ప్రభన్యూస్

Pensioners Alert: పెన్షన్ డబ్బులు కావాలంటే వెంటనే ఈ పని చేయండి.. ఇంకా 15 రోజులే గడువు! | బిజినెస్


Last Updated:

Pensioners Alert: మీకు ప్రతి నెలా పెన్షన్ వస్తోందా? అయితే ఈ విషయం అస్సలు మర్చిపోవద్దు. నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడవచ్చు. అయితే బ్యాంకుకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని ఈ పని పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

News18
News18

దేశవ్యాప్తంగా పెన్షన్ పొందుతున్న కోట్లాది మందికి ముఖ్యమైన అలర్ట్. ప్రతి నెలా ఎలాంటి ఆటంకం లేకుండా పెన్షన్ డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే వెంటనే ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాలి. అదే లైఫ్ సర్టిఫికేట్ (Life Certificate) లేదా జీవిత ధృవీకరణ పత్రం సమర్పించడం. 2026 సంవత్సరానికి సంబంధించి నవంబర్ 30లోగా ఈ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అంటే, పెన్షనర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఇంకా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. గడువులోగా సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

లైఫ్ సర్టిఫికేట్ ఎందుకు తప్పనిసరి?

పెన్షన్ పొందుతున్న వ్యక్తి జీవించి ఉన్నారని నిర్ధారించుకోవడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్‌ను కోరుతుంది. పెన్షన్ డబ్బులు అర్హులైన వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అయ్యేలా చూడటంతో పాటు, పెన్షన్ పేరుతో జరిగే అక్రమాలను అరికట్టడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మరణించిన వ్యక్తుల పేరుతో పెన్షన్ డబ్బులు కొనసాగకుండా నిరోధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

అందుకే ప్రతి పెన్షనర్ నిర్ణీత సమయంలోగా తన జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఒకవేళ నవంబర్ 30లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే పెన్షన్ చెల్లింపులు తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పెన్షన్‌ను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి రావచ్చు. కాబట్టి చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ఈ పని పూర్తి చేసుకోవడం మంచిది.

స్మార్ట్‌ఫోన్‌తో ఇంట్లోనే లైఫ్ సర్టిఫికేట్..

పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డిజిటల్ సేవల ద్వారా ఇంటి నుంచే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వారికి UMANG యాప్‌లో ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయం అందుబాటులో ఉంది. ఇందుకోసం అవసరమైన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని, సూచించిన విధంగా మొబైల్ కెమెరా ముందు ముఖాన్ని స్కాన్ చేయాలి. ఆధార్ ఆధారిత గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను రూపొందించుకోవచ్చు. దీనివల్ల బ్యాంకు శాఖకు వెళ్లే అవసరం తగ్గుతుంది. స్మార్ట్‌ఫోన్ లేని వారు, యాప్‌లను ఉపయోగించడం తెలియని వృద్ధులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) అందించే డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ సదుపాయం ద్వారా పోస్ట్‌మ్యాన్ నేరుగా పెన్షనర్ ఇంటికి వచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ రూపొందించే ప్రక్రియలో సహాయం చేస్తారు. ఇందుకోసం 033-22029000 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: 8th Pay Commission: ఉద్యోగులకు ఒక్కసారిగా పెరగనున్న జీతాలు.. ఒక్కొక్కరి భారీగా పెన్షన్లు.. ఇక పండగే?

ఆన్‌లైన్ విధానాలు ఉపయోగించలేని వారు మరో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవచ్చు. తమ పెన్షన్ ఖాతా ఉన్న బ్యాంకు శాఖను లేదా అందుబాటులో ఉన్న EPFO కార్యాలయం, కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ను సందర్శించి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. అక్కడ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్, పోస్ట్‌మ్యాన్ సేవ లేదా బ్యాంకు శాఖ.. ఇలా అందుబాటులో ఉన్న మార్గాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించండి. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందుగానే ఈ పని పూర్తి చేసుకుంటే మీ పెన్షన్ చెల్లింపులకు ఆటంకం కలగకుండా చూసుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 1:32 pm Digital Edition : Prabhanews
Pensioners Alert: పెన్షన్ డబ్బులు కావాలంటే వెంటనే ఈ పని చేయండి.. ఇంకా 15 రోజులే గడువు! | బిజినెస్

Last Updated:Nov 15, 2026 1:18 PM ISTPensioners Alert: మీకు ప్రతి నెలా పెన్షన్ వస్తోందా? అయితే ఈ విషయం అస్సలు మర్చిపోవద్దు. నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడవచ్చు. అయితే బ్యాంకుకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని ఈ పని పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
News18దేశవ్యాప్తంగా పెన్షన్ పొందుతున్న కోట్లాది మందికి ముఖ్యమైన అలర్ట్. ప్రతి నెలా ఎలాంటి ఆటంకం లేకుండా పెన్షన్ డబ్బులు మీ బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే వెంటనే ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాలి. అదే లైఫ్ సర్టిఫికేట్ (Life Certificate) లేదా జీవిత ధృవీకరణ పత్రం సమర్పించడం. 2026 సంవత్సరానికి సంబంధించి నవంబర్ 30లోగా ఈ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అంటే, పెన్షనర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఇంకా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. గడువులోగా సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.లైఫ్ సర్టిఫికేట్ ఎందుకు తప్పనిసరి?పెన్షన్ పొందుతున్న వ్యక్తి జీవించి ఉన్నారని నిర్ధారించుకోవడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్‌ను కోరుతుంది. పెన్షన్ డబ్బులు అర్హులైన వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అయ్యేలా చూడటంతో పాటు, పెన్షన్ పేరుతో జరిగే అక్రమాలను అరికట్టడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మరణించిన వ్యక్తుల పేరుతో పెన్షన్ డబ్బులు కొనసాగకుండా నిరోధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.అందుకే ప్రతి పెన్షనర్ నిర్ణీత సమయంలోగా తన జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఒకవేళ నవంబర్ 30లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే పెన్షన్ చెల్లింపులు తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పెన్షన్‌ను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి రావచ్చు. కాబట్టి చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ఈ పని పూర్తి చేసుకోవడం మంచిది.స్మార్ట్‌ఫోన్‌తో ఇంట్లోనే లైఫ్ సర్టిఫికేట్..పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. డిజిటల్ సేవల ద్వారా ఇంటి నుంచే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వారికి UMANG యాప్‌లో ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయం అందుబాటులో ఉంది. ఇందుకోసం అవసరమైన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని, సూచించిన విధంగా మొబైల్ కెమెరా ముందు ముఖాన్ని స్కాన్ చేయాలి. ఆధార్ ఆధారిత గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను రూపొందించుకోవచ్చు. దీనివల్ల బ్యాంకు శాఖకు వెళ్లే అవసరం తగ్గుతుంది. స్మార్ట్‌ఫోన్ లేని వారు, యాప్‌లను ఉపయోగించడం తెలియని వృద్ధులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) అందించే డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఈ సదుపాయం ద్వారా పోస్ట్‌మ్యాన్ నేరుగా పెన్షనర్ ఇంటికి వచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ రూపొందించే ప్రక్రియలో సహాయం చేస్తారు. ఇందుకోసం 033-22029000 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.ఇవి కూడా చదవండి: 8th Pay Commission: ఉద్యోగులకు ఒక్కసారిగా పెరగనున్న జీతాలు.. ఒక్కొక్కరి భారీగా పెన్షన్లు.. ఇక పండగే?ఆన్‌లైన్ విధానాలు ఉపయోగించలేని వారు మరో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవచ్చు. తమ పెన్షన్ ఖాతా ఉన్న బ్యాంకు శాఖను లేదా అందుబాటులో ఉన్న EPFO కార్యాలయం, కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ను సందర్శించి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. అక్కడ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్, పోస్ట్‌మ్యాన్ సేవ లేదా బ్యాంకు శాఖ.. ఇలా అందుబాటులో ఉన్న మార్గాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించండి. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందుగానే ఈ పని పూర్తి చేసుకుంటే మీ పెన్షన్ చెల్లింపులకు ఆటంకం కలగకుండా చూసుకోవచ్చు.మరింత చదవండి

Source link