2. పుట్టుమచ్చల్లో ఆకస్మిక మార్పులు… చర్మ క్యాన్సర్‌కు సంబంధించిన స్టేజ్ 0 దశ చర్మం పైపొర అయిన ఎపిడెర్మిస్‌లోనే ఉంటుంది. శరీరంలోని పుట్టుమచ్చల అంచులు అసమానంగా మారడం, రంగులో తేడాలు రావడం (నలుపు, ఎరుపు, గోధుమ రంగుల కలయిక), పరిమాణం పెరగడం లేదా చర్మంపై ఏర్పడిన పొలుసుల దద్దుర్లు ఎన్ని రోజులైనా మానకపోవడం ప్రధాన హెచ్చరిక.
