జూన్‌తో పోలిస్తే జూలైలో అమ్మకాలు తగ్గడానికి మరో కారణం కూడా ఉంది. సాధారణంగా పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఉండే జూన్ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతాయి. అందువల్ల ఆ నెలలో ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది. విమాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు జూలై 1 నుంచి 15 వరకు స్వల్పంగా 0.7 శాతం పెరిగి 3,15,400 టన్నులకు చేరాయి. అయితే జూన్ తొలి 15 రోజుల్లో నమోదైన 3,51,400 టన్నులతో పోలిస్తే 10.3 శాతం తక్కువగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

