర ఆర్థిక సంస్కరణలను ప్రకటించగా, దానికి ప్రతీకారంగా సిండికేట్ నేతలు నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారు. అంతేకాకుండా ఆయన గెలుపు కోసం స్వతంత్ర పార్టీ, జన సంఘ్ వంటి విపక్షాల మద్దతును కూడా సిండికేట్ కోరింది. దీంతో తిరగబడిన ఇందిరా గాంధీ.. మొరార్జీ దేశాయ్‌ని ఆర్థిక మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా, 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసి సంచలనం సృష్టించారు. అదే సమయంలో ఉప రాష్ట్రపతి వీవీ గిరిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దింపి, సభ్యులంతా ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని పిలుపునిచ్చి విజయం సాధించారని సోనియా గుర్తుచేసుకున్నారు.

1975 తీర్పుకు ముందే జేపీ సందేశంపై జలగం నిఘా

1975 నాటి ఎమర్జెన్సీకి దారితీసిన పరిణామాలను కూడా సోనియా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 12న ఇందిరా గాంధీపై అనర్హత వేటు వేస్తూ తీర్పునిచ్చింది. అయితే, ఈ తీర్పు వెలువడక ముందే ఇందిరకు వ్యతిరేకంగా తీర్పు రాబోతోందని, ఆరేళ్ల అనర్హత వేటు పడనుందని జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) పసిగట్టారని సోనియా పేర్కొన్నారు. ఇందిరపై దాడి చేయడానికి ఇదే సరైన సమయమని, తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ జేపీ అప్పట్లో నీలం సంజీవరెడ్డికి రహస్య సందేశం పంపారని, ఈ విషయం నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నిఘా వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చిందని ఆమె వెల్లడించారు.

‘పిల్లి-ఎలుక పోట్లాటలా’ 1999 బళ్లారి ఎన్నిక

1999లో తాను తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన నాటి అనుభవాలను వివరిస్తూ, బళ్లారి ఎన్నికను సోనియా ‘పిల్లి-ఎలుక పోట్లాట’గా అభివర్ణించారు. రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేఠీతో పాటు, దక్షిణాది నుంచి కూడా పోటీ చేయాలని సీనియర్ నేతలు ఒత్తిడి తెచ్చారని తెలిపారు. తాను పార్లమెంటులోకి అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు అమేఠీ ఎన్నికను రద్దు చేయించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్న ప్రచారంతో తాను బళ్లారి నుంచి కూడా పోటీ చేసేందుకు అంగీకరించానని చెప్పారు.

తనను దేశవ్యాప్తంగా ప్రచారం చేయకుండా కట్టడి చేసేందుకు ఆర్ఎస్ఎస్-బీజేపీలు సుష్మా స్వరాజ్‌ను బరిలోకి దించాయని సోనియా పేర్కొన్నారు. అప్పట్లో వస్త్ర తయారీ కేంద్రంగా ఉన్న బళ్లారిని తదనంతర కాలంలో గాలి జనార్దనరెడ్డి సోదరులు ఇనుప ఖనిజం స్మగ్లింగ్ కేంద్రంగా మార్చారని ఆమె విమర్శించారు. ఆ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ కన్నడలో ప్రసంగిస్తూ.. దానిని ‘సొంత కుమార్తె వర్సెస్ విదేశీ కోడలు’ పోరాటంగా చిత్రీకరించారని, అయినప్పటికీ అక్కడ తాను సాధించిన విజయం తనకే ఆశ్చర్యం కలిగించిందని సోనియా గాంధీ వివరించారు. అనంతరం నిబంధనల ప్రకారం తాను అమేఠీ స్థానాన్నే అట్టిపెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 10:36 am Digital Edition : Prabhanews
Belonging: ఇందిరా గాంధీకి నీలం సంజీవరెడ్డి బద్ధ శత్రువు.. సోనియా బుక్‌లో బిగ్ సీక్రెట్స్! |

Last Updated:Nov 12, 2026 10:29 AM ISTBelonging: భారత రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన మలుపులు, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎదుర్కొన్న అంతర్గత, బహిర్గత రాజకీయ పోరాటాలపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.Sonia Gandhi (File pic/PTI)మంగళవారం విడుదలైన తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకంలో ఆమె నాటి రాజకీయ పరిణామాలను, ముఖ్యంగా మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, జయప్రకాశ్ నారాయణ్ (JP), అలాగే 1999 నాటి బళ్లారి ఎన్నికల విశేషాలను వివరంగా ప్రస్తావించారు.ఇందిర వర్సెస్ సిండికేట్ – 1969 రాష్ట్రపతి ఎన్నికల పోరుమాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, ఇందిరా గాంధీకి బద్ధ శత్రువని సోనియా గాంధీ తన పుస్తకంలో స్పష్టం చేశారు. 1967 సాధారణ ఎన్నికల్లో గెలిచి రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలోని ‘సిండికేట్’ నేతలు (కామరాజ్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి, ఎస్‌కే పాటిల్, అతుల్య ఘోష్) ఇందిరపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆమె వివరించారు. వారి ఒత్తిడి కారణంగానే ఇందిరా గాంధీ అయిష్టంగానే మొరార్జీ దేశాయ్‌ని ఆర్థిక మంత్రిగా నియమించి, ఉప ప్రధానిగా ప్రకటించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.అనంతరం 1969లో జాకీర్ హుస్సేన్ మరణానంతరం జరిగిన రాష్ట్రపతి ఎన్నికలు ఈ విభేదాలను పతాక స్థాయికి చేర్చాయి. బెంగళూరు ఏఐసీసీ సమావేశంలో ఇందిర ఆర్థిక సంస్కరణలను ప్రకటించగా, దానికి ప్రతీకారంగా సిండికేట్ నేతలు నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారు. అంతేకాకుండా ఆయన గెలుపు కోసం స్వతంత్ర పార్టీ, జన సంఘ్ వంటి విపక్షాల మద్దతును కూడా సిండికేట్ కోరింది. దీంతో తిరగబడిన ఇందిరా గాంధీ.. మొరార్జీ దేశాయ్‌ని ఆర్థిక మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా, 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసి సంచలనం సృష్టించారు. అదే సమయంలో ఉప రాష్ట్రపతి వీవీ గిరిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దింపి, సభ్యులంతా ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని పిలుపునిచ్చి విజయం సాధించారని సోనియా గుర్తుచేసుకున్నారు.1975 తీర్పుకు ముందే జేపీ సందేశంపై జలగం నిఘా1975 నాటి ఎమర్జెన్సీకి దారితీసిన పరిణామాలను కూడా సోనియా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ అలహాబాద్ హైకోర్టు 1975 జూన్ 12న ఇందిరా గాంధీపై అనర్హత వేటు వేస్తూ తీర్పునిచ్చింది. అయితే, ఈ తీర్పు వెలువడక ముందే ఇందిరకు వ్యతిరేకంగా తీర్పు రాబోతోందని, ఆరేళ్ల అనర్హత వేటు పడనుందని జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) పసిగట్టారని సోనియా పేర్కొన్నారు. ఇందిరపై దాడి చేయడానికి ఇదే సరైన సమయమని, తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ జేపీ అప్పట్లో నీలం సంజీవరెడ్డికి రహస్య సందేశం పంపారని, ఈ విషయం నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నిఘా వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చిందని ఆమె వెల్లడించారు.‘పిల్లి-ఎలుక పోట్లాటలా’ 1999 బళ్లారి ఎన్నిక1999లో తాను తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన నాటి అనుభవాలను వివరిస్తూ, బళ్లారి ఎన్నికను సోనియా ‘పిల్లి-ఎలుక పోట్లాట’గా అభివర్ణించారు. రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేఠీతో పాటు, దక్షిణాది నుంచి కూడా పోటీ చేయాలని సీనియర్ నేతలు ఒత్తిడి తెచ్చారని తెలిపారు. తాను పార్లమెంటులోకి అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు అమేఠీ ఎన్నికను రద్దు చేయించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్న ప్రచారంతో తాను బళ్లారి నుంచి కూడా పోటీ చేసేందుకు అంగీకరించానని చెప్పారు.తనను దేశవ్యాప్తంగా ప్రచారం చేయకుండా కట్టడి చేసేందుకు ఆర్ఎస్ఎస్-బీజేపీలు సుష్మా స్వరాజ్‌ను బరిలోకి దించాయని సోనియా పేర్కొన్నారు. అప్పట్లో వస్త్ర తయారీ కేంద్రంగా ఉన్న బళ్లారిని తదనంతర కాలంలో గాలి జనార్దనరెడ్డి సోదరులు ఇనుప ఖనిజం స్మగ్లింగ్ కేంద్రంగా మార్చారని ఆమె విమర్శించారు. ఆ ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ కన్నడలో ప్రసంగిస్తూ.. దానిని ‘సొంత కుమార్తె వర్సెస్ విదేశీ కోడలు’ పోరాటంగా చిత్రీకరించారని, అయినప్పటికీ అక్కడ తాను సాధించిన విజయం తనకే ఆశ్చర్యం కలిగించిందని సోనియా గాంధీ వివరించారు. అనంతరం నిబంధనల ప్రకారం తాను అమేఠీ స్థానాన్నే అట్టిపెట్టుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.మరింత చదవండి

Source link