మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవితేజ సినిమాపై, చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా చాలా రూటెడ్గా, రస్టిక్గా ఉందని, గ్రామీణ వాతావరణం నేపధ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మాధవ్ లుక్, ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగున్నాయని కొనియాడారు.
Source link
