పాకిస్థాన్తో అమెరికా దౌత్య సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఏమిటి? అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ వద్ద ఉన్న అణ్వాయుధాలు, ఆ దేశ భౌగోళిక వ్యూహాత్మక స్థానం వంటి అంశాలు వాషింగ్టన్ విదేశాంగ విధానంలో ప్రాధాన్యం కలిగి ఉన్నాయని వివరించారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే చర్యలను అమెరికా వ్యతిరేకిస్తుందని రూబియో స్పష్టం చేశారు. అయితే, విభేదాలు ఉన్న దేశాలతోనూ దౌత్య సంబంధాలను కొనసాగించడం ద్వారా తమ ఆందోళనలను తెలియజేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
Source link
