ప్రభన్యూస్

Romanchakam Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రోమాంచకం’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘రోమాంచకం’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

News18
News18

యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘రోమాంచకం’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన ఈ సినిమాకు నూతన దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. సుమంత్ ప్రభాస్, అనంతిక అనిల్‌కుమార్ జంటగా నటించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది.

‘రోమాంచకం’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను అక్టోబర్ 1, 2026 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ మూవీని చూసే అవకాశం దక్కనుంది. సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు రిలీజ్ డేట్‌తో స్పష్టత వచ్చింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే రొమాంటిక్, కామెడీ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ తర్వాత ఎలాంటి స్పందనను అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

‘రోమాంచకం’ ఓటీటీ రిలీజ్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. దీంతో తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ఆడియన్స్‌కు కూడా ఈ సినిమాను చూసే అవకాశం లభించనుంది. సాధారణంగా థియేటర్లలో ప్రాంతీయ సినిమాలకు పరిమితమైన రీచ్.. ఓటీటీ ద్వారా ఒక్కసారిగా విస్తరించే అవకాశం ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌కు ఉన్న విస్తృత ప్రేక్షకాదరణ కారణంగా ‘రోమాంచకం’కు కూడా ఇప్పుడు కొత్త ఆడియన్స్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా గురించి ఇప్పటివరకు తెలియని ప్రేక్షకులు ఓటీటీ ద్వారా దీనిని చూసే అవకాశముంది.

‘రోమాంచకం’ థియేటర్లలో విడుదలైన సమయంలో యూత్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. థియేటర్లలో సినిమా మిస్ అయినవారికి ఇప్పుడు ఓటీటీ రిలీజ్ మరో అవకాశం కల్పిస్తోంది. ఓటీటీలో సినిమా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల స్పందనలో మార్పు వస్తుందా? సోషల్ మీడియాలో సినిమాకు మరింత చర్చ లభిస్తుందా? అనేది చూడాలి. కొన్ని సినిమాలకు థియేటర్ల కంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మంచి ఆదరణ లభించిన సందర్భాలు ఉన్నాయి. మరి ‘రోమాంచకం’ విషయంలోనూ అదే జరుగుతుందా అనేది అక్టోబర్ 1 తర్వాతే స్పష్టమవుతుంది.

ఈ సినిమాకు వైభవ్ సంగీతం అందించారు. యూత్‌ఫుల్ రొమాన్స్, కామెడీ, డ్రామా అంశాలను కలిపి దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. సుమంత్ ప్రభాస్, అనంతిక అనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. దీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన ‘రోమాంచకం’ ఇప్పుడు థియేట్రికల్ జర్నీని పూర్తి చేసుకుని డిజిటల్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 September 2026, 3:12 pm Digital Edition : Prabhanews
Romanchakam Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రోమాంచకం’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 28, 2026 3:05 PM ISTయూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘రోమాంచకం’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. News18యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘రోమాంచకం’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన ఈ సినిమాకు నూతన దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. సుమంత్ ప్రభాస్, అనంతిక అనిల్‌కుమార్ జంటగా నటించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది.‘రోమాంచకం’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను అక్టోబర్ 1, 2026 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ మూవీని చూసే అవకాశం దక్కనుంది. సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు రిలీజ్ డేట్‌తో స్పష్టత వచ్చింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే రొమాంటిక్, కామెడీ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ తర్వాత ఎలాంటి స్పందనను అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.‘రోమాంచకం’ ఓటీటీ రిలీజ్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. దీంతో తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ఆడియన్స్‌కు కూడా ఈ సినిమాను చూసే అవకాశం లభించనుంది. సాధారణంగా థియేటర్లలో ప్రాంతీయ సినిమాలకు పరిమితమైన రీచ్.. ఓటీటీ ద్వారా ఒక్కసారిగా విస్తరించే అవకాశం ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌కు ఉన్న విస్తృత ప్రేక్షకాదరణ కారణంగా ‘రోమాంచకం’కు కూడా ఇప్పుడు కొత్త ఆడియన్స్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా గురించి ఇప్పటివరకు తెలియని ప్రేక్షకులు ఓటీటీ ద్వారా దీనిని చూసే అవకాశముంది.‘రోమాంచకం’ థియేటర్లలో విడుదలైన సమయంలో యూత్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. థియేటర్లలో సినిమా మిస్ అయినవారికి ఇప్పుడు ఓటీటీ రిలీజ్ మరో అవకాశం కల్పిస్తోంది. ఓటీటీలో సినిమా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల స్పందనలో మార్పు వస్తుందా? సోషల్ మీడియాలో సినిమాకు మరింత చర్చ లభిస్తుందా? అనేది చూడాలి. కొన్ని సినిమాలకు థియేటర్ల కంటే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మంచి ఆదరణ లభించిన సందర్భాలు ఉన్నాయి. మరి ‘రోమాంచకం’ విషయంలోనూ అదే జరుగుతుందా అనేది అక్టోబర్ 1 తర్వాతే స్పష్టమవుతుంది.ఈ సినిమాకు వైభవ్ సంగీతం అందించారు. యూత్‌ఫుల్ రొమాన్స్, కామెడీ, డ్రామా అంశాలను కలిపి దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. సుమంత్ ప్రభాస్, అనంతిక అనిల్‌కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. దీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన ‘రోమాంచకం’ ఇప్పుడు థియేట్రికల్ జర్నీని పూర్తి చేసుకుని డిజిటల్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.మరింత చదవండి

Source link