ఒకవేళ ఉద్యోగం కోల్పోయిన పరిస్థితిలో వెంటనే 75 శాతం వరకు ఈపీఎఫ్ డబ్బు తీసుకోవచ్చు. ఇందులో ఉద్యోగి, యజమాని వాటా, వడ్డీ కూడా ఉంటుంది. మిగిలిన 25 శాతం ఒక సంవత్సరం తర్వాత తీసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మొత్తం డబ్బు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు రిటైర్మెంట్ తర్వాత 55 ఏళ్ల వయసు పూర్తి అయితే, శాశ్వత వైకల్యం, ఉద్యోగం తగ్గింపు, స్వచ్ఛంద రిటైర్మెంట్, విదేశాలకు శాశ్వతంగా వెళ్లడం వంటి సందర్భాల్లో మొత్తం ఈపీఎఫ్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

