రైతు చెల్లించాల్సిన మొత్తాన్ని అందుబాటులో ఉంటే బ్యాంకు రుణం ద్వారా కూడా సమకూర్చుకోవచ్చు. దీనికి బ్యాంకు రుణ నిబంధనలు, పథకానికి సంబంధించిన షరతులు వర్తిస్తాయి. రైతు చివరికి చెల్లించాల్సిన మొత్తం పంపు మొత్తం ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ, అందుబాటులో ఉన్న రుణ సదుపాయం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో కేంద్ర ఆర్థిక సహాయం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బెంచ్‌మార్క్ ఖర్చు లేదా టెండర్ ఖర్చు.. ఈ రెండింటిలో తక్కువ మొత్తంపై 50 శాతం సీఎఫ్‌ఏ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 30 శాతం సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు చెల్లించాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను సిస్టమ్ ఖర్చులోనే సర్దుబాటు చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)

