Last Updated:
Pension Plan | రిటైర్మెంట్ కోసం ప్రత్యేక ఫండ్‌ను ఏర్పర్చుకోవడంలో కస్టమర్లకు సహాయపడేలా స్మార్ట్ వెల్త్ పెన్షన్ ప్లాన్‌ను ఆవిష్కరించింది ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్.
భారతదేశపు అగ్రగామి డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సేవల కంపెనీ ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో భాగమైన, జీవిత బీమా రంగ అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘ఏబీఎస్ఎల్ఐ స్మార్ట్ వెల్త్ పెన్షన్ ప్లాన్’ పేరిట యూనిట్ లింక్డ్ నాన్-పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ పెన్షన్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. కస్టమర్లు తమ భవిష్యత్ అవసరాల కోసం ఈక్విటీ ఆధారిత రిటైర్మెంట్ ఫండ్‌ను నిర్మించుకోవడంతో పాటు రిటైర్మెంట్ సమయంలో యాన్యుటీ ద్వారా జీవితకాలం పాటు క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించే వనరుగా ఉపయోగించుకునేలా ఈ ప్లాన్ రూపొందించబడింది. సాధారణంగా చాలా మంది కస్టమర్లు తమ పిల్లల చదువులు, ఇల్లు లేదా ఫ్యామిలీ వెకేషన్ మొదలైన జీవిత లక్ష్యాల కోసం ప్రణాళికలు వేసుకునే క్రమంలో, రిటైర్మెంట్ ప్లానింగ్ వెనుకబడిపోతుంది. కానీ వాస్తవం ఏమిటంటే, రిటైర్మెంట్ తర్వాత ఆదాయం రావడం నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఏబీఎస్ఎల్ఐ స్మార్ట్ వెల్త్ పెన్షన్ ప్లాన్ అనేది రిటైర్మెంట్ అవసరాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ కొత్త తరపు వినూత్నమైన ఈక్విటీ ఆధారిత పథకం ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు తోడ్పడుతుంది. ఇది కస్టమర్లు తమ రిటైర్మెంట్ ఫండ్‌ను నిర్మించుకునేందుకు సహాయకరంగా ఉంటుంది. ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
1. ప్లాన్ ఆప్షన్లు: వివిధ రకాల ప్రయోజనాలు, ప్రీమియంలు ఉండే అడ్వాంటేజ్, ప్రైమ్, ఎలీట్ (Elite) ఆప్షన్ల నుంచి కస్టమర్లు ఎంచుకోవచ్చు.
2. సింగిల్, జాయింట్ లైఫ్: కస్టమర్లకు వెసులుబాటు ఉండేలా ఈ ప్లాన్‌లో సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ ఆప్షన్లు ఉంటాయి. జాయింట్ లైఫ్ ఆప్షన్లో పాలసీదారుల్లో ఒకరు కన్నుమూసినా పాలసీ కొనసాగేలా ప్రీమియం వెయివర్ ఆప్షన్ ఉంటుంది. ఫలితంగా కస్టమర్ల రిటైర్మెంట్ లక్ష్య సాధనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్లాన్ కొనసాగుతుంది.
3. ఇన్వెస్ట్మెంట్ ఎంపిక: మీ రిస్కు ప్రొఫైల్, రిటైర్మెంట్ లక్ష్యాలకు అనుగుణంగా 5 ఫండ్స్, 4 ఇన్వెస్ట్మెంట్ వ్యూహాల నుంచి ఎంచుకోవచ్చు.
4. HER ప్రయోజనం: మహిళలకు ప్రత్యేక ఆర్థిక ప్రణాళికలు అవసరమని గుర్తించినందున, పురుష పాలసీదారులతో పోలిస్తే మహిళా పాలసీదారులకు ఈ ప్లాన్ మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.
5. ఫండ్ బూస్టర్స్: పాలసీ వ్యవధిలో ఈ ప్లాన్ అనేది ప్రీమియం అలొకేషన్ చార్జీల్లో 600 శాతం వరకు ఫండ్ వేల్యూకి తిరిగి జోడిస్తుంది. పాలసీ తీసుకున్న 6వ సంవత్సరం నుంచి వార్షికంగా లాయల్టీ అడిషన్స్ ఉంటాయి. అలాగే, వెస్టింగ్ సమయానికి సంబంధించి సగటు ఫండ్ విలువ 1 శాతం వరకు వార్షిక బూస్టర్ కూడా అందిస్తుంది.
“నేడు రిటైర్మెంట్ అంటే తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడం, జీవితాన్ని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆస్వాదించే విధమైన స్వేచ్ఛతో కూడుకున్నదై ఉంటోంది. దీన్ని సాధించాలంటే తొలి నాళ్ల నుంచి ఆలోచనాత్మకమైన ఆర్థిక ప్రణాళికలు పాటించాల్సి ఉంటుంది. ఏబీఎస్ఎల్ఐ స్మార్ట్ వెల్త్ పెన్షన్ ప్లాన్ ద్వారా కస్టమర్లు తమ భవిష్యత్ లక్ష్యాల సాధన కోసం రిటైర్మెంట్ ఫండ్‌ను నిర్మించుకునేందుకు అవసరమైన సాధనాన్ని, దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించాలనేది మా లక్ష్యం” అని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ & సీఈవో కమ్లేష్ రావు తెలిపారు.

