ప్రభన్యూస్

Price Hike: టీవీ, ఫ్రిజ్, ఏసీ కొనేవారికి అలర్ట్.. పండుగ వేళ ధరలు పెంచుతున్న కంపెనీలు | బిజినెస్


Last Updated:

దసరా, దీపావళి పండుగలకు ముందు టీవీ, ఫ్రిజ్, ఏసీ లేదా వాషింగ్ మెషీన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ బడ్జెట్‌పై ప్రభావం చూపే కీలక మార్పు రాబోతోంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ధరలు పెంచగా, మరికొన్ని కంపెనీలు కూడా పెంపునకు సిద్ధమవుతున్నాయి.

News18
News18

Electronics Price Hike: దసరా, దీపావళి పండుగల సందర్భంగా టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ వంటి గృహోపకరణాలు కొనాలనుకునే వారికి ఖర్చు పెరగనుంది. ఇప్పటికే పలు ఎలక్ట్రానిక్స్ సంస్థలు ధరలను పెంచగా, మరికొన్ని కంపెనీలు కూడా త్వరలో ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తం మీద కొన్ని ఉత్పత్తుల ధరలు 5 నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ముడిసరుకు, రవాణా ఖర్చులు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా కంపెనీలు చెబుతున్నాయి.

ముడిసరుకు ధరలే ప్రధాన కారణం

తయారీలో ఉపయోగించే రాగి, అల్యూమినియం, స్టీల్, ప్లాస్టిక్, ముడిచమురుతో సంబంధం ఉన్న పదార్థాల ధరలు గణనీయంగా పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రాగి ధర గతేడాది టన్నుకు 8,000-9,000 డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం సుమారు 14,500 డాలర్లకు చేరింది. ఒక ఏసీలో సగటున 3 నుంచి 4 కిలోల రాగి ఉపయోగిస్తారు. దీంతో ఏసీల తయారీ వ్యయం నేరుగా పెరిగింది. దీనికి తోడు డాలర్‌తో రూపాయి మారకం విలువలో మార్పులు, రవాణా ఖర్చుల పెరుగుదల సంస్థల లాభాలపై ఒత్తిడి పెంచుతున్నాయి.

ఏసీ 8 శాతం.. టీవీ 4 శాతం పెంపు

ఏసీల ధరలు సుమారు 5 నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉండగా, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, ఎల్‌ఈడీ టీవీల ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని కంపెనీలు ఇంకా పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. ధరలు పెంచితే పండుగల సమయంలో డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి. మరోవైపు పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకు డీలర్లు, పంపిణీదారుల వద్ద ఉండటంతో తక్షణ ప్రభావం పరిమితంగా ఉంటుందని మరికొన్ని కంపెనీలు అంటున్నాయి.

ఇప్పటికే ధరలు పెంచిన సంస్థలు

బ్లూ స్టార్, గోద్రేజ్ అప్లయెన్సెస్, హయ్యర్, డైకిన్, సూపర్ ప్లాస్ట్రానిక్స్ సహా పలు సంస్థలు ధరలను పెంచాయి. ఎల్‌జీ, హిటాచీ బ్రాండ్ ఏసీలను విక్రయించే బోష్ హోమ్ కంఫర్ట్ సంస్థలు కూడా ఏసీల ధరలను సుమారు 5 శాతం పెంచాయి. పానాసోనిక్ మాత్రం ఇంకా పరిస్థితిని అంచనా వేస్తోంది. బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి. త్యాగరాజన్ ప్రకారం, ఏసీ, డీప్ ఫ్రీజర్ ధరలను ఇప్పటికే 5-8 శాతం పెంచారు. ఈ ఏడాది ఇప్పటివరకు సంస్థ మూడుసార్లు ధరలు పెంచింది.

గోద్రేజ్, హయ్యర్, డైకిన్ నిర్ణయాలు

గోద్రేజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది మాట్లాడుతూ ముడిసరుకు వ్యయం 8-10 శాతం పెరిగిందని, దీంతో వివిధ ఉత్పత్తులపై 5-7 శాతం పెంపు తప్పనిసరైందన్నారు. పాత ధరల సరుకు మరో 1-1.5 నెలలు మార్కెట్లో ఉండొచ్చని తెలిపారు. హయ్యర్ ఇండియా అధ్యక్షుడు ఎన్.ఎస్. సతీష్ ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఏసీ ధరలు 5 శాతం, ఎల్‌ఈడీ టీవీ, వాషింగ్ మెషీన్ ధరలు 2-3 శాతం పెరగనున్నాయి. ముడిసరుకు ఖర్చులు కొనసాగితే డిసెంబర్, జనవరిలోనూ పెంపు ఉండొచ్చన్నారు.

పండుగ కొనుగోళ్లపై ప్రభావం

డైకిన్ ఎయిర్‌కండిషనింగ్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కన్వల్‌జీత్ జావా ప్రకారం సెప్టెంబర్ 16 నుంచే ధరలు 8-10 శాతం పెరిగాయి. రాగి ధర 25-35 శాతం పెరగడం, డాలర్ బలపడటం ఖర్చుల భారాన్ని పెంచాయని తెలిపారు. ఎస్‌పీపీఎల్ అక్టోబర్ తర్వాత టీవీల ధరలను సుమారు 7 శాతం పెంచాలని భావిస్తోంది. ఇతర గృహోపకరణాల ధరలు ఇప్పటికే 4-5 శాతం పెరిగాయి. సాధారణంగా నవరాత్రి నుంచి దీపావళి వరకు విక్రయాలు పెరిగే సమయంలో ధరల పెంపు కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 September 2026, 8:22 pm Digital Edition : Prabhanews
Price Hike: టీవీ, ఫ్రిజ్, ఏసీ కొనేవారికి అలర్ట్.. పండుగ వేళ ధరలు పెంచుతున్న కంపెనీలు | బిజినెస్

Last Updated:Sep 28, 2026 8:13 PM ISTదసరా, దీపావళి పండుగలకు ముందు టీవీ, ఫ్రిజ్, ఏసీ లేదా వాషింగ్ మెషీన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ బడ్జెట్‌పై ప్రభావం చూపే కీలక మార్పు రాబోతోంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ధరలు పెంచగా, మరికొన్ని కంపెనీలు కూడా పెంపునకు సిద్ధమవుతున్నాయి.
News18Electronics Price Hike: దసరా, దీపావళి పండుగల సందర్భంగా టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ వంటి గృహోపకరణాలు కొనాలనుకునే వారికి ఖర్చు పెరగనుంది. ఇప్పటికే పలు ఎలక్ట్రానిక్స్ సంస్థలు ధరలను పెంచగా, మరికొన్ని కంపెనీలు కూడా త్వరలో ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తం మీద కొన్ని ఉత్పత్తుల ధరలు 5 నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ముడిసరుకు, రవాణా ఖర్చులు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా కంపెనీలు చెబుతున్నాయి.ముడిసరుకు ధరలే ప్రధాన కారణంతయారీలో ఉపయోగించే రాగి, అల్యూమినియం, స్టీల్, ప్లాస్టిక్, ముడిచమురుతో సంబంధం ఉన్న పదార్థాల ధరలు గణనీయంగా పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రాగి ధర గతేడాది టన్నుకు 8,000-9,000 డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం సుమారు 14,500 డాలర్లకు చేరింది. ఒక ఏసీలో సగటున 3 నుంచి 4 కిలోల రాగి ఉపయోగిస్తారు. దీంతో ఏసీల తయారీ వ్యయం నేరుగా పెరిగింది. దీనికి తోడు డాలర్‌తో రూపాయి మారకం విలువలో మార్పులు, రవాణా ఖర్చుల పెరుగుదల సంస్థల లాభాలపై ఒత్తిడి పెంచుతున్నాయి.ఏసీ 8 శాతం.. టీవీ 4 శాతం పెంపుఏసీల ధరలు సుమారు 5 నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉండగా, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, ఎల్‌ఈడీ టీవీల ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొన్ని కంపెనీలు ఇంకా పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. ధరలు పెంచితే పండుగల సమయంలో డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి. మరోవైపు పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకు డీలర్లు, పంపిణీదారుల వద్ద ఉండటంతో తక్షణ ప్రభావం పరిమితంగా ఉంటుందని మరికొన్ని కంపెనీలు అంటున్నాయి.ఇప్పటికే ధరలు పెంచిన సంస్థలుబ్లూ స్టార్, గోద్రేజ్ అప్లయెన్సెస్, హయ్యర్, డైకిన్, సూపర్ ప్లాస్ట్రానిక్స్ సహా పలు సంస్థలు ధరలను పెంచాయి. ఎల్‌జీ, హిటాచీ బ్రాండ్ ఏసీలను విక్రయించే బోష్ హోమ్ కంఫర్ట్ సంస్థలు కూడా ఏసీల ధరలను సుమారు 5 శాతం పెంచాయి. పానాసోనిక్ మాత్రం ఇంకా పరిస్థితిని అంచనా వేస్తోంది. బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి. త్యాగరాజన్ ప్రకారం, ఏసీ, డీప్ ఫ్రీజర్ ధరలను ఇప్పటికే 5-8 శాతం పెంచారు. ఈ ఏడాది ఇప్పటివరకు సంస్థ మూడుసార్లు ధరలు పెంచింది.గోద్రేజ్, హయ్యర్, డైకిన్ నిర్ణయాలుగోద్రేజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది మాట్లాడుతూ ముడిసరుకు వ్యయం 8-10 శాతం పెరిగిందని, దీంతో వివిధ ఉత్పత్తులపై 5-7 శాతం పెంపు తప్పనిసరైందన్నారు. పాత ధరల సరుకు మరో 1-1.5 నెలలు మార్కెట్లో ఉండొచ్చని తెలిపారు. హయ్యర్ ఇండియా అధ్యక్షుడు ఎన్.ఎస్. సతీష్ ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఏసీ ధరలు 5 శాతం, ఎల్‌ఈడీ టీవీ, వాషింగ్ మెషీన్ ధరలు 2-3 శాతం పెరగనున్నాయి. ముడిసరుకు ఖర్చులు కొనసాగితే డిసెంబర్, జనవరిలోనూ పెంపు ఉండొచ్చన్నారు.పండుగ కొనుగోళ్లపై ప్రభావండైకిన్ ఎయిర్‌కండిషనింగ్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కన్వల్‌జీత్ జావా ప్రకారం సెప్టెంబర్ 16 నుంచే ధరలు 8-10 శాతం పెరిగాయి. రాగి ధర 25-35 శాతం పెరగడం, డాలర్ బలపడటం ఖర్చుల భారాన్ని పెంచాయని తెలిపారు. ఎస్‌పీపీఎల్ అక్టోబర్ తర్వాత టీవీల ధరలను సుమారు 7 శాతం పెంచాలని భావిస్తోంది. ఇతర గృహోపకరణాల ధరలు ఇప్పటికే 4-5 శాతం పెరిగాయి. సాధారణంగా నవరాత్రి నుంచి దీపావళి వరకు విక్రయాలు పెరిగే సమయంలో ధరల పెంపు కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.మరింత చదవండి

Source link